Ravi Teja Movie : సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఏడాది తెలుగులో ఐదు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు కళకళలాడాయి. ఈ జాబితాలో ది రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు, అలాగే మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఉన్నాయి.
సంక్రాంతి క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న ఈ సినిమాలన్నీ దాదాపుగా హిట్ టాక్‌తోనే నిలిచాయి. ఇప్పటికే ప్రభాస్ నటించిన ది రాజాసాబ్, శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు సినిమాల అధికారిక ఓటీటీ స్ట్రీమింగ్ డేట్స్ కూడా వెలువడ్డాయి.
అయితే రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఓ మోస్తరు విజయాన్ని సాధించి, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 13 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్.
దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. అలాగే సునీల్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, సత్య కీలక పాత్రల్లో కనిపించారు.
SLV Cinemas బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
మొత్తానికి థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోనూ భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఇవీ చదవండి: Dimple Hayati : ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో ఇంట్రస్టింగ్ విషయాలుంటాయి.. రవితేజ ఎనర్జీ గురించి డింపుల్, ఆషికా కీ కామెంట్స్
Ravi Teja : తొలిసారి రవితేజకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్… అదృష్టం కలిసొస్తుందా?
