Deepam: ఆడవారు పుట్టింటి నుంచి దీపం తెచ్చుకుంటే ఏం జరుగుతుంది? పుట్టింటి నుంచి తీసుకురావొచ్చా? అనే సందేహాలు చాలా మందికి కలుగుతుంటాయి. గురు గ్రహ బలం చేకూరాలంటే కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆడవారు పుట్టింటి నుంచి దీపం కుందులను తెచ్చుకొని నిత్యం ఆ దీపాలను వెలిగిస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో భోగ భాగ్యాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. పుట్టింటి సౌఖ్యం, ఆశీస్సులతో అత్త వారింట్లో సుఖ సంతోషాలు తెచ్చుకోవచ్చని సూచిస్తున్నారు. (Deepam)
పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగు పెట్టిన మగువలు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. అత్తవారింటిలో అన్నీ శుభాలు కలగాలని కోరుకుంటారు. ఈ క్రమంలో పూజలు చేయడం పరిపాటిగా ఉంటుంది. అయితే, పుట్టింటి నుంచి తెచ్చుకొనే కొన్ని వస్తువులతో అత్తింట్లో ఐశ్వర్యం పెరుగుతుందా? అనే అనుమానాలు చాలా మందికి కలుగుతుంటాయి. ముఖ్యంగా పుట్టింటి వారు పెట్టే చీర, సారె విషయాల్లోనూ అనేక పద్ధతులు పాటిస్తుంటారు.
Read Also : Devotional Tips Deepalu: దీపాలను ఆర్పే విధానం తెలుసా? అగ్గిపుల్లను కూడా ఇలా ఆర్పేయరాదు!
మరోవైపు గురు గ్రహ బలం కోసం కొన్ని చిన్న చిన్న పనులు చేయాలని సూచిస్తున్నారు. ఆరు బయట లేదా ఊరి బయట చీమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కిలోకు తక్కువ కాకుండా చక్కెరను వాటికి ఆహారంగా చల్లి రావాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాటికి ఆకలి తీరుతుందని, తద్వారా అలా చేసిన వ్యక్తుల ఇంట్లో సిరిసంపదలకు ఢోకా ఉండదని చెబుతున్నారు.
ఒంటరిగా జీవించే సాధువులకు నెయ్యి దానం చేయడం వల్ల శుభం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే మంచిరకం బియ్యాన్ని మీరుండే ఇంటికి పడమరదిక్కున ఉన్న శివాలయంలోని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల గురు గ్రహ బలం పెరిగి శుభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాగే తొమ్మిది వత్తుల నేతి దీపాన్ని ఇంటికి ఈశాన్య దిక్కున పెట్టి గురు స్తోత్రం చేయడం వల్ల మంచి జరుగుతుందంటున్నారు. అలాగే శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రాలను సందర్శించాలని సూచిస్తున్నారు.
Read Also: Deepam: దీపారాధన వేళ ఇలా చేస్తే ఇల్లు శ్మశానమేనట.. ఆసక్తికర విషయాలివే..