గురువారం, 22 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Business

Gold Price today 18 July 2023: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. నేడు పసిడి, వెండి రేట్లు ఇవీ..

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 18 జూలై 2023

Gold Price today 18 July 2023: బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. ఇండియాలో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ.20, అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.20 చొప్పున తగ్గింది. వెండి ధర కిలో రూ.200 పెరిగింది. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచుతుందా, పాజ్‌ చేస్తుందా అనే అనుమానాల మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,956 డాలర్ల వద్ద ఉంది. (Gold Price today 18 July 2023)

తెలుగు రాష్ట్రాల్లో నేడు పసిడి, వెండి రేట్లు ఇలా..

తెలంగాణలోని హైదరాబాద్‌ గోల్డ్‌ మార్కెట్‌లో (Hyderabad Gold) 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,980గా ఉంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,980 వద్ద నమోదైంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.81,500 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో (Vijayawada Gold Price) ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్‌ గోల్డ్‌ ధర రూ.54,980 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ పసిడి ధర రూ.59,980 గా కొనసాగుతోంది. బెజవాడ సిటీలో కిలో వెండి ధర రూ.81,500 వద్ద ఉంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, ప్రొద్దుటూరు, అనంతపురం, తాడిపత్రి పట్టణాల్లోనూ గోల్డ్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో విజయవాడ రేట్లే అమలు అవుతాయి.

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఇవాళ పసిడి రేట్లు ఇలా..

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి రేటు నేడు రూ.55,360 గా కొనసాగుతోంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,390 వద్దకు చేరింది. తమిళనాడులోని కోయంబత్తూరు పట్టణంలో కూడా బంగారం, వెండి ధరలు చెన్నైలో ఉన్న రేట్లే ఉంటాయి.

దేశ వాణిజ్య రాజధానిగా పేరు గాంచిన ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్‌ ప్రైస్ రూ.54,980గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ.59,980 వద్ద కొనసాగుతోంది. అక్కడి మరో ముఖ్య నగరం పుణెలో కూడా ముంబైలో కొనసాగుతున్న రేటే అమల్లో ఉంటుంది.

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి ధర రూ.55,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,150 గా నమోదైంది. జైపూర్‌, లక్నో నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతాయి.

మరోవైపు 10 గ్రాముల ప్లాటినం ధర ఇవాళ రూ.440 పెరిగింది. రూ.25,920 వద్ద కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా మిగతా అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ప్లాటినం విషయంలో ఒకే ధర అమల్లో ఉంటుంది.

Read Also : Ileana D’Cruz: నా చెలికాడు ఇతడే.. బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ఇలియానా

ట్యాగ్స్: , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading