HomeCinemaDimple Hayati : ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో ఇంట్రస్టింగ్ విషయాలుంటాయి.. రవితేజ ఎనర్జీ గురించి డింపుల్,...

Dimple Hayati : ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో ఇంట్రస్టింగ్ విషయాలుంటాయి.. రవితేజ ఎనర్జీ గురించి డింపుల్, ఆషికా కీ కామెంట్స్

Dimple Hayati : సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల్లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఒకటి. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొన్న హీరోయిన్లు డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ సినిమా విశేషాలతో పాటు తమ పాత్రలు, రవితేజతో పని చేసిన అనుభవాలను పంచుకున్నారు.

ఆషికా రంగనాథ్ మాటల్లో…

“కిషోర్ తిరుమల గారితో ముందు ఒక సినిమా చేయాల్సి వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. తర్వాత ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథ చెప్పారు. కథ విన్న వెంటనే ఇందులో మోడ్రన్ గర్ల్ పాత్ర చేయాలని అనిపించింది. దర్శకుడు కూడా అదే పాత్రకు నన్నే అనుకున్నారని చెప్పడం ఆనందంగా అనిపించింది. నా ‘సామిరంగ’ పాత్రతో పోలిస్తే ఇది పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్. నా కెరీర్‌లో కొత్త అనుభవం అవుతుంది.

ఈ సినిమాలో నా పాత్ర పేరు మానస శెట్టి. ఇప్పటి తరం అమ్మాయిలకు చాలా దగ్గరగా ఉండే పాత్ర ఇది. రవితేజ గారి ఎనర్జీకి మ్యాచ్ అవ్వడం పెద్ద ఛాలెంజ్. పైగా నాకు తెలుగు పూర్తిగా రాదు. అయినా దర్శకుడు గారు ఎంతో సహకరించారు. చాలా సెన్సిబుల్ డైరెక్టర్. ప్రతి క్యారెక్టర్‌ను చాలా కేర్‌తో డిజైన్ చేశారు.

ఇప్పటి కమర్షియల్ సినిమాల్లో క్యారెక్టర్లు మరింత రియలిస్టిక్‌గా మారుతున్నాయి. ప్రతి పాత్రలో చిన్న లోపం లేదా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అలాంటి పాత్రలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. రిలేషన్‌షిప్స్‌లో వచ్చే సమస్యలను దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశారు. రవితేజ గారు అద్భుతమైన పెర్ఫార్మర్. ఫన్, ఎమోషన్ రెండింటినీ చాలా సహజంగా పండించారు. ఆయనతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది.

సత్య, సునీల్, వెన్నెల కిషోర్ లాంటి అద్భుతమైన టైమింగ్ ఉన్న నటులతో కలిసి నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా కొత్త ఫీల్ ఇస్తుంది. స్పెయిన్‌లో షూట్ చేయడం, మాస్ సాంగ్ సమయంలో చిరంజీవి గారు సెట్స్‌కి రావడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం. ప్రస్తుతం ‘విశ్వంభర’, ‘సర్దార్ 2’, ‘అది నా పిల్లరా’ చిత్రాల్లో నటిస్తున్నాను. కెరీర్ ఆరంభంలోనే పెద్ద స్టార్స్‌తో పని చేయడం నా అదృష్టం.”

డింపుల్ హయతి ఏమన్నారంటే…

“కిషోర్ తిరుమల గారు కథ చెప్పగానే బాగా నచ్చింది. ఇందులో వైఫ్ క్యారెక్టర్ అయిన బాలామణి పాత్ర చేయాలని అనిపించింది. ఇప్పటికే రవితేజ గారితో ఒక మోడ్రన్ అమ్మాయి పాత్ర చేశాను. అందుకే ఈసారి పూర్తిగా డిఫరెంట్‌గా కనిపించాలని కోరుకున్నాను. దర్శకుడు కూడా బాలామణి పాత్రకే నన్ను అనుకోవడం ఆనందంగా అనిపించింది.

కథ వినిన తర్వాత ఇందులో హీరో రవితేజ గారని చెప్పడం మరింత ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఇది ఆయనతో నా రెండో సినిమా. రవితేజ గారితో పని చేయడం ఎప్పుడూ ఒక మంచి అనుభవమే. ఇందులో నాది చాలా స్ట్రాంగ్, ఇండిపెండెంట్ క్యారెక్టర్. బాలామణి పాత్ర నాకు పూర్తిగా కొత్త అనుభవం ఇచ్చింది.

కాస్ట్యూమ్స్ విషయంలో చాలా శ్రద్ధ పెట్టారు. పాత్రకు తగ్గట్టుగా కలర్స్, డిజైన్స్ ఎంపిక చేశారు. పాటల్లో చాలా కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్ కనిపిస్తాయి. విజువల్స్ చాలా వైబ్రెంట్‌గా ఉంటాయి. అమ్మాయిలందరూ ఈ పాత్రకు రిలేట్ అవుతారు.

ఈ సినిమాలో ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. అది ప్రేక్షకులు థియేటర్‌లోనే చూడాలి. దర్శకుడు ప్రతి సీన్‌ని స్వయంగా నటించి చూపిస్తారు. ఆయన డైలాగ్స్ చాలా యూనిక్‌గా ఉంటాయి. కామెడీ చాలా సెన్సిబుల్‌గా ఉంటుంది. డ్యాన్స్ నెంబర్స్‌కు మంచి స్పందన వస్తోంది. నేను, ఆషిక ఇద్దరం ఈ జర్నీలో మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. చిన్నప్పటి నుంచి నేను సంక్రాంతిని చెన్నైలో నా గ్రాండ్ పేరెంట్స్‌తో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాను.”

సంక్రాంతి సీజన్‌లో వినోదం, భావోద్వేగాలు, సర్‌ప్రైజ్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సిద్ధంగా ఉంది.

ఇవీ చదవండి: Dimple Hayati: షర్ట్‌ బటన్స్‌ విప్పేసి డింపుల్‌ పోజులు.. గ్లామర్‌ డోస్‌ పెంచేసిందిగా..! ఫొటో గ్యాలరీ
Ravi Teja : తొలిసారి రవితేజకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్… అదృష్టం కలిసొస్తుందా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు