Vizag crime : విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం వేపగుంట అప్పన్నపాలెంలో జరిగిన దారుణ హత్య కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేకెత్తించింది. 65 ఏళ్ల మహిళ జయంతి కనకమహాలక్ష్మిని తన కోడలు లలిత (35) పగడ్బందీగా ప్లాన్ చేసి నిర్దాక్షిణ్యంగా హతమార్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలు, దీర్ఘకాలిక విరోధాల నేపథ్యంలో అత్తపై చిరాకు పడుతూ వచ్చిన లలిత.. ఈ క్రూర చర్యకు పాల్పడింది.
ఘటన ఎలా జరిగింది?
నవంబర్ 7వ తేదీ సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లలిత తన మనవరాలితో కలిసి “దొంగ-పోలీస్ ఆట” ఆడుదామని అత్తను ఆకర్షించింది. ఆట పేరుతో కనకమహాలక్ష్మిని కుర్చీలో కూర్చోబెట్టి, చేతులు-కాళ్లు తాళ్లతో గట్టిగా బిగించింది. కళ్లకు గంతలు కట్టి, కదలకుండా చేసింది. ఈ లోపు ఇంటి దగ్గర పెట్రోల్ పోసి, దేవుడి గదిలోని దీపాన్ని విసిరి నిప్పంటించింది. కనకమహాలక్ష్మి మంటల్లో కాలిపోతూ గోడికి మంటలు అంటుకున్నట్టు సీన్ క్రియేట్ చేసింది.
తర్వాత లలిత తలుపులు మూసివేసి, బయటికి వచ్చి “అమ్మా! అత్త మంటల్లో కాలిపోతున్నారు.. ఎవరైనా రక్షించండి!” అని అరవడంతో పొరుగువాళ్లు, కుటుంబ సభ్యులు దౌడాయించారు. మొదట అగ్ని ప్రమాదంగా భావించి కేసు నమోదు చేశారు. కానీ సన్నిహితులు అనుమానం వ్యక్తం చేయడంతో పెందుర్తి పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల దర్యాప్తు
లలిత నోటి ద్వారా నిజంఘటనా స్థలంలో పెట్రోల్ మిగిలిన ఆనవాళ్లు, కుర్చీకి తాళ్ల గుర్తులు, మంటలు ఒక్క చోటే ఎక్కువగా ఉండటం వంటి అనుమానాస్పద అంశాలు గమనించారు. లలితను విచారించగా మొదట భావోద్వేగంగా మాట్లాడి, తర్వాత విరుగుడు సమాధానాలు చెప్పింది. తీవ్ర విచారణలో లలిత పూర్తిగా నేరం ఒప్పుకుంది. “అత్త నన్ను రోజూ చిరాకు పెడుతూ, తిడుతూ ఉండేది.. భరించలేక చంపేశాను” అని చెప్పింది.
పోలీసులు లలితను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కుటుంబ కలహాలు ఇంత దారుణానికి దారి తీస్తున్న నేపథ్యంలో సమాజంలో చర్చ మొదలైంది.
ఇవీ చదవండి: Telangana Crime : పెళ్లయిన నెలకే ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య
Telangana Crime : ప్రియుడితో కలిసి నా భార్య నన్ను చంపాలని..!
