Brigida Saga: తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీసులతో ప్రేక్షకులకు దగ్గరైన నటి బ్రిగిడ సాగా తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆనంద్ రామ్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా తన వివాహ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అభిమానులు ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయారు. భర్త ఆనంద్ రామ్‌తో కలిసి ఉన్న పెళ్లి ఫొటోలను బ్రిగిడ సాగా సోషల్ మీడియాలో పంచుకుంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో ఈ వివాహ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. పూల దండలు మార్చుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Brigida Saga: బ్రిగిడ సాగా పెళ్లి.. ప్రియుడు ఆనంద్ రామ్‌తో వైవాహిక బంధంలోకి యంగ్ హీరోయిన్
Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 17 సెప్టెంబర్ 2026

AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి
ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.





