HomeCinemaActor Divi : పబ్ ఈవెంట్‌లో చేదు అనుభవం.. షాకింగ్ విషయం వెల్లడించిన దివి వైద్య

Actor Divi : పబ్ ఈవెంట్‌లో చేదు అనుభవం.. షాకింగ్ విషయం వెల్లడించిన దివి వైద్య

Actor Divi : బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో దివి వైద్య ఒకరు. చదువుకునే వయసులోనే మోడలింగ్ ప్రారంభించిన ఆమె పలు ఫ్యాషన్ బ్రాండ్లకు మోడలింగ్ చేస్తూ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2018లో తొలిసారిగా ‘లెట్స్ గో’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి కెమెరా ముందు కనిపించింది. 2019లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది.

దీని తర్వాత కూడా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన దివికి అసలైన బ్రేక్ మాత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా వచ్చింది. కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన ఆటతీరు, అందం, బోల్డ్ నేచర్‌తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హౌస్‌లో కొన్ని రోజులే ఉన్నప్పటికీ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.

హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దివి వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఏ 1 ఎక్స్‌ప్రెస్, క్యాబ్ స్టోరీస్, నయీమ్ డైరీస్, జిన్నా, గాడ్ ఫాదర్, రుద్రంగి, లంబసింగి, పుష్ప 2, డాకు మహారాజ్ వంటి సినిమాల్లో నటించి తనదైన గుర్తింపును సంపాదించుకుంది. లేటెస్ట్‌గా హనీ సినిమాలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 06న థియేటర్లలో విడుదలైంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలతో పాటు తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది.

“ఇటీవల ఒక పబ్ ఈవెంట్‌కు నన్ను పిలిచారు. నా చుట్టూ బాడీ గార్డ్స్ ఉన్నారు. గుంపుగా నన్ను వేదిక దగ్గరకు తీసుకెళ్తుండగా మధ్యలో ఒకడు నా నడుము గిల్లాడు. కానీ ఏమి తెలియనట్టు నిల్చొని ఉన్నాడు. వెంటనే నేను సీరియస్‌గా చూసి తలపై గట్టిగా కొట్టి ‘బాడకవ్’ అని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయా. నేను అలా స్పందించకపోతే నాకు చాలా బ్యాడ్‌గా అనిపించేది. అది నా తప్పు కాదు. చుట్టూ అంత మంది బాడీ గార్డ్స్ ఉన్నా వాడు నీచంగా ప్రవర్తించాడు. ఆ సంఘటన తర్వాత ఫ్రీగా నడవలేక జాగ్రత్తగా చేతులు దగ్గర పెట్టుకుని నడవాల్సి వచ్చింది” అంటూ తన అనుభవాన్ని వెల్లడించింది.

దివి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహిళల భద్రతపై మరోసారి చర్చకు దారి తీస్తున్నాయి.

ఇవీ చదవండి: Bigg Boss Telugu: అందాల భామ‌.. ఆ సీక్రెట్ చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.. దివి ఏం చెప్పిందంటే..
Andhra Crime : లవ్ అన్నాడు.. పెళ్లి చేసుకుంటాడేమో అనుకుంది.. తీరా డిసెంబర్ 31న రాత్రి ఏమైందంటే

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు