Dhurandhar 2: రన్ వీర్ సింగ్ Ranveer Singh నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ Dhurandhar 2 బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.829 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది.
పుష్ప-2 హిందీ రికార్డ్‌ను బద్దలు
హిందీ వెర్షన్ కలెక్షన్లలో ఈ చిత్రం కొత్త రికార్డు సృష్టించింది. నాలుగు రోజుల్లోనే రూ.430 కోట్లు వసూలు చేసి Pushpa 2: The Rule హిందీ వెర్షన్ సాధించిన రూ.425.10 కోట్ల రికార్డును అధిగమించింది.
దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు
దేశవ్యాప్తంగా ఐదు రోజుల్లో ఈ సినిమా రూ.619.76 కోట్ల గ్రాస్ మరియు రూ.519.12 కోట్ల నికర వసూళ్లు సాధించింది. హిందీ సినిమాల చరిత్రలో ఇది అత్యంత వేగంగా వచ్చిన కలెక్షన్లలో ఒకటిగా నిలిచింది.
స్టార్ కాస్ట్‌తో భారీ ప్రాజెక్ట్
ఈ చిత్రానికి Aditya దర్శకత్వం వహించారు. సినిమాలో R. Madhavan, Sanjay Dutt, Arjun Rampal, Sara Arjun తదితరులు కీలక పాత్రలు పోషించారు.
హిందీలో టాప్-5 భారీ కలెక్షన్లు
హిందీ బాక్సాఫీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాల్లో ‘దురంధర్-2’ మొదటి స్థానంలో నిలిచింది. దాని తర్వాత ‘పుష్ప-2’, Pathaan, Jawan మరియు Stree 2 ఉన్నాయి.
ఇవీ చదవండి: Dhurandhar 2: దురంధర్-2 క్రేజ్ మామూలు కాదు.. కోహ్లీ, సెహ్వాగ్‌తో వైరల్ అవుతున్న వీడియో
Dhurandhar 2: “ధురంధర్ 2” క్రేజ్‌తో దశాబ్దాల సంప్రదాయానికి బ్రేక్!
Dhurandhar 2: ధురంధర్ 2 రెండు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్
Dhurandhar 2: దురంధర్-2 హంగామా.. బాక్సాఫీస్ వద్ద సంచలనం.. తొలి చిత్రంగా రికార్డు
