Ali Khamenei: ఇరాన్ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా నిలిచిన Ali Khamenei మరణంతో ఒక రాజకీయ శకం ముగిసింది. 1989 నుంచి సుప్రీం లీడర్‌గా కొనసాగిన ఆయన, దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఇరాన్ రాజకీయాలు, సైనిక విధానాలు, విదేశాంగ దిశను నిర్ణయించారు.
1939 ఏప్రిల్ 19న మషద్ నగరంలో జన్మించిన ఖమేనీ మతపరమైన కుటుంబంలో పెరిగారు. కోమ్‌లో ఉన్నత మత విద్య అభ్యసించిన ఆయన, ఇస్లామిక్ విప్లవ నేత Ruhollah Khomeini ప్రభావంతో రాజరిక వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పలుమార్లు జైలుశిక్ష అనుభవించారు.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఆయన వేగంగా అధికారంలో ఎదిగారు. 1981లో ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికై రెండు పర్యాయాలు పనిచేశారు. అనంతరం 1989లో సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టి దేశంలో మతాధిపత్య పాలనను మరింత బలోపేతం చేశారు.
రివల్యూషనరీ గార్డ్స్‌కు అధిక అధికారాలు ఇచ్చి ఇరాన్‌ను సైనికంగా బలపరిచారు. బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్, ప్రాంతీయ ప్రభావ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన పాలనలో ఎన్నికల వివాదాలు, ఆర్థిక ఆంక్షలు, హిజాబ్ నిరసనలు వంటి అంతర్గత ఉద్యమాలు కూడా తీవ్రంగా చెలరేగాయి.
86 ఏళ్ల వయసులో ఖమేనీ మరణంతో ఇప్పుడు ఇరాన్‌లో అధికార వారసత్వంపై రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశముంది. తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపనుంది.
ఇవీ చదవండి: Ali Khamenei: ఖమేనీ మరణం తర్వాత మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు..
Iran women on Ali Khamenei : ఇరాన్ మహిళల నిరసన పీక్ స్టేజ్‌కు.. ఖమేనీ ఫోటోతో సిగరెట్ వెలిగించిన మహిళ వీడియో వైరల్
