బుధవారం, 28 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

YS Jagan in Bheemili: ఫలానా మంచి చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? జగన్‌ స్పీచ్‌తో దద్దరిల్లిన భీమిలి..

Keerthanaa News Deskప్రచురణ తేదీ: ఆదివారం, 28 జనవరి 2024

YS Jagan in Bheemili: భీమిలి బహిరంగ సభలో సీఎం జగన్‌ స్పీచ్‌ కేడర్‌లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. వేలాది మంది కార్యకర్తలకు అభివాదం చేసిన జగన్‌.. అనంతరం మాట్లాడుతూ.. చంద్రబాబును, ఆయన పార్టీని, దుష్టచతుష్టయాన్ని ఓ లెవల్‌లో తూర్పారబట్టారు. (YS Jagan in Bheemili)

* ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశాననిగానీ, తాను ఫలానా మంచి స్కీమును తెచ్చాననిగానీ చెప్పలేక మళ్లీ కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడంటే దానికి అర్థం ఏమిటి?
* దానికి అర్థం.. ప్రజల్లో వారు లేరు అని. చివరికి 2019లో వచ్చినన్ని ఆ 23 స్థానాలు కూడా వాళ్లకు రావని. 175 స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్లకు అభ్యర్థులు కూడా లేరని.
* మరోవంక మన పార్టీని చూడండి. మన పార్టీ చరిత్ర.. ఓ విప్లవ గాథ. మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయగాధ. మన భవిష్యత్ సామాజిక వర్గాల ఇంద్రధనస్సు. మనది వయసుతోపాటు మనసు భవిష్యత్తు ఉన్న పార్టీ.

* మనది గడచిన 56 నెలల్లో అన్ని రంగాల్లోనూ చిత్తశుద్ధితో సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటిలోనూ కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన పార్టీ మనది.
* మన పార్టీ మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఏకంగా 99 శాతం నెరవేర్చిన పార్టీ మనది.
* ఇవాళ నేను గర్వంగా చెబుతున్నా. మోసాన్ని, అబద్ధాలను మీ బిడ్డ నమ్ముకోలేదు. మనం చేసిన మంచిని, ఇంటింటికీ చేసిన అభివృద్ధిని నమ్ముకొని ఈరోజు ప్రజల దగ్గరికి మళ్లీ వెళ్తున్నాడు మీ బిడ్డ.
* మనది పేదరికం, అసమానతల సంకెళ్లను బద్ధలు కొట్టి ప్రతి పేద కుటుంబానికీ మంచి చేస్తూ 21వ శతాబ్ధంలోకి ఆ పేదలందరినీ నడిపిస్తున్న మనసున్న బాధ్యత గల ప్రభుత్వం మనది.
* మీరే చూడండి. ఇంటింటికీ వెళ్లి కొన్ని విషయాలు ప్రతి పేద కుంటుంబానికి వివరించండి.
* 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం. ప్రతి ఒక్కరి భుజస్కందాలపై బాధ్యత పెడుతున్నా.

* ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య జరుగుతోంది. మోసానికి విశ్వసనీయతకు మధ్య జరుగుతోంది. ఈ విషయం ప్రతి ఇంట్లో వెళ్లి చెప్పాలి.
* 650 వాగ్దానాలు చంద్రబాబు 2014లో మేనిఫెస్టోలో ఆయన ఇచ్చింది. అందులో 10 శాతం కూడా అమలు చేయలేదని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* మరోవైపున మీ జగనన్న ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల్లో 99 శాతం అమలు చేసి ప్రతి ఇంట్లోనూ సంతోషాన్ని చూసి సంబరపడుతున్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* మరో విషయం కూడా మీరంతా గమనించాలి. మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కూడా మీ ఇష్టం. కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా ఏ గ్రామమైనా తీసుకోండి. మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా ఆ గ్రామానికి చంద్రబాబు ఏం చేశారంటే చెప్పటానికి ఏమీ కనిపించదు.

read also: YS Jagan Bheemili Meeting: వైయస్ జగన్‌ విశ్వరూపం.. కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడిని కాను.. అర్జునుడిని..
CM Jagan Help to Doctor Couple: డబ్బుదేముంది లేబ్బా.. ముందు ప్రాణం నిలబడనీ..!
Ongole CM jagan Meeting: పేదల ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ పంపిణీ.. సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు
CM Jagan Ready to Elections: ఎన్నికల సమరానికి సీఎం జగన్‌ సిద్ధం.. 18 నుంచి ప్రచార సమర భేరి!

ట్యాగ్స్: , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading