Tirumala Samacharam 18-07-2023: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు నేడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేయనున్నారు. అక్టోబర్ మాసానికి సంబంధించిన కోటా టికెట్లు విడుదల చేయనున్నారు. అక్టోబర్ కు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్ లక్కీడిప్ కోసం ఈనెల 20వ తేదీ వరకు అవకాశం కల్పించింది టీటీడీ. (Tirumala Samacharam 18-07-2023)
ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ.. అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవల ఆన్‌లైన్ లక్కీ డిప్ కోసం మంగళవారం ఉయదం 10 గంటల నుంచి ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు డబ్బు చెల్లించి ఖాయం చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఈనెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనుంది టీటీడీ. https://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ అధికారికమైనదని, ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి భక్తులు సేవా టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరింది. ఫేక్ వెబ్‌సైట్లను ఆశ్రయించి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
మరోవైపు తిరుమలలో భక్తులరద్దీ తగ్గింది. భక్తులు 5 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లు లేని భక్తులకు శ్రీవేంకటేశ్వరుని సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 71,894 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.5.40 కోట్లు ఆదాయం చేకూరింది.
తిరుపతి-మదనపల్లెకు ఎలక్ట్రిక్ బస్సులు..
తిరుపతి నుంచి మదనపల్లె మార్గంలో 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి ఉదయం 5 గంటలకు, ప్రతి గంటకూ ఓ ఎలక్ట్రిక్ బస్సు అందుబాటులో ఉంటుంది. రాత్రి 8.45 గంటల వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
Read Also : Gold Price today 18 July 2023: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. నేడు పసిడి, వెండి రేట్లు ఇవీ..