Deeparadhana: చాలా మందికి ప్రతి రోజూ ఇంట్లో పూజ చేయడం అలవాటుగా ఉంటుంది. అయితే దీపారాధన విషయానికి వచ్చినప్పుడు ఇంట్లో ఆడవాళ్లు దీపారాధన చేయాలా? మగవారు చేయాలా అనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది. ఈ సందేహాల నివృత్తి కోసం ఈ కథనంలో తెలుసుకోండి. (Deeparadhana)
ప్రతి ఇంట్లో నిత్యం దీపారాధన అనేది జరగాలని హిందూ ధర్మం చెబుతుంది. పురాణాలు చెప్పిన ప్రకారం.. ఏ ఇంట్లో నిత్య దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో సిరిసంపదలకు ఢోకా ఉండదని చెబుతారు. అయితే, దీపారాధన చేయడంలో అనేక మందిక రకరకాల అనుమానాలు, సందేహాలు కలుగుతుంటాయి. వాటిని నివృత్తి చేసుకోవడం కోసం అనేకమందిని సంప్రదిస్తూ ఉంటారు. ఇంట్లో దీపారాధన ఆడవారు చేయాలా? మగవారు చేయాలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
ఇద్దరూ కూర్చొని దీపారాధన చేసిన అనంతరం భర్త తదుపరి దేవతారాధన, పూజలు చేసుకోవచ్చంటున్నారు. ఇలా ఏ ఇంట్లో అయితే పురుషుడు అధికారికంగా తీసుకొని దేవతార్చన చేస్తాడో ఆ ఇంట్లో అభివృద్ధి వేగంగా జరుగుతుందని పెద్దలు చెబుతున్నారు. దీపం వెలిగించడం అంటే చైతన్యం కావడం, ఆనందాన్ని విస్తరింపజేయడం అని చెబుతున్నారు. ప్రస్తుత జీవన శైలిలో ఎవరికి వారు బిజీగా గడుపుతున్నప్పటికీ ఉన్న సమయంలోనే దీపారాధన చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఇంట్లో దీపారాధన ఆడవారే చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తొలుత ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకొని, స్నానాదులు పూర్తి చేసుకున్నాక పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాల్సింది ఆడవారే. తర్వాత భర్త నిద్ర లేచి స్నానం పూర్తి చేసుకున్నాక పూజలో కూర్చోవాలని చెబుతున్నారు. ఇలా భర్త కూర్చున్నాక భార్య దీపారాధన చేసి తదుపరి తన వంటింటి పనుల్లో నిమగ్నం కావాలని చెబుతున్నారు.
రోజూ దీపారాధన చేస్తే ఏం జరుగుతుంది?
దీపారాధన చేయడం కూడా కష్టం అయ్యే వారి కుటుంబాల్లో పారదర్శకత లోపిస్తుందని చెబుతున్నారు. దీపాన్ని వెలిగించడం వల్ల అన్ని సాధన అవుతాయంటున్నారు. ఇంట్లో దీపాన్ని వెలిగించడం కూడా ఒక సంకల్పంగా తీసుకోవాలని చెబుతున్నారు.ఉద్యోగం ఒక బాధ్యతగా రోజూ చేస్తున్నట్లుగానే సంకల్పంగా తీసుకొని రోజూ దీపారాధన చేయాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు రోజూ ఒకే సమయానికి దీపాన్ని వెలిగించేలా చూసుకోవాలంటున్నారు.
Read Also : Deepam: మహిళలు పుట్టింటి నుంచి దీపం తెచ్చుకుంటే ఏమవుతుంది? ఫలితాలు ఎలా ఉంటాయి?