Tirumala Samacharam 19-07-2023: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తులతో సందడి వాతావరణం ఏర్పడింది. శ్రీవారిని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 64,003 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 24,659 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.06 కోట్లు చేకూరింది. (Tirumala Samacharam 19-07-2023)
Read Also : Deepam: మహిళలు పుట్టింటి నుంచి దీపం తెచ్చుకుంటే ఏమవుతుంది? ఫలితాలు ఎలా ఉంటాయి?
తిరుమలలో చిరుత సంచారం
తిరుమలలో చిరుత పులుల సంచారం భక్తులను బెంబేలెత్తిస్తోంది. ఇటీవలే ఓ బాలుడిపై చిరుత అటాక్ చేసి నోట కరచుకొని వెళ్లి.. తర్వాత భక్తుల అరుపులతో, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తతతో బాలుడిని వదిలి వెళ్లింది. తృటిలో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా తిరుమలలో చిరుత సంచారంతో భక్తులు భయాందోళన చెందారు. మొదటి ఘాట్‌లో చిరుతను చూసిన భక్తులు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వరుసగా చిరుతలు కనపడుతుండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
Read Also : Tirumala Samacharam 18-07-2023: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల