శుక్రవారం, 23 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Allu Arjun RAAKA: అల్లు అర్జున్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌: అట్లీ డైరెక్షన్‌లో ‘రాకా’ టైటిల్‌ అనౌన్స్‌.. నెగెటివ్‌ లుక్‌తో బన్నీ షాక్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 8 ఏప్రిల్ 2026

Allu Arjun RAAKA: పుష్ప సినిమాతో ఐకాన్‌ స్టార్‌ Allu Arjun రేంజ్‌ పూర్తిగా మారిపోయింది. అంతకుముందు సౌత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించిన బన్నీ, పుష్ప తర్వాత పాన్‌ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్‌ను దక్కించుకున్నాడు. ఆ సినిమాతో ఆయనకు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది. అంతేకాదు అంతర్జాతీయ సినీ మ్యాగజైన్‌ The Hollywood Reporter కవర్‌ పేజీపై కూడా స్థానం సంపాదించడం ద్వారా బన్నీ పేరు ప్రపంచ సినీ ప్రేక్షకుల దృష్టిలో పడింది.

సినిమా కోసం ఎంతదూరమైనా వెళ్లే నటుడిగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ బడ్జెట్‌ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు Atlee దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది.

‘రాకా’ టైటిల్‌ అనౌన్స్‌
ఈ సినిమాకు సంబంధించి కొంతకాలంగా పలువురు టైటిల్స్‌ సోషల్‌ మీడియాలో వినిపించాయి. ముఖ్యంగా లెగసీ, అయాన్‌, స్పార్క్‌ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే చివరికి చిత్రబృందం ఓ పవర్‌ఫుల్‌ టైటిల్‌ను ఖరారు చేసింది. నేడు (ఏప్రిల్‌ 8) అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రానికి “రాకా” అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్‌ పోస్టర్‌ కూడా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

పోస్టర్‌లో నెగెటివ్‌ లుక్‌
రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో అల్లు అర్జున్‌ చాలా విభిన్నంగా కనిపించాడు. అరగుండు హెయిర్‌స్టైల్‌తో పాటు తోడేలు వంటి చేయితో ఒక భయంకరమైన నెగెటివ్‌ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ పోస్టర్‌ను చూసిన అభిమానులు సోషల్‌ మీడియాలో భారీగా స్పందిస్తున్నారు. బన్నీ లుక్‌ చాలా వైవిధ్యంగా ఉందని, ఈ సినిమాతో మరోసారి కొత్త అవతార్‌లో కనిపించబోతున్నాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పోస్టర్‌ విడుదలైన కొద్ది సమయంలోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పునర్జన్మల కాన్సెప్ట్‌
‘రాకా’ సినిమా కథపై కూడా ఆసక్తికరమైన సమాచారం వినిపిస్తోంది. ఈ చిత్రం పునర్జన్మల కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌ను బట్టి చూస్తే ఇందులో ఒక పాత్ర రాక్షసుడి తరహాలో ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

దీపికా పదుకొణె హీరోయిన్‌
ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ Deepika Padukone కథానాయికగా నటిస్తోంది. అంతేకాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారని సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజువల్‌గా కూడా చాలా గ్రాండ్‌గా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు అట్లీ స్టైల్‌కు తగ్గట్టుగా యాక్షన్‌, ఎమోషన్‌, మాస్‌ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది.

ఎప్పుడు విడుదల?
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇవీ చ‌ద‌వండి: Allu Arjun: అల్లు అర్జున్–బాసిల్ జోసెఫ్ కాంబోలో సూపర్ హీరో మూవీ? బర్త్‌డే రోజున క్లారిటీ వచ్చే ఛాన్స్
Allu Arjun Bunny Vasu: బన్నీ బర్త్‌డే రోజు ‘AA22’ టైటిల్ రివీల్? ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్ప్రైజ్!
Allu Arjun: శ్రీరామనవమి ప్రత్యేకంగా జరుపుకున్న అల్లు అర్జున్.. జపాన్ సీఈవోకు ‘సీతారామ కళ్యాణం’ చిత్రపటం బహుమతి

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading