Sajjala on CBN Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆధారాలుంటేనే దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేస్తారని ఆయన చెప్పారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఎలాంటి దురుద్దేశం లేకుండా దర్యాప్తు జరుగుతోందన్నారు. వాస్తవాలను ప్రభుత్వం తరపున ప్రజల్లోకి తీసుకెళుతున్నామన్నారు. (Sajjala on CBN Arrest)
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ దేశంలోనే చెత్త స్కామ్ అన్నారు సజ్జల. ఎఫ్ఐఆర్ ఆధారంగా సీఐడీ దర్యాప్తు చేస్తోందని క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక నేరాలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఆరోపణలున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడం సాధారణం అన్నారు. 2012 డిసెంబర్ లోనే సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని వివరించారు. దబాయింపులతో చేసిన తప్పుల నుంచి బయటపడలేరని హెచ్చరించారు.
స్కామ్ దర్యాప్తులో రాజకీయ ప్రమేయం లేదన్నారు. ఎఫ్ఐఆర్ ముందే జీఎస్టీ నిఘాలో స్కామ్ బయటపడిందని సజ్జల గుర్తుచేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చాలా ప్రశ్నలకు సమాధానం లేదన్నారు. ప్రజల కళ్లుగప్పి స్కామ్ లకు పాల్పడ్డారని మండిపడ్డారు. షెల్ కంపెనీల ద్వారా నిధులు తరలించారని ఆరోపణలున్నాయన్నారు. తేదీలేని ఎంవోయూ కుదుర్చుకున్నారని గుర్తు చేశారు.
ఇది 100 శాతం అప్పటి ప్రభుత్వ ఎయిడెడ్ స్కామ్ అని సజ్జల తెలిపారు. ఇది రాత్రికి రాత్రి జరిగిన స్కామ్ కాదన్నారు. సీమెన్స్ సంస్థ పేరు వాడుకుని అవినీతికి పాల్పడ్డారని వెల్లడించారు. ఈ స్కాం సృష్టికర్త చంద్రబాబే విచారణలో బయటపడుతుందన్నారు. లేని ప్రాజెక్ట్ ను ఉన్నట్టుగా సృష్టించారన్నారు. పథకం ప్రకారం రూ.371 కోట్లు కొల్లగొట్టారని, ఆధారాలతో సహా దొరికినా ప్రశ్నించకుండా ఉంటారా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు విషయంలో ఎలాంటి కక్ష్యసాధింపు లేదన్నారు. ఆధారాలను బట్టి దర్యాప్తు సంస్థలు చర్యలు చేపడుతున్నాయన్నారు. తాను అరెస్ట్ అవుతున్నానని చంద్రబాబు దబాయించారన్నారు. సింపతీ వస్తుందని చంద్రబాబు కోరుకుంటున్నారన్నారు. స్కామ్ జరిగిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు.
అవినీతి జరగలేదని చంద్రబాబు నిరూపించుకోవాలని సజ్జల సూచించారు. కక్షసాధింపులకు పాల్పడాల్సిన అవసరం మాకు లేదని క్లారిటీ ఇచ్చారు. చవకబారు రాజకీయాలతో ఎలాంటి ఉపయోగం ఉండదని సజ్జల అన్నారు. గతంలో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Read Also : Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్.. ఏపీలో హై టెన్షన్ వాతావరణం