HomeCinemaMega Star Chiranjeevi : జీవితాంతం మిమ్మల్ని అలరిస్తా.. కష్టపడటంలోనే నిజమైన సంతోషం: ‘మన శంకరవరప్రసాద్...

Mega Star Chiranjeevi : జీవితాంతం మిమ్మల్ని అలరిస్తా.. కష్టపడటంలోనే నిజమైన సంతోషం: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సక్సెస్ మీట్‌లో చిరంజీవి

Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించడమే కాకుండా, బుక్ మై షోలో రికార్డు స్థాయిలో టికెట్ల అమ్మకాలతో మరో మైలురాయిని అందుకుంది.

ఈ ఘనవిజయాన్ని పురస్కరించుకుని ఆదివారం (జనవరి 25) సాయంత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు – ఆల్ టైమ్ హిట్ సెలబ్రేషన్స్’ పేరుతో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరుకాగా, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ సహా చిత్ర బృందం మొత్తం సందడి చేసింది.

తెలుగు సినిమా పరిశ్రమపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వేడుకలో మాట్లాడిన చిరంజీవి తన మనసులోని భావాలను అభిమానులతో పంచుకున్నారు.
“అమ్మ అన్నం లాంటి సినిమా విజయం ఎప్పటికీ బోర్ కొట్టదు. ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవితో పాటు ఆ కాలం మేజిక్‌ను మళ్లీ చూడగలిగిన ఆనందం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది” అని తెలిపారు.

తెలుగు సినిమా పరిశ్రమపై మాట్లాడుతూ, పరిశ్రమను సరైన దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందన్నారు.
“సినిమా ఇండస్ట్రీ అద్దంలాంటిది. మనం ఎలా ప్రవర్తిస్తామో అదే ఫలితం మనకు తిరిగి వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరి వర్కింగ్ స్టయిల్ వేరు. ఎవరి ప్రయాణం వారిదే” అని వ్యాఖ్యానించారు.

పరిశ్రమలోకి వచ్చే యువతకు ప్రోత్సాహం అవసరం
సినిమా రంగంలోకి అడుగుపెట్టే యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చిరంజీవి స్పష్టం చేశారు.
“మగపిల్లలైనా, ఆడపిల్లలైనా సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే ధైర్యంగా ఎంకరేజ్ చేయాలి. ఈ రంగాన్ని అపోహలతో కాకుండా నిజమైన అవగాహనతో చూడాలి” అన్నారు.

క్రమశిక్షణే విజయానికి కారణం
ఈ సినిమాను కేవలం 85 రోజుల్లోనే అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయగలిగామని చిరంజీవి తెలిపారు.
“కొన్ని సినిమాల్లో ఔట్‌డోర్ యూనిట్ ఖర్చులు అధికంగా వస్తుంటాయి. కానీ ఈ సినిమా పూర్తిగా ప్లాన్ ప్రకారమే సాగింది. అదే ఈ విజయానికి ప్రధాన కారణం” అని చెప్పారు.

“ఈ వయసులో కూడా కష్టపడతావా అని అడుగుతున్నారు…”

తనను కొందరు అడిగిన ప్రశ్నలపై స్పందించిన చిరంజీవి భావోద్వేగంగా మాట్లాడారు.
“ఈ వయసులో కూడా ఎందుకు అంత కష్టం పడుతున్నావని కొందరు అంటున్నారు. కానీ నాకు మాత్రం కష్టపడటంలోనే నిజమైన ఆనందం ఉంది. ఆ శ్రమకు తగిన ఉత్సాహం నాకు అభిమానులు, శ్రేయోబిలాషుల ప్రేమ నుంచే లభిస్తుంది” అంటూ మెగాస్టార్ చెప్పిన మాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సంక్రాంతి సందర్భంగా విడుదలైన అన్ని సినిమాలు విజయవంతం కావడం సంతోషకరమని పేర్కొంటూ, తెలుగు సినిమా భవిష్యత్ మరింత వెలుగొందుతుందనే నమ్మకాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: Mana Shankara Vara Prasad Garu : మన శంకరవరప్రసాద్ గారు తొలిరోజు కలెక్షన్స్
Priya Bhavani Shankar: తళుక్కుమనే తార.. ప్రియా భవానీ శంకర్.. ఫొటో గ్యాలరీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు