HomeCinemaRavi Teja : తొలిసారి రవితేజకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్… అదృష్టం కలిసొస్తుందా?

Ravi Teja : తొలిసారి రవితేజకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్… అదృష్టం కలిసొస్తుందా?

Ravi Teja : మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పెద్ద హిట్ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. రాజా ది గ్రేట్ తర్వాత ఆయన కెరీర్‌లో అదే స్థాయి విజయాన్ని అందుకున్న సినిమా మరోసారి రాలేదు. ఇటీవల వచ్చిన మాస్ జాతర కూడా భారీ హైప్ మధ్య విడుదలైనప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

కొత్త దర్శకులైతే ఫలితం ఇవ్వట్లేదు, స్టార్ దర్శకులైనా రవితేజ కోసం సరైన హిట్ అందించలేకపోతున్నారు. హరీష్ శంకర్‌తో వచ్చిన మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయ్యింది. తాజాగా విడుదలైన మాస్ జాతర కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. వరుస పరాజయాలతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నా, “ఒక్క సినిమా పడితే చాలు… మళ్లీ మాస్ రాజా ఫామ్‌లోకి వస్తాడు” అనే నమ్మకం మాత్రం అభిమానుల్లో అలాగే కొనసాగుతోంది.

ఇప్పుడేమో రవితేజ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే… రవితేజ లైనప్‌లో మరో ముచ్చటైన ప్రాజెక్ట్ చేరింది. దర్శకుడు శివ నిర్వాణతో రవితేజ ఒక కొత్త చిత్రం చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్న ఆసక్తికి ఇప్పుడు సమాధానం దొరికింది.

అవును… ఆ స్టార్ హీరోయిన్ సమంత.
శివ నిర్వాణ–సమంత కాంబినేషన్‌కు ఇది మూడో చిత్రం అవుతుంది. ఇంతకుముందు సమంత, ఆయన దర్శకత్వంలో మజిలీ మరియు ఖుషి సినిమాల్లో నటించింది. ఇప్పుడు మొదటిసారి రవితేజ–సమంత జోడీగా తెరపై కనిపించనున్నారు. ఇక ఈ కొత్త జోడీ రవితేజకు అవసరమైన భారీ హిట్‌ను అందిస్తుందేమో చూడాలి.

ఇవీ చదవండి: Samantha Fitness: సమంత సీక్రెట్ డైట్ ఇదే..! రోజుకు 100g ప్రోటీన్ తీసుకుంటుందట – ఈ 3 ఫుడ్స్ వల్లే నాజుగ్గా మారిందా?
Ravi Teja : రవితేజ కొత్త సినిమాలో ఆ హాట్ బ్యూటీకి బంపర్ ఛాన్స్!
BMW : రవితేజ కొత్త చిత్రం: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. భర్తలకు మాస్ మహారాజా సందేశం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు