Vizag Crime: విశాఖపట్నం గాజువాకలో చోటుచేసుకున్న మౌనిక హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నేవీ ఉద్యోగి రవీంద్ర చేసిన ఈ దారుణ హత్యపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన అనేక షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.
1. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం
కొన్ని సంవత్సరాల క్రితం డేటింగ్ యాప్ ద్వారా మౌనిక, రవీంద్ర పరిచయం అయ్యారు. కరోనా తర్వాత 2021 నుంచి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగింది.
2. బ్రేకప్ తర్వాత కూడా సంబంధం
రవీంద్ర 2023లో మౌనికకు బ్రేకప్ చెప్పి మరో యువతితో పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ మౌనికతో సంబంధం కొనసాగించడంతో సమస్యలు మొదలయ్యాయి.
3. పెళ్లి ఒత్తిడి – ఐడీ కార్డు వివాదం
మౌనిక తనను పెళ్లి చేసుకోవాలని రవీంద్రపై ఒత్తిడి తెచ్చింది. అతడి నేవీ ఐడీ కార్డు కూడా తీసుకుందని సమాచారం. దీంతో తన ఉద్యోగానికి సమస్యలు వస్తాయని భయపడ్డ రవీంద్ర తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
4. ముందే ప్లాన్ చేసిన హత్య
రవీంద్ర ఆన్‌లైన్‌లో కత్తి, క్లీనింగ్ సామాగ్రి ఆర్డర్ చేసి హత్యకు ప్లాన్ చేశాడు. ఇంటికి పిలిచిన తర్వాత గొంతు నులిమి మౌనికను చంపి, శవాన్ని ముక్కలుగా నరికి కొంత ఫ్రిజ్‌లో దాచాడు.
5. రిమాండ్ – పోలీస్ కస్టడీ అవకాశం
ఈ కేసులో రవీంద్రను కోర్టు ఏప్రిల్ 10 వరకు రిమాండ్‌కు పంపింది. మరిన్ని వివరాలు వెలికితీసేందుకు పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకునే అవకాశముంది.
ఇవీ చదవండి: Vizag Crime: విశాఖలో దారుణం.. యువతిని ముక్కలుగా నరికి హత్య
Vizag crime : విశాఖ పెందుర్తి: దొంగ-పోలీస్ ఆట పేరుతో అత్తను కాల్చి చంపిన కోడలు లలిత.. షాకింగ్!
Vizag : విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్
