HomeNationalAI Impact Summit 2026: ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పోను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర...

AI Impact Summit 2026: ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పోను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ

AI Impact Summit 2026: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ, ఈ సాంకేతిక విప్లవాన్ని ప్రమాదంగా కాకుండా అవకాశంగా మలచుకోవాలన్న లక్ష్యంతో భారత్ ముందడుగు వేసింది. ఢిల్లీలోని భారత్ మండపంలో సోమవారం సాయంత్రం నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026 ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరిగే ఈ ఎక్స్‌పోతో పాటు ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ కూడా నిర్వహిస్తున్నారు.

“సర్వజన హితాయ, సర్వజన సుఖాయ” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సమ్మిట్ లక్ష్యం – AI టెక్నాలజీని సేఫ్‌గా, నమ్మదగిన విధంగా అభివృద్ధి చేసి, దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చేయడం.

AI స్టాళ్లను పరిశీలించిన ప్రధాని
ఎక్స్‌పో ప్రారంభం అనంతరం ప్రధాని మోదీ వివిధ ఏఐ స్టాళ్లను సందర్శించారు. స్టార్టప్‌లు ప్రదర్శిస్తున్న ఇన్నోవేటివ్ సొల్యూషన్స్‌ను పరిశీలిస్తూ, భారత్‌ను గ్లోబల్ AI లీడర్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

గ్లోబల్ సౌత్‌లో తొలి ప్రపంచస్థాయి AI సమ్మిట్
గ్లోబల్ సౌత్ దేశాల్లో నిర్వహిస్తున్న మొట్టమొదటి ప్రపంచస్థాయి AI సమ్మిట్ మన దేశంలో జరగడం భారత్‌కు గర్వకారణం. ఈ ఎక్స్‌పోలో జపాన్, రష్యా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా మొత్తం 13 దేశాలు తమ పెవిలియన్లతో పాల్గొంటున్నాయి.
దేశవ్యాప్తంగా 600కు పైగా హైపొటెన్షియల్ స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలను ప్రదర్శించనుండగా, 300కు పైగా ఎగ్జిబిషన్లు, 500కు పైగా లైవ్ డెమోలు ఏర్పాటు చేశారు.

వరల్డ్‌క్లాస్ CEOలతో మోదీ భేటీ
ప్రధాని మోదీ, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 40 మంది టెక్ లీడర్లతో సమావేశమయ్యారు. వీరిలో Sam Altman, Bill Gates, Dario Amodei వంటి ప్రముఖులు ఉన్నారు. వీరు భారత్‌లోని టాలెంట్ పూల్‌, బలమైన వర్క్‌ఫోర్స్‌, వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను ప్రశంసించారు.

సమ్మిట్ ద్వారా ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు?
పాలసీ మేకింగ్, రీసెర్చ్, ప్రాక్టీస్‌లను అనుసంధానం చేయడం
హోమ్-గ్రోన్ AI మోడల్స్ అభివృద్ధి, దేశీయ భాషల్లో AI విస్తరణపై చర్చ
AI భద్రత, విశ్వసనీయత, ఫ్యూచర్ ఆఫ్ వర్క్‌పై స్పష్టత
అభివృద్ధి చెందుతున్న దేశాలపై AI ప్రభావంపై విశ్లేషణ
రాబోయే ఐదేళ్లలో భారత AI మార్కెట్ సామర్థ్యం 17 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ దిశగా భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చే వ్యూహాలు ఈ సమ్మిట్‌లో రూపుదిద్దుకోనున్నాయి.

గ్లోబల్ టెక్ లీడర్ల అభిప్రాయాలు
“AI టెక్నాలజీలో భారత్ లీడర్‌గా ఎదగడానికి పూర్తి సత్తా ఉంది” – Sam Altman, OpenAI CEO
“AI రెవల్యూషన్‌ను భారత్ చక్కగా మేనేజ్ చేయగలదు” – Shantanu Narayen, Adobe CEO
“టెక్నాలజీలో రాబోయే దశాబ్దాన్ని ఈ సమ్మిట్ చూపిస్తుంది” – Julie Sweet, Accenture CEO

AI వల్ల ఉద్యోగాలు తగ్గుతాయా? లేక కొత్త అవకాశాలు పెరుగుతాయా? అనే ప్రశ్నల మధ్య, ఈ సమ్మిట్ ఒక స్పష్టమైన దిశను చూపించనుంది. ప్రమాదాన్ని అవకాశంగా మలచుకుంటూ, వికసిత్ భారత్ లక్ష్యానికి చేరువయ్యే మరో కీలక అడుగుగా ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026 నిలుస్తోంది.

ఇవీ చ‌ద‌వండి: Narendra Modi: కర్తవ్య భవన్ సముదాయాల ప్రారంభంతో పరిపాలనలో కొత్త అధ్యాయం – నవ భారతానికి నరేంద్ర మోదీ బ్లూప్రింట్
Modi Trump : నెలల అనిశ్చితికి ముగింపు: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు.. సుంకాలు తగ్గింపు నుంచి 500 బిలియన్ డాలర్ల కొనుగోళ్ల వరకూ కీలక నిర్ణయాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు