HomeCinemaVijay Deverakonda – Rashmika Mandanna: అనుకున్నట్టుగానే పెళ్లి పీటలెక్కబోతున్న విజ‌య్-ర‌ష్మిక‌

Vijay Deverakonda – Rashmika Mandanna: అనుకున్నట్టుగానే పెళ్లి పీటలెక్కబోతున్న విజ‌య్-ర‌ష్మిక‌

Vijay Deverakonda – Rashmika Mandanna: వైరల్‌గా మారిన పెళ్లి పత్రిక, ఫిబ్రవరి 26న వివాహం – మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్.. టాలీవుడ్‌లో చాలా కాలంగా హాట్ టాపిక్‌గా మారిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ప్రేమ కథకు త్వరలోనే శుభంకార్డు పడబోతుందనే వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. తాజాగా వీరి పెళ్లి పత్రికగా చెబుతున్న ఓ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది.

లభ్యమవుతున్న సమాచారం ప్రకారం, విజయ్ – రష్మికల వివాహం ఫిబ్రవరి 26న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా కానీ ఘనంగా జరగనుంది. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు టాక్.

ప్రేమ నుంచి పెళ్లి వరకు ప్రయాణం
గత కొన్ని సంవత్సరాలుగా విజయ్, రష్మికలు కలిసి కనిపించిన ప్రతి సందర్భం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. సినిమా సెట్లు, అవార్డు వేడుకలు, వ్యక్తిగత వేడుకల్లో కలిసి పాల్గొనడం… ఇలా చాలాసార్లు వీరి మధ్య ఉన్న ప్రత్యేక బంధం కనిపించిందనే అభిప్రాయం నెలకొంది.

ఇటీవల వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయిందన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ, ఇద్దరి చేతుల్లో ఎంగేజ్‌మెంట్ రింగ్స్ కనిపించాయంటూ ఫ్యాన్స్ తెగ హల్‌చల్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న పెళ్లి పత్రిక
ఇప్పుడైతే ఏకంగా విజయ్ – రష్మికల పెళ్లి పత్రిక అంటూ ఒక ఇన్విటేషన్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అందులో ఫిబ్రవరి 26న వివాహం, మార్చి 4న రిసెప్షన్ వివరాలు ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు
ఈ వార్తలు ఎంతగా వైరల్ అవుతున్నప్పటికీ, విజయ్ దేవరకొండ లేదా రష్మిక మందన్న తరఫున ఇప్పటివరకు ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ రాలేదు. అయినా కూడా, అభిమానులు మాత్రం “డ్రీమ్ కపుల్” పెళ్లి ఖాయమన్న ధీమాతో సంబరాలు చేసుకుంటున్నారు.

త్వరలోనే ఈ జంట నుంచి అధికారిక ప్రకటన వస్తుందా? లేకపోతే ఇవన్నీ రూమర్స్ మాత్రమేనా? అన్నది వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం ఖాయం… విజయ్ – రష్మిక పెళ్లి వార్తలు ప్రస్తుతం టాలీవుడ్‌లో నంబర్ వన్ టాపిక్‌గా మారాయి.

ఇవీ చ‌ద‌వండి: Vijay Deverakonda Rashmika: రోమ్‌లో ప్రేమ జంట? విజయ్ వెనక కనిపించిన అమ్మాయి రష్మికేనా?
Rashmika Mandanna : చిల్ మూడ్‌లో రష్మిక మందన్నా.. హాట్ పోజులు
Vijay Devarakonda dating: ఆ నటితో డేటింగ్? ధృవీకరించిన విజయ్ దేవరకొండ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు