Macherla Bus Yatra: స్వాతంత్య్రం వచ్చాక నినాదంగానే మిగిలిన సామాజిక సాధికారతను విధానంగా మార్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని నేతలు కొనియాడారు. సామాజిక సాధికార బస్సు యాత్ర 6వ రోజు పల్నాడు జిల్లా మాచర్లలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎంపీలు విజయసాయిరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు సునీత, కుంభా రవిబాబు, జంగా కృష్ణమూర్తి, చంద్రగిరి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభలో నేతలు ఏమన్నారంటే.. (Macherla Bus Yatra)
అంజాద్ బాషా, ఉపముఖ్యమంత్రి
* స్వాతంత్య్రం వచ్చాక సామాజిక సాధికారతను మాటలకే పరిమితమైన పరిస్థితి.
* నేడు జగనన్న ప్రభుత్వంలో సామాజిక న్యాయం మన విధానంగా మార్చుకున్నారు.
* బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సాధికారత వైపు నడిపిస్తున్నారు.
* 70 శాతంపైగా ఉన్న ఈ సామాజికవర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకున్న గత ప్రభుత్వాలు.
* దేశంలోనే ఏ సీఎం అనలేని విధంగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అన్న జగనన్న.
* గతంలో చంద్రబాబు హయాంలో ఒక్క మైనార్టీ మంత్రీ లేరు.
* నేడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు మామూలు కార్యకర్త నుంచి రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారు,
* రెండోసారి గెలిచాక మంత్రిగా అవకాశం కల్పించారు. ఉపముఖ్యమంత్రిగా చేయడం ఒక చరిత్ర.
* చంద్రబాబు ఐదేళ్లలో మైనార్టీలకు చేసిన ఖర్చు కేవలం రూ.2,650 కోట్లే.
* నాలుగున్నరేళ్లలో రూ.23,176 కోట్లు మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు చేసిన జగనన్న.
* నలుగురు మైనార్టీలకు ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారు. శాసనమండలిలో నలుగురికి అవకాశం ఇచ్చారు.
* మహిళ జఖియా ఖానమ్‌కు డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చారు.
* అన్ని సామాజిక వర్గాలనూ రాజ్యాధికారం కోసం చేయి పట్టుకొని నడిపిస్తున్న జగనన్న.
అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే
* ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వేసిన పెద్దపీట ఈరోజు చూస్తున్నాం.
* రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి బీసీలంటే వెన్నెముకలాగా చేసిన జగనన్న.
* ప్రతి ప్రాంతంలో ప్రజలు ఈ యాత్రకు తండోపతండాలుగా వచ్చి జగనన్నను దీవిస్తున్నారు.
* బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 2024లో టీడీపీని బొందపెడతారు.
* 20 ఏళ్లు అధికారం అనుభవించిన టీడీపీ ఎంత మంది బీసీలను రాజ్యసభసభ్యుల్ని చేసింది.
* జగనన్న నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారు. నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపముఖ్యమంత్రి పదవులిచ్చారు.
* స్వాంత్య్రం వచ్చిన తర్వాత నెల్లూరు నుంచి మొట్టమొదటి బీసీగా నాకు మంత్రి పదవి ఇచ్చారు.
* జగనన్న మమ్మల్ని కాపాడుకునే తీరు చూస్తే ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో అనిపిస్తుంది.
* గుండెలోతుల్లో నుంచి అయ్యప్పమాల వేసుకొని ఈ మాట చెబుతున్నా.
* బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను భుజస్కందాలపై మోసిన జగనన్నను 2024లో మన భుజాన మోయాలి.
* న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారు అని చంద్రబాబు గతంలో లేఖ రాశాడు. ఈరోజు అదే బీసీ న్యాయమూర్తి చంద్రబాబును ఎత్తి లోపలేశారు. ఇది దేవుడి స్క్రిప్టు.
* బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కాలర్ ఎత్తుకొని రొమ్ము విరుచుకొని బతుకుతున్నాం.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే
* నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అనే జగనన్న.. పేద వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు.
* రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అనేక వాగ్దానాలిచ్చి అన్ని వర్గాలనూ మోసం చేశాడు.
* జగనన్న సీఎం అయిన మొదటి రోజు నుంచి పేద వారు, బడుగు, బలహీన వర్గాలను ఆదుకొనేందుకు ఆర్థికంగా సాయం చేశారు.
* ప్రతి పేద కుటుంబానికి లక్షల రూపాయలు సాయం చేశారు.
* కరోనా విపత్తు వచ్చినప్పుడు అన్ని దేశాలూ విలవిలలాడినా జగనన్న ముందుండి పేదవాడికి ఇబ్బంది కలగకుండా చూశారు.
* చంద్రబాబు, లోకేష్ కరోనా సమయంలో ఇంట్లో దాక్కున్నారు.
* రూ.371 కోట్లు పేదల సొమ్ము దోచి చంద్రబాబు జైలుకుపోయాడు.
* స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఇన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు.
* రూ.2,423.22 కోట్లు మాచర్ల నియోజకవర్గానికి జగనన్న మంజూరు చేశారు. ఇందులో 25 శాతమైనా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెచ్చారా?
* వరికపూడిశల ప్రాజెక్టు త్వరలోనే జగనన్నను తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తాం. అలా చేయకపోతే 2024లో నామినేషన్ కూడా వేయను.
లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ
* 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోని వెబ్‌సైట్‌లోంచి తీసేసి మర్చిపోయిన టీడీపీ.
* మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి విషయాన్ని తు.చ. తప్పకుండా కరోనా వచ్చినా ప్రతి పథకాన్నీ ప్రజలకు డైరెక్టుగా ఇచ్చిన జగనన్న.
* ఏ పదవి ఇచ్చినా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకే ముందు ఇచ్చిన సీఎం జగన్.
* బయటి రాష్ట్రాలు కులగణన చేస్తామని, తర్వాత పదవులిస్తామని చెబుతున్నాయి. కానీ జగనన్న నాలుగున్నరేళ్లుగా ఇదే చేశారు.
* నియోజకవర్గానికి మెడికల్‌కాలేజీ తెచ్చుకున్నాం. వరికపూడిశెల పర్మిషన్ తీసుకొచ్చాం. త్వరలో శంకుస్థాపన, పనులు ప్రారంభిస్తాం.
* రూ.3 వేల కోట్లతో మన పార్లమెంటులో హైవేలు సాధించాం.
* జేఎన్టీయూ కాలేజీకి కొత్త బిల్డింగ్ కట్టించాం. 4 కేంద్రీయ విద్యాలయాలు తెచ్చుకోగలిగాం.
నందిగం సురేష్, ఎంపీ
* మన సొమ్మంతా చంద్రబాబు దోచుకొని కొడుకు, మనవడి కోసం దేశ విదేశాల్లో సంపద కూడగట్టుకున్నాడు.
* రూ.371 కోట్లు దోచి స్కిల్‌స్కామ్‌లో దొరికాడు.
* చంద్రబాబును టచ్‌చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము ఆరోగ్యంగా ఉన్నాం. రోగాలు అంటించుకోవాల్సిన పని లేదు.
* చంద్రబాబు ఎస్సీలు, బీసీలు, మైనార్టీల మీద పెత్తనం చేశాడు.
* మన పిల్లలు చదువుకోవడానికి సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం బాట వేస్తే అడ్డుకోవడానికి కోర్టుకెళ్లిన చంద్రబాబు.
* రాజధానిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లస్థలాలిస్తుంటే మళ్లీ కోర్టుకు వెళ్లాడు.
* అదే తాడేపల్లిలో ఉంటూ కూతవేటు దూరంలో మనకు ఇళ్ల స్థలాలిచ్చిన సీఎం జగన్
* నేను ఉన్న స్థలంలో ఎస్సీలు, బీసీలు ఉండాలని సీఎం జగన్ కోరుకున్నాడు.
* అమరావతిలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీల మీద కేసులు పెట్టిన చంద్రబాబు.. తన సామాజిక వర్గంలో ఒక్క వ్యక్తిపై కూడా కేసు పెట్టలేదు.
* మనల్ని చంద్రబాబు జైల్లో పెడితే, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్లమెంటులో కూర్చోబెట్టాడు.
* జగనన్నను కాపాడుకుంటే మన పిల్లల చదువులు బాగుంటాయి. జగనన్న హయాంలోనే ఉద్యోగాలు చేస్తారు.
* చిన్న తప్పు కూడా జరగకుండా అవినీతి మరక లేకుండా పాలన చేస్తున్నాడు.
* ఒక సామాన్యుడిని పార్లమెంటుకు పంపిన వ్యక్తి జగనన్న. గ్రీన్ ఇంకుతో సంతకం చేసే పవర్ ఇచ్చారు.
* మా జీవితాల్లో వెలుగులు నింపుకొనేందుకు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా నిలబెట్టుకుంటామని సీఎం జగన్‌కు చెప్పాలి.
Read Also : Journalist Houses: జర్నలిస్టులకు సీఎం జగన్ తీపికబురు.. అక్రిడేషన్ కలిగిన అందరికీ 3 సెంట్ల స్థలం