Ali Khamenei: అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei మరణించడం ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టించింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా అధికారికంగా ధృవీకరించింది. తొలుత ఈ వార్తలను ఖండించిన ఇరాన్, తర్వాత ఖమేనీ మృతి చెందినట్లు ప్రకటించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు Donald Trump మరియు ఇజ్రాయెల్ ప్రధాని Benjamin Netanyahu ముందుగానే ఈ దాడి విజయవంతమైందని ప్రకటించారు. ఖమేనీ స్థావరంపై ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామని ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి.
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఈ ఘటనను “బలిదానం”గా పేర్కొంటూ అమెరికా, ఇజ్రాయెల్‌పై తీవ్ర ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా 40 రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించగా, టెహ్రాన్ సహా పలు నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఖమేనీ మరణంతో మధ్యప్రాచ్యంలో పూర్తి స్థాయి యుద్ధం చెలరేగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గల్ప్ ప్రాంత భద్రత, చమురు సరఫరా, ప్రపంచ మార్కెట్లు తీవ్ర అస్థిరతను ఎదుర్కొనే అవకాశముంది. ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇవీ చదవండి: Iran-Israel war: ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం భారత్‌పై.. పెట్రోల్, బంగారం ధరలు పెరగనున్నాయా?
Mega Star Chiranjeevi : జీవితాంతం మిమ్మల్ని అలరిస్తా.. కష్టపడటంలోనే నిజమైన సంతోషం: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సక్సెస్ మీట్‌లో చిరంజీవి
