Vijay Deverakonda Rashmika: టాలీవుడ్‌లో ఎప్పటినుంచో హాట్ టాపిక్‌గా మారిన జంట Vijay Deverakonda – Rashmika Mandanna. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని ఫొటోలు ఈ గాసిప్‌కు మరింత బలం చేకూర్చుతున్నాయి.
ఇటీవల విజయ్ దేవరకొండ న్యూ ఇయర్ సందర్భంగా తన వెకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తమ్ముడు, కొందరు సన్నిహితులతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ ఫొటోల్లో కనిపించింది. అయితే ఆ ఫొటోలలో ఒకటి మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ఆ ఫొటోలో విజయ్ దేవరకొండను వెనకనుంచి ఓ అమ్మాయి హగ్ చేసుకుంటూ కనిపించింది. ఆమె ముఖం పూర్తిగా కనిపించకపోయినా, స్టైల్, హెయిర్, బాడీ లాంగ్వేజ్‌ను బట్టి అది రష్మిక మందన్ననే అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో “విజయ్ వెనక ఉన్నది రష్మికేనా?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే వీరిద్దరూ సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారన్న ప్రచారం కూడా నడుస్తోంది. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ నిశ్చితార్థం జరిగినట్టు ఇన్‌సైడ్ టాక్. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం లేదు.
అంతేకాదు, వీరి పెళ్లి కూడా చాలా సీక్రెట్‌గా జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ఓ రాజభవనంలో వివాహం జరగనుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎంగేజ్మెంట్ మాదిరిగానే పెళ్లిని కూడా మీడియా హడావుడి లేకుండా, చాలా ప్రైవేట్‌గా నిర్వహించాలని ఈ జంట భావిస్తోందట.
ఇప్పటివరకు తమ రిలేషన్‌షిప్‌ను గుట్టుగా ఉంచిన విజయ్, రష్మిక… ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ ఫొటోలతో మరోసారి వార్తల్లో నిలిచారు. మరి ఈ ప్రేమ కథకు ఎప్పుడు అధికారిక క్లారిటీ వస్తుందో చూడాలి. అప్పటివరకు మాత్రం ఈ జంటపై గాసిప్స్ ఆగేలా లేవు.
ఇవీ చదవండి: Kingdom Day 1 Collections: విజయ్ దేవరకొండ కింగ్డమ్ తొలి రోజు కలెక్షన్స్
Tollywood: ‘Relief Magic’ అంటూ తక్కువ ఖర్చుతో పెయిన్ రిలీఫ్ టిప్ చెప్పిన రష్మిక మందన్న!
