HomeCinemaSankranti Cinema : సంకురాతిరికి సినిమాల జాతర.. డామినేషన్ ఎవరిది?

Sankranti Cinema : సంకురాతిరికి సినిమాల జాతర.. డామినేషన్ ఎవరిది?

Sankranti Cinema : కొత్త ఆశలు, కొత్త కలలతో 2026లోకి అడుగుపెట్టిన టాలీవుడ్‌కి సంక్రాంతి సీజన్ ఎప్పటిలాగే హై వోల్టేజ్‌గా మారింది. న్యూ ఇయర్ వేడుకల హంగామా ముగియకముందే.. సంక్రాంతి బరిలో నిలవడానికి హీరోలు, నిర్మాతలు రెడీ అయ్యారు. గతేడాది నూతన సంవత్సరం ప్రారంభంలోనే బ్లాక్‌బస్టర్ హిట్‌తో సందడి చేసిన విక్టరీ వెంకటేశ్ బాటలోనే, ఈసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలనే లక్ష్యంతో పలువురు స్టార్స్ రంగంలోకి దిగుతున్నారు.

ప్రత్యేకంగా చెప్పాలంటే.. ఈ సంక్రాంతిని తమ ఖాతాలో వేసుకోవాలనే గట్టి పట్టుదలతో మెగాస్టార్ చిరంజీవి సిద్ధమయ్యారు. మరోవైపు, చాలా కాలంగా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరోలు కూడా ఈ పండుగను తమకు కలిసి వచ్చే టర్నింగ్ పాయింట్‌గా మలచుకోవాలని చూస్తున్నారు.

పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలు.. పూర్తి హడావుడే!
భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు, చిన్న సినిమాలు కూడా ఈసారి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇవ్వనున్నాయి. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన కొన్ని లో-బడ్జెట్ చిత్రాలు ఊహించని స్థాయిలో విజయాలు సాధించాయి. పదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరోలు సైతం సక్సెస్ రుచి చూశారు. ప్రస్తుతం థియేటర్లలో ‘శంబాల’, ‘సైక్ సిద్ధార్థ’, ‘దండోరా’ వంటి చిత్రాలు మంచి వసూళ్లతో దూసుకుపోతుండటం ఇండస్ట్రీకి మరింత బూస్ట్ ఇచ్చింది.

ఈ సంక్రాంతికి విడుదలయ్యే ప్రధాన సినిమాలివే
ఈసారి ఎప్పుడూ లేనంతగా ఏకంగా ఏడు సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

అలాగే మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన మన శంకరవరప్రసాద్ గారు జనవరి 12న విడుదల కానుంది. ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది.

మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రంపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఇక శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాను జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అదే రోజున యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు కూడా రిలీజ్ అవుతోంది.

తమిళ్ డబ్బింగ్ సినిమాల హవా కూడా ఉంది
తెలుగు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ చిత్రాలు కూడా సంక్రాంతి రేసులో నిలిచాయి. దళపతి విజయ్ నటించిన జన నాయకుడు జనవరి 9న విడుదల కానుండగా, శివకార్తికేయన్ నటించిన పరాశక్తి జనవరి 10న థియేటర్లలోకి రానుంది.

చివరికి హిట్ ఎవరిది?
ఇంత భారీ పోటీ మధ్య ప్రేక్షకులు ఏ సినిమాకు పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది. స్టార్ పవర్, కంటెంట్, టైమింగ్ – ఈ మూడింటిలో ఎవరు బ్యాలెన్స్ సాధిస్తారో.. ఈ సంక్రాంతి బాక్సాఫీస్ విజేత వారేనని చెప్పాలి. మరి ఈ పండుగ సీజన్‌లో నిజమైన విజేత ఎవరో తేలాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇవీ చదవండి: Sankranti : సంక్రాంతి వేళ పతంగులతో ప్రమాదం.. కఠిన చర్యలు.. జైలు శిక్షకూ వెనుకాడం: రైల్వేశాఖ హెచ్చరిక
Good News : వాహనదారులకు పండుగ గిఫ్ట్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ ప్రయాణం? హైదరాబాద్–విజయవాడ హైవేపై తెలంగాణ ప్రభుత్వ కీలక ప్రతిపాదన

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు