గురువారం, 17 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Annadata Sukhibhava : తొలి ఏడాది కట్.. ఆగస్ట్ 2న ‘అన్నదాత సుఖీభవ’ నిధులు

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శుక్రవారం, 1 ఆగస్టు 2025

Annadata Sukhibhava : ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ఆగస్ట్ 2న అమలు చేయనున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు లబ్ది పొందుతారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5,000 చొప్పున మొత్తం రూ.2,342.92 కోట్ల నిధుల్ని వారి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. Annadata Sukhibhava

ఆగస్ట్ 2న ఒక్కో రైతుకు మొత్తం రూ.7,000 జమ
ఏడాదికి కేంద్రం ఇచ్చే రూ.6,000 సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14,000 ఇవ్వనుంది. మొదటి, రెండో విడత రూ.5 వేల చొప్పున, అలాగే మూడో విడత రూ.4 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ రూ.14 వేలను 3 విడతలుగా అందించాలని గతంలోనే నిర్ణయించారు. కేంద్రం మొదటివిడతగా రూ.2,000 చొప్పున రూ.831.51 కోట్లు రైతులకు సాయం చేయనుంది. దీంతో ఆగస్ట్ 2న కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు రూ.7,000 జమ చేసినట్టు అవుతుంది.

మరోవైపు ‘అన్నదాత సుఖీభవ’కు సంబంధించి 59,750 గ్రీవెన్సులు నమోదుకాగా… వాటిలో 58,464 దరఖాస్తులను పరిష్కరించారు. ఈ పథకంపై సందేహాలను నివృత్తి చేసేందుకు 155251 టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులో ఉంచారు.

తొలి ఏడాది మోసం
కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి ఏడాది అన్నదాత సుఖీభవ కింద రైతులకు సాయం అందించలేదు. మరోవైపు రైతుల సంఖ్య కూడా గత ప్రభుత్వంతో పోల్చితే గణనీయంగా తగ్గింది. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. రెండో ఏడాది జూన్, జూలై ముగిసినా ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల సంఖ్య 53.58 లక్షల నుంచి 46.85 లక్షలకు కుదించారు.

ఇవీ చదవండి: Buggana: అన్నదాత సుఖీభవకు రూ.1000 కోట్లు సరిపోతాయా?
Manifesto : ప్రతి ఇంటికీ ఎగవేతలే.. మేనిఫెస్టోతో నిలదీయండి

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading