Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌.. ఏపీలో హై టెన్షన్‌ వాతావరణం

Chandrababu Arrest: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్‌ అయ్యారు. నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును అరెస్టు చేశారు. చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో ఏ 1 గా ఉన్నారు. దీంతో బాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నంద్యాల RK ఫంక్షన్ హాల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చంద్రబాబు అరెస్టు సందర్భంగా అసలేం జరిగిందో మినిట్‌ టు మినిట్‌… (Chandrababu Arrest)

* చంద్రబాబు బస చేసిన ఆర్. కె ఫంక్షన్ హాల్ దగ్గర ఉత్కంఠ
* చంద్రబాబు బస చేస్తున్న ప్రదేశానికి భారీగా చేరుకున్న పోలీసులు
* అనంతపురం నుంచి నంద్యాల వచ్చిన పోలీస్ బృందాలు
* 6 బస్సుల్లో నంద్యాల ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్న పోలీస్ బృందాలు
* జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల మోహరింపు
* ఆర్.కె ఫంక్షన్ హాల్ దగ్గరకు తరలివచ్చిన టీడీపీ శ్రేణులు
* ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసిన పోలీసులు

(Chandrababu Arrest)

* దాదాపు ఆరు బెటాలియన్ల పోలీసుల మోహరింపు
* టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం
* ప్రతి జిల్లా సరిహద్దు వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు
* చంద్రబాబు వద్దకు వెళ్లిన ఐపీఎస్ అధికారి రఘురామిరెడ్డి
* చంద్రబాబు అరెస్ట్ కు రంగం సిద్ధం
* నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్న టీడీపీ నాయకులు
* పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట
* టీడీపీ శ్రేణుల్ని నెట్టుకుంటూ చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న బస్సు వరకు పోలీసులు

* చంద్రబాబు ప్రధాన భద్రత అధికారి, ఎన్‌ఎస్జీ అధికారులతో పోలీసుల సంప్రదింపులు
* చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులు
* తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎందుకు రావాల్సి వచ్చిందని ప్రశ్నించిన టీడీపీ నాయకులు
* చంద్రబాబుతో తప్ప ఎవ్వరికీ సమాధానం చెప్పమంటున్న పోలీసులు
* కేసు ఏంటని అడుగుతున్నా సమాధానం ఇవ్వని పోలీసులు

* SIT చీఫ్ గా ఉన్న రఘురామిరెడ్డి రావడంతో వేరే కేసులు ఏమైనా ఉన్నాయా ? అని సందేహం
* పుంగనూరు, అంగళ్లు కేసులు అన్నింటినీ సిట్ కు అప్పగించారేమోనని టీడీపీ అనుమానం
* రాజధాని కేసులతో పాటు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలపై విచారణకు గతంలో సిట్ ను నియమించిన ప్రభుత్వం
* వాటిపై విచారణకు తాజాగా సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
* ఆ కేసులు ఏమైనా తిరగదోడారా? అని టీడీపీ లాయర్ల సందేహాలు
* రఘురామిరెడ్డి , ఇతర పోలీస్ అధికారుల తదనంతర చర్యలపై టీడీపీ లీగల్ సెల్ దృష్టి
* బస్ వద్ద కార్యకర్తలను, మీడియా టీమ్ లను బయటకు పంపిన పోలీసులు

* చంద్రబాబు బస చేసిన బస్సు చుట్టూ రోప్ పార్టీ ఏర్పాటు చేసిన పోలీసులు
* తమ చర్యలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకున్న పోలీసులు
* చంద్రబాబు ను కలిపిస్తే ఆయనకు నోటీసు ఇవ్వాలని టీడీపీ నేతలతో చెప్పిన డీఐజీ రఘురామిరెడ్డి
* వీఐపీని కలిసేందుకు అనుమతి ఇవ్వబోమని పోలీసులకు స్పష్టం చేసిన ఎన్ఎస్ జీ
* ప్రోటోకాల్ ప్రకారం ఉదయం 5.30 వరకూ అనుమతి ఇవ్వబోమన్న ఎన్ ఎస్ జీ
* ఉదయం 5.30 తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పోలీసులకు చెప్పిన ఎన్ఎస్ జీ
* వైద్య పరీక్షల నివేదిక పై అధికారులకు పంపుతామని పోలీసులకు చెప్పిన ఎన్ఎస్ జీ
* పై అధికారుల ఆదేశాల ప్రకారం చంద్రబాబు వద్దకు పంపుతామని పోలీసులకు చెప్పిన ఎన్ఎస్ జీ
* చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయించేందుకు వైద్యుల బృందాన్ని బస్సు వద్దకు తెచ్చిన పోలీసులు

* చంద్రబాబు అరెస్ట్ దిశగా అడుగులు వేస్తోన్న పోలీసులు
* చంద్రబాబు బస్సు చుట్టూ రోప్ ఏర్పాటు చేసిన పోలీసులు
* పోలీసుల అధీనంలో ఆర్కే ఫంక్షన్ హాల్
* చంద్రబాబు బస చేసే బస్సు దగ్గరకు ప్రొక్లైనర్ తెచ్చిన పోలీసులు
* చంద్రబాబు అరెస్ట్ కు రంగం సిద్ధం
* బాబు బస చేసే క్యాంపు దగ్గర భారీగా పోలీసులు
* టీడీపీ నేతలను ఖాళీ చేయించిన పోలీసులు
* కాసేపట్లో చంద్రబాబుకి వైద్య పరీక్షలు
* NSG క్లియరెన్స్ తర్వాత బాబు అరెస్ట్
* నంద్యాలలో వందలాది మంది పోలీసుల మోహరింపు
* ఎలాంటి ఉద్రిక్తతలు చెలరేగకుండా చర్యలు

* ఏ క్షణమైనా చంద్రబాబును అరెస్ట్ చేసే అవకాశం
*చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్ లో అడ్డుగా ఉన్న వాహనాల తొలగింపు
*వైద్య పరీక్ష కోసం ప్రభుత్వ వైద్యులను సిద్ధం చేసిన పోలీసులు
* అనంతపురంలో రెండ్రోజుల క్రితం తనను అరెస్ట్ చేస్తారేమోనన్న చంద్రబాబు
* నంద్యాల ఇష్యుతో రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు
* రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ముఖ్యనేతల కదలికలపై ప్రత్యేక నిఘా
* విజయవాడలో ఉదయం 5 గంటలకే అన్ని పీఎస్ ల అధికారులకు విధులకు హాజరుకావాలంటూ ఆదేశాలు
* బెజవాడలో తెల్లవారుజామున 4 గంటల నుంచి రోడ్ల పైకి వచ్చిన పోలీసులు

* టీడీపీ ముఖ్యనేతల ఇళ్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసుల మోహరింపు
* టీడీపీ నేతల కదలికలపై నిఘా పెట్టిన ఎస్.బి, ఇంటెలిజెన్స్ పోలీసులు
* దేవినేని ఉమా, బోండా ఉమా, పట్టాభిరామ్, గద్దె రామ్మోహన్ ఇళ్ల దగ్గర తెల్లవారుజామున 4 గంటల నుంచే పోలీసుల పహారా
* చంద్రబాబు అరెస్ట్
* నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్
* స్కిల్ కేసులో ఏ 1 గా ఉన్న బాబు
* బాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు

* బాబు హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం
* షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్ల కుంభకోణం
* స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో సీఐడీ, ఈడీ విచారణ
* ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో 8 మంది అరెస్ట్
* డిజైన్ టెక్ సంస్థకి చెందిన రూ.31 కోట్లు ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
* హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామంటున్న పోలీసులు
* చంద్రబాబు తరపున పోలీసులతో వాదిస్తున్న న్యాయవాదులు
* రిమాండ్ రిపోర్టులో అన్నీ ఉన్నాయంటున్న పోలీసులు
* ప్రాథమిక ఆధారాలు చూపాల్సిందేనంటున్న న్యాయవాదులు

* బస చేసిన బస్సు నుంచి కిందకు దిగిన చంద్రబాబు
* బస్సు వద్ద పోలీసులతో మాట్లాడుతున్న చంద్రబాబు
* నా హక్కులు ఉల్లంఘిస్తున్నారు
* నేను తప్పు చేస్తే నడిరోడ్డులో ఉరేయండి
* ఏ చట్ట ప్రకారం నన్ను అరెస్టు చేస్తారు
* ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారు? : చంద్రబాబు
* బాబుకు ఐపీసీ సెక్షన్ 166, 167, 418, 420 – సెక్షన్ 465, 468, 471, 409, 201 – r/w 109,43&37 ఐపీసీ కింద నోటీసులు

* విజయవాడ వెళ్లేలోపు రిమాండ్ రిపోర్టు అందిస్తాం
* ముందే రిమాండ్ రిపోర్టు ఇవ్వడం కుదరదు: పోలీసులు
* పోలీసులు అరాచకాలు సృష్టిస్తున్నారు
* నేను ఎక్కడికీ పారిపోను. మాజీ ముఖ్యమంత్రికి పోలీసులు ఇచ్చే గౌరవం ఇదేనా?
* నన్ను అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏంటి?
* హైకోర్టు జడ్జిమెంట్ కూడా పోలీసులు చూపించలేకపోతున్నారు
* రిమాండ్ రిపోర్టు కంటే ముందు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి
* పోలీసులు నన్ను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు: చంద్రబాబు

* FIR కాపీ పరిశీలించిన న్యాయవాదులు
* అన్ని పత్రాలు ఇస్తామంటున్న పోలీసులు
* FIRలో చంద్రబాబు పేరు లేదని ప్రశ్నించిన న్యాయవాదులు
* FIRలో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారన్న చంద్రబాబు
* అరెస్టు చేశాక తగిన పత్రాలు ఇస్తామంటున్న పోలీసులు
* సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు
* 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్
* బాబు పై 120(బి), 166, 167, 418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 మరియు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు
* క్రైం నంబర్ 29/2021 కింద చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ
* అండర్ సెక్షన్ 120 (b) 166,167,418,420,465,468, 471,409,201,109 R/W34&37 ఐపిసి & సెక్షన్ 12,13 (2) , 13 (1) (C) R/W 13(1) (C) & (D) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ -1988 కింద కేసు నమోదు
* నాన్ బెయిలబుల్ వారెంట్ కింద చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
* దాదాపు 6 నెలలపాటు బెయిల్ వచ్చే ఛాన్స్ లేకుండా కేసు ఫైల్
* కేవలం న్యాయవాది ద్వారా కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకునే అవకాశం

ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం

* 2015లో జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం
* ఎలాంటి ఒప్పందం జరగలేదని అప్పట్లోనే క్లారిటీ ఇచ్చిన సీమెన్స్ సంస్థ
* ప్రాజెక్టు విలువ రూ.3,350 కోట్లుగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ధారణ
* 10 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.370 కోట్లు
* ప్రభుత్వ వాటాలోని రూ.370 కోట్లలో రూ.241 కోట్లకు పై దారి మళ్లింపు
* ప్రాజెక్టు విలువలో 90 శాతం సీమెన్స్ పెట్టుకుందని చెప్పారు
* స్కిల్ డెవలప్ మెంట్ లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ లో నిర్ధారణ
* నివేదిక ఆధారంగానే సీఐడీ దర్యాప్తు

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles