Tirumala News : తిరుమల, ఫిబ్రవరి 16, 2026: భక్తుల సౌకర్యార్థం 2026 మే నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, వర్చువల్ సేవలు, టోకెన్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల కోటాల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో బుకింగ్ తేదీలు, సమయాలను స్పష్టంగా తెలియజేసింది.
భక్తులు ముందుగానే సంబంధిత తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకొని తమకు కావాల్సిన సేవలు, దర్శన టికెట్లు పొందవచ్చని టీటీడీ సూచించింది.
ఆర్జిత సేవల టికెట్ల కోటా
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు అయిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 18 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ టికెట్ల కోసం ఫిబ్రవరి 20 ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్‌కు నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు ఫిబ్రవరి 20 నుండి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి మంజూరు అవుతాయి.
ఇతర ఆర్జిత సేవలు
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఫిబ్రవరి 21 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
వర్చువల్ సేవలు
వర్చువల్ సేవలు మరియు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
అంగ ప్రదక్షిణ టోకెన్లు
అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
శ్రీవాణి ట్రస్టు దర్శనం
శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 23 ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచిత ప్రత్యేక దర్శనం
ఈ వర్గాల వారికి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
గదుల కోటా
తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
శ్రీవారి సేవా, పరకామణి సేవ
ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
భక్తులు అన్ని రకాల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలను అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in
ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
ఇవీ చదవండి: Tirumala Laddu : లడ్డు రాజకీయాలకు స్వస్తి పలికి అభివృద్ధి దిశగా పయనించాలి.. పౌర సంస్థల చర్చా గోష్టిలో వక్తల ఏకగ్రీవ తీర్మానం
Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదంపై మరో డ్రామా.. సీబీఐ నివేదిక నచ్చక కొత్త కమిటీ.. న్యాయ నిపుణులు విస్తుపోయే స్పందన
