KLIN KAARA: క్లీంకార.. రామ్‌ చరణ్‌, ఉపాసన తనయ పేరు ఇదే.. అర్థం తెలుసా?

KLIN KAARA: మెగాస్టార్‌ చిరంజీవి తన తనయుడు రామ్‌ చరణ్‌, ఉపాసనల కుమార్తె పేరును “క్లీంకార”గా (KLIN KAARA) పెట్టినట్లు వెల్లడించారు. రామ్‌ చరణ్‌, ఉపాసనలకు పెళ్లి అయిన 11 ఏళ్ల తర్వాత పుట్టిన బిడ్డ కావడంతో ఇరు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ క్రమంలో ఆ బిడ్డకు పేరు పెట్టడంపై మెగాస్టార్‌ కాస్త కసరత్తు చేశారట. ఎన్నో పేర్లు పరిశీలించిన తర్వాత లలితా సహస్ర నామాల్లోంచి ఓ పేరును ఎంపిక చేసినట్లు మెగాస్టార్‌ తెలిపారు. పాప పేరు “క్లీంకార కొణిదెల”గా పెట్టామని సోషల్‌ మీడియా వేదికగా చిరంజీవి పేర్కొన్నారు. లలితా సహస్రనామం నుంచి ఈ పేరును తీసుకున్నామని, క్లీంకార అంటే ప్రకృతి స్వరూపాన్ని, అమ్మవారి అత్యున్నత శక్తిని ఇది సూచిస్తుందని మెగాస్టార్‌ తెలిపారు.

మా చిన్న యువరాణి ఇలాంటి లక్షణాలను ఇనుమడింపజేసుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని మనసారా కోరుకుంటున్నట్లు మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) తెలిపారు. రామ్‌ చరణ్‌, (Ram Charan) ఉపాసన (Upasana) 2012లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం జరిగిన 11 సంవత్సరాల తర్వాత వీరికి పాప పుట్టిన నేపథ్యంలో సంబరాలు మిన్నంటాయి. ఉపాసన ప్రెగ్నెన్సీ కాస్త లేటు కావడంపై ఆమె ఇటీవల రియాక్ట్‌ అయ్యింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సమాజం కోరుకున్నప్పుడు కాకుండా తాను తల్లిని కావాలనుకున్నప్పుడే గర్భం దాల్చడం గర్వంగా ఉందని చెప్పింది. పెళ్లి జరిగిన దశాబ్దం తర్వాత తాము పిల్లల్ని కనాలని అనుకున్నామని తెలిపింది. ఎందుకంటే ఇదే సరైన సమయమని పేర్కొంది. తామిద్దరం తమ రంగాల్లో రాణిస్తున్నట్లు ఉపాసన వెల్లడించింది. ఇప్పుడు బాగా ఎదిగామని తెలిపింది. ఆర్థికంగా బలంగా తయారయ్యామని చెప్పింది. తమ పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చే స్థాయి ఇప్పుడు తమకు ఉందని ఆ ఇంటర్వ్యూ సందర్భంగా ఉపాసన వివరించింది.

ఇక మెగాస్టార్‌ చిరంజీవి తన మనవరాలి పేరును ప్రకటించిన సందర్భంగా ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. అందులో మెగాస్టార్‌ చిరంజీవి తన మనవరాలిని చూస్తూ మురిసిపోతున్నారు. తన తండ్రి.. తన బిడ్డను చూసి సంబరపడుతున్న వైనాన్ని రామ్‌ చరణ్‌ పరిశీలిస్తున్నారు. ఆ చిత్రంలో చిరువైపే రామ్‌ చరణ్‌ చూస్తూ కనిపించారు. ఇక చిరు సతీమణి కెమెరాకు పోజిచ్చారు. ఉపాసన, ఆమె తల్లిదండ్రులు చిరుదరహాసంతో ఫొటోకు పోజులిచ్చారు. అయితే, పాప కెమెరాకు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు.

ఉపాసన డెలివరీకి వచ్చిన వీడియోల్లోనూ, ప్రసవం తర్వాత వీడియోల్లోనూ ఒకే తరహా హావభావాలు కనిపించాయి. బిడ్డను కెమెరాలకు కనిపించకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్లారు. మా ఇంట మహా లక్ష్మి పుట్టిందంటూ ఆ సందర్భంగా చిరంజీవి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. సెలబ్రిటీ తనయ కావడంతో మీడియా ఫోకస్‌మొత్తం అక్కడే పెట్టింది. తాజాగా మెగాస్టార్‌ మనవరాలి పేరును క్లీంకారగా ప్రకటించడంతో ఈ న్యూస్‌ ఇప్పుడు ఫిల్మ్‌ సర్కిళ్లలోనూ, ఇటు మెగా అభిమానుల సర్కిల్లోనూ సంతోషకర వార్తగా చర్చించుకుంటున్నారు.

Read Also : Ram Charan Daughter: మెగా ఇంట ప్రిన్సెస్.. కుమార్తెకు జన్మనిచ్చిన ఉపాసన

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles