OTT Movie : తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఊపిరి బిగబట్టే థ్రిల్‌తో కట్టిపడేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ నయనం. డైరెక్ట్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చినప్పటి నుంచే ఈ సిరీస్‌కు అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఆసక్తికరమైన కథ, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో డిజిటల్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.
ఈ సిరీస్ కథ పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందింది. నయన్ అనే ఓ కళ్ల డాక్టర్ చుట్టూ కథ తిరుగుతుంది. కళ్ల సమస్యలతో బాధపడే పేషెంట్లకు తన క్లినిక్‌లో చికిత్స అందిస్తూనే, తాను ప్రత్యేకంగా డిజైన్ చేసిన కళ్ల అద్దాల ద్వారా అవతలి వ్యక్తి ఏం చూస్తున్నాడో నాలుగు నిమిషాల పాటు చూడగల సామర్థ్యం నయన్‌కు ఉంటుంది. సీక్రెట్‌గా తన దగ్గర ఉన్న ఓ స్పెషల్ గ్లాసెస్ ద్వారా, పేషెంట్ల లెన్స్‌తో వాళ్లు చూసేదంతా నయన్ కూడా చూడగలడు.
ఇలాంటి సమయంలో మాధవి అనే మహిళ నయన్ క్లినిక్‌కు వస్తుంది. ఆమెపై నయన్‌కు ఆకర్షణ కలుగుతుంది. కానీ అప్పటికే ఆమెకు పెళ్లయి ఉంటుంది. కొద్ది రోజుల్లోనే మాధవి భర్త అనుమానాస్పదంగా హత్యకు గురవుతాడు. ఈ హత్య కేసును చేధించేందుకు ఓ సిన్సియర్ పోలీసాఫీసర్ రంగంలోకి దిగుతాడు.
మాధవి భర్తను ఎవరు చంపారు?
ఈ హత్యలో డాక్టర్ నయన్ పాత్ర ఏంటి?
మాధవి ప్రమేయం ఉందా లేదా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నయనం సిరీస్ తప్పక చూడాల్సిందే.
ఈ వెబ్ సిరీస్‌తో హీరోగా వరుణ్ సందేశ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కళ్ల డాక్టర్ నయన్ పాత్రలో ఆయన నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఆయనతో పాటు ఉత్తేజ్, ప్రియాంక జైన్, అలీ రెజా తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
గతేడాది డిసెంబర్ 19న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5లో విడుదలైన ఈ సిరీస్, ప్రస్తుతం 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటేసిందని సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ రికార్డుతో నయనం తెలుగు ఓటీటీ మార్కెట్‌లో మరో మైలురాయిని అందుకుంది.
ఇవీ చదవండి: OTT Movie : థియేటర్లలో నవ్వించిన ‘నారీ నారీ నడుమ మురారి’ ఇప్పుడు ఓటీటీలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్… శర్వానంద్ కామెడీకి మరోసారి ఛాన్స్
OTT Movie : ఓటీటీలోకి మెగాస్టార్ బ్లాక్‌బస్టర్… ‘మన శంకరవరప్రసాద్ గారు’ స్ట్రీమింగ్ డేట్‌పై హాట్ టాక్
Sarvam Maya : ఓటీటీలోకి మలయాళం బ్లాక్‌బస్టర్ ‘సర్వం యామ’.. ఎక్స్‌లో ట్రెండింగ్‌తో మళ్లీ హాట్ టాపిక్
