YSRCP Bus Yatra Kakinada: సామాజిక సాధికారత సాధించి మహనీయుల ఆశయాలు నెరవేర్చిన సీఎం జగన్‌

YSRCP Bus Yatra Kakinada: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రంలో సామాజిక సాధికారత సాకారమైందని వైయస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు కొనియాడారు. ఉద్యమాలు చేసిన మహనీయుల ఆశయాలను సీఎం జగన్‌ నెరవేరుస్తున్నారని చెప్పారు. వైయస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర (YSRCP Bus Yatra Kakinada) 9వ రోజు కాకినాడ రూరల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు బూడి ముత్యాల నాయుడు, పినిపె విశ్వరూప్, తానేటి వనిత, దాడిశెట్టి రాజా, ఎంపీలు వంగా గీత, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, అనిల్‌ కుమార్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. బస్సుయాత్రలో నేతలు ఏమన్నారంటే.. (YSRCP Bus Yatra Kakinada)

బూడి ముత్యాలనాయుడు, ఉపముఖ్యమంత్రి

* స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జగన్ పాలనలోనే సామాజిక సాధికారత సాధ్యమైంది.
* బీసీ మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా వేదిక మీదకు వచ్చి మాట్లాడుతున్నానంటే జగనన్న ఆలోచన విధానం వల్లే సాధ్యమైంది.
* రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలని అందరూ ఆలోచన చేయాలి.
* సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నాలుగున్నరేళ్లుగా అమలు చేస్తున్నారు.

* అప్పటి వరకు ఉన్న 65 సంవత్సరాల పింఛన్‌ వయసు 60 ఏళ్లకు తగ్గించారు.
* అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇస్తామని చెప్పి మూడు విడతలు ఇచ్చారు.
* అక్కచెల్లెమ్మలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని బాబు మోసం చేశాడు. కానీ జగన్ నాలుగు విడతలుగా చెల్లిస్తున్నారు.
* రైతుల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేస్తే, రైతు భరోసా ఇస్తున్న సీఎం జగనన్న.

* ఇంగ్లీషు మీడియం తెచ్చి ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ స్కూళ్లకు మించి అభివృద్ధి చేస్తున్నారు.
* తల్లి సంపాదన గురించి ఆలోచించి తల్లి ఖాతాల్లో రూ.15 వేలు అమ్మ ఒడి కింద ఇస్తున్న జగనన్న.
* ఈ పథకాలు జగన్ సీఎంగా ఉంటేనే కొనసాగుతాయి.

పినిపె విశ్వరూప్, మంత్రి

* బాబు హయాంలో పేపర్లకే పరిమితమైన సామాజిక సాధికారత.. జగనన్న పాలనలో చేతల్లో చూపారు.
* రాజ్యాధికారంలో ఎవరి వాటా వారికిచ్చి సామాజిక న్యాయం చేశారు.
* బాబు పాలనలో ఎస్టీలకు, మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం లేదు.
* ఎస్సీలు, బీసీలకు, ముస్లింలకు, కాపులకు, ఎస్టీలకు ఉపముఖ్యమంత్రి పదవులిచ్చిన సీఎం జగన్‌.

* సామాజిక సాధికారతకు ఛాంపియన్‌ ఆఫ్‌ ఛాంపియన్‌ జగనన్న.
* బాబు హయాంలో 30 లక్షల మందికి పింఛన్లు ఇస్తే, 64 లక్షల మందికి జగనన్న ఇస్తున్నారు.
* కేవలం ఎన్నికల కోసమే 650 వాగ్దానాలు ఇచ్చిన తుంగలో తొక్కిన బాబు.
* 2024లో జగనన్న సీఎం కాకపోతే చదువుల యజ్ఞం మధ్యలో ఆగిపోతుంది.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల చదువులు, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్నను మళ్లీ సీఎంగా చేసుకోవాలి.

తానేటి వనిత, హోంమంత్రి

* కేబినెట్‌లో బీసీ మంత్రులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు 17 మంది ఉన్నాం.
* ఏ కార్పొరేషన్, మేయర్, మున్సిపల్‌ చైర్మన్‌ చూసినా అందరికీ అవకాశాలు మెండుగా ఇచ్చారు.
* అంబేద్కర్‌ రాజ్యాంగ స్పూర్తి, జ్యోతిరావుపూలే ఆలోచనలు, జగ్జీవన్‌ రామ్‌ పాలనాదక్షత వల్ల జగనన్న సామాజిక న్యాయం చేయగలిగారు.
* దళిత మహిళగా హోంమంత్రిగా మీ ముందు నిలబడి ఉన్నానంటే రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించామని చెప్పడానికి గర్వపడుతున్నా.

* జగనన్నకు ముందు, జగనన్నకు తర్వాత అని మాట్లాడేలా సామాజిక న్యాయం పాటించి మనందర్నీ గౌరవించి, స్థానం కల్పించిన జగనన్న.
* దళితుల పక్షాన జగనన్న నిలబడి ధైర్యాన్ని ఇచ్చారు. బలహీనుల పక్షాన నిలబడి వారికి బలమయ్యారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా ధైర్యాన్నివ్వలేదు.

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మంత్రి

* చంద్రబాబు చేత మోసపోయిన సామాజిక వర్గాలు ఇప్పుడు పురివిప్పుతున్నాయి.
* చంద్రబాబు రైతుల్ని మోసం చేశాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల అప్పులు తీరుస్తానన్ని మోసం చేశాడు.
* జగనన్న చెప్పిన మాట ప్రకారం 4 దఫాల్లో తీరుస్తున్నాడు.

* చంద్రబాబుకు ఆయన కులం మాత్రమే కనపడుతుంది. కానీ జగనన్నకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కనపడతారు.
* అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రాస్తే దాని ఫలాలు ప్రజలకు అందిస్తున్న జగనన్న.
* చంద్రబాబు మోసం చేసేందుకు రామోజీ, రాధాకృష్ణ, నాయుడు, పవన్‌ కల్యాణ్‌ను కలుపుకొని పోతున్నాడు.
* ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు జగనన్న వద్ద ఉన్నారు.

మోపిదేవి వెంకటరమణ, ఎంపీ

* అమ్మ ఒడి కావాలని, చేయూత, సున్నావడ్డీ కావాలని ఎవరూ అడగలేదు.
* పేదలకు ఆర్థిక చేయూతనివ్వాలని జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారు.
* బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు రూ.2.40 లక్షల కోట్లిచ్చిన జగనన్న.
* చంద్రబాబు సీఎంగా పని చేసినప్పుడు నిరంతరం ఏ ప్రాజెక్టు పెట్టి రూ.లక్షల కోట్లు కమీషన్లు దండుకోవాలని చూశాడు. పేద ప్రజల సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచన చేయలేదు.

* రాజ్యభసలో నలుగురు బీసీలకు అవకాశం కల్పించిన జగనన్న.
* బీసీలను రాజకీయంగా అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టిన జగనన్న.
* రాజ్యసభ పదవులను వందల కోట్లకు బేరమాడిన చంద్రబాబు.
* 2024లో మళ్లీ జగనన్నే సీఎం కావాలి. అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి.

కన్నబాబు, ఎమ్మెల్యే

* చెప్పిన దానికన్నా ఎక్కువ సంక్షేమం చేస్తున్న జగనన్న. చెప్పాడంటే చేస్తాడంతే అని పేరు తెచ్చుకున్నారు.
* నేను పేదల పక్షం, నా యుద్ధం పెత్తందార్లతో అని ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి.
* కాకినాడ రూరల్‌ పరిధిలో రూ.800 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో వేశారు.
* లక్షకు పైగా లబ్ధిదారులున్నారు. 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే.

* ఎన్ని ఒడిదొడుకులున్నా ఎదుర్కొన్ని నిలబడిన సీఎం జగన్‌.
* సరిగ్గా ఆరేళ్ల కిందట పాదయాత్ర ఈరోజే ప్రారంభించారు.
* చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి వెళ్తూ నాకు దృష్టిలోపం ఉంది, ఆపరేషన్‌ చేయించుకొని వస్తానన్నాడు.
* పేదలు ఆయనకు కనబడరు. సొంత కులస్తులు, పెత్తందార్లు మాత్రమే ఆయనకు కనపడతారు. ఆయన పేదలు కనపడని జనం ఎప్పుడో గమనించారు.

అనిల్‌ కుమార్‌ యాదవ్, ఎమ్మెల్యే

* బీసీలకు అత్యధికంగా పదవులిచ్చిన జగనన్న. మార్కెట్‌ యార్డు చైర్మన్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలున్నారు.
* నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని చెప్పగలిగే సీఎం జగనన్న మాత్రమే.
* అయ్యప్పమాల వేసుకొని చెబుతున్నా. ఆ నాయకుడి కింద పని చేయడం ఏ జన్మలో పుణ్యమో.
* 2024 నుంచి మనం ఇంకా ఎదగాలంటే జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి.

* పక్కనోడు సీఎం అవ్వాలని పార్టీ పెట్టే వ్యక్తి మనకు అవసరమా?
* ఇక్కడేమో టీడీపీతో అంటాడు, తెలంగాణలో బీజేపీతో పొత్తు. టీడీపీ అక్కడేమో కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం.
* మళ్లీ మనం వెనక్కి పోదామా ముందుకు పోదామా అని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ఆలోచన చేయాలి.
* బీసీలకు మంత్రి పదవిస్తే గొర్రెలు, గొడ్లు కాచుకొనేవాడికి మంత్రి పదవిస్తారా? అని విమర్శించారు. శ్రీకృష్ణపరమాత్ముడు, ఏసు ప్రభువు, మహ్మద్‌ ప్రవక్త కూడా గొర్రెలు కాచిన వారే.

ఇదీ చదవండి: Macherla Bus Yatra: సామాజిక సాధికారతను విధానంగా మార్చిన సీఎం జగన్‌.. మాచర్ల బస్సు యాత్రలో నేతలు

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles