Bigg Boss Telugu: సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన అందాల భామ Divi Vadthya ఆ తర్వాత టెలివిజన్ రియాలిటీ షో Bigg Boss Telugu ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో తన ఆటతీరు, స్పష్టమైన అభిప్రాయాలతో ప్రేక్షకులను మెప్పించిన దివి, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయినా.. ఇప్పుడు మళ్లీ నెమ్మదిగా ఆఫర్స్ అందుకుంటోంది.
ప్రస్తుతం Naveen Chandra హీరోగా నటిస్తున్న Honey సినిమాలో దివి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా, దివి ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత అభిప్రాయాలు, అలవాట్లపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
డ్రింకింగ్, స్మోకింగ్ విషయాల్లో లింగ సమానత్వాన్ని తాను సమర్థించనని దివి స్పష్టం చేసింది. సమానత్వం కెరీర్, అవకాశాలు, గౌరవం వంటి మంచి అంశాల్లో ఉండాలని, కానీ ఆరోగ్యానికి హానికరమైన అలవాట్లలో మాత్రం కాదని చెప్పింది. ముఖ్యంగా ధూమపానం వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు, చర్మం కూడా త్వరగా దెబ్బతింటుందని పేర్కొంది. స్మోక్ చేసే అమ్మాయిలు 25 ఏళ్లకే 35 ఏళ్లలా కనిపించే ప్రమాదం ఉందని, చర్మంపై ప్రేమ ఉంటే తప్పకుండా ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించింది.
తన వ్యక్తిగత అలవాట్ల గురించి మాట్లాడుతూ.. అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి డ్రింక్ చేస్తానని, తనకు ఇష్టమైన టెకీలా బ్రాండ్ డాన్ హులియో అని తెలిపింది. డ్రింక్ చేసిన తర్వాత తాను చాలా చిల్‌గా, హైపర్‌గా ఉంటానని, తనతో పార్టీలు చేయడం స్నేహితులకు చాలా ఇష్టమని చెప్పింది. పబ్స్‌లో అంతగా ఎంజాయ్ చేయనని, అక్కడ ఎక్కువగా వాటర్ మాత్రమే తాగుతానని తెలిపిన దివి, ఇంట్లోనే హౌస్ పార్టీలను ఎక్కువగా ఇష్టపడతానని పేర్కొంది.
పుట్టినరోజులు, న్యూ ఇయర్ వంటి ప్రత్యేక సందర్భాల్లో ఇంట్లోనే పార్టీలుంటాయని, ఆ సమయంలో మనసువిప్పి డ్యాన్స్ చేస్తానని చెప్పింది. ఈ పార్టీలకు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఉండరని, సినిమాల గురించి మాట్లాడుకోమని కూడా స్పష్టం చేసింది. పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేలా చూసుకోవడమే తన లక్ష్యమని, డ్రింక్ చేసిన తర్వాత తనకు ఎలాంటి నెగటివ్ ఆలోచనలు రావని దివి వెల్లడించింది.
ఇవీ చదవండి: Sankranti Cinema : సంకురాతిరికి సినిమాల జాతర.. డామినేషన్ ఎవరిది?
Andhra Crime : లవ్ అన్నాడు.. పెళ్లి చేసుకుంటాడేమో అనుకుంది.. తీరా డిసెంబర్ 31న రాత్రి ఏమైందంటే
