Garividi Lakshmi: తెలుగమ్మాయి Anandhi ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం Garividi Lakshmi నుంచి మరో జానపద గీతాన్ని విడుదల చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో బుర్రకథలతో ప్రసిద్ధి చెందిన గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు Gouri Naidu ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “నల జీలకర్ర మొగ్గ” అనే పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా విడుదల చేసిన మరో జానపద గీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. “కోసింది కోయగూర దుబ్బో సందమామ… వాసనకీ సంపంగి మొగ్గ…” అంటూ ప్రారంభమయ్యే ఈ పాటలో ఆనంది మాస్ స్టెప్పులతో అలరించింది.
ఈ పాటకు Charan Arjun సంగీతం అందించారు. గాయకులు Ananya Bhat, Shakalaka Shankar మరియు దర్శకుడు గౌరీ నాయుడు కలిసి ఈ పాటను ఆలపించారు. ఈ పాట ఉత్తరాంధ్ర ప్రాంత జానపద సంప్రదాయాల నుంచి సేకరించబడినదిగా చిత్రయూనిట్ తెలిపింది.
సినిమా కథ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతీయ సంస్కృతి, జానపద కళల నేపథ్యంలో సాగుతుందని సమాచారం. గరివిడి లక్ష్మి అనే జానపద కళాకారిణి జీవితం, ఆమె పోరాటం, కళారంగంలో సాధించిన గుర్తింపును ఈ చిత్రంలో చూపించనున్నారు.
ఆనంది కెరీర్ విషయానికి వస్తే.. ఆమె అసలు పేరు రక్షిత. తెలంగాణలోని వరంగల్ జిల్లా ఆమె స్వస్థలం. సినిమాల్లోకి వచ్చిన తరువాత తన పేరును మార్చుకుని ఆనందిగా మారింది. తెలుగులో ‘జాంబిరెడ్డి’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘ప్రేమంటే’, ‘భైరవం’ వంటి సినిమాల్లో నటించింది. అయితే ఆమెకు ఎక్కువగా గుర్తింపు కోలీవుడ్‌లో హీరోయిన్‌గా లభించింది.
ఇవీ చదవండి: Actor Divi: జబర్దస్త్ యాంకర్ ఛాన్స్ మిస్ చేసుకున్న దివి.. ఇప్పుడు ఎమోషనల్ కామెంట్స్!
Actress Sridevi : ఆ హీరో అభిమానులను ఆకర్షించిన కుర్ర హీరోయిన్.. సోషల్ మీడియాలో క్రేజ్
Tollywood Movies: తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు స్టే
