ఆదివారం, 25 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Telangana

TS LAWCET : తెలంగాణలో ఈసెట్, లాసెట్ షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి నుంచే దరఖాస్తుల స్వీకరణ.. విద్యార్థులకు కీలక ప్రకటన

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 28 జనవరి 2026

TS LAWCET : తెలంగాణ రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈసెట్ (TS ECET), లాసెట్ (TS LAWCET) పరీక్షల షెడ్యూల్‌ను ఉమ్మడి ప్రవేశ పరీక్షల కమిటీ అధికారికంగా విడుదల చేసింది. దరఖాస్తుల తేదీలు, నోటిఫికేషన్ వివరాలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. ఈ ప్రకటనతో ఇంజనీరింగ్, లా కోర్సుల్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు స్పష్టత లభించింది.

ఫిబ్రవరి 8న లాసెట్ నోటిఫికేషన్
తాజా షెడ్యూల్ ప్రకారం తెలంగాణ లాసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న విడుదల కానుంది.
ఫిబ్రవరి 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

లాసెట్ ద్వారా
ఇంటర్ అర్హతతో 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ
డిగ్రీ అర్హతతో 3 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ
ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన వారికి 2 సంవత్సరాల ఎల్‌ఎల్‌ఎం
కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఇంటర్ పూర్తి చేసిన వారు లేదా ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా లాసెట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 5న ఈసెట్ నోటిఫికేషన్
ఇక తెలంగాణ ఈసెట్‌ 2026 నోటిఫికేషన్ ఫిబ్రవరి 5న విడుదల కానుంది.
ఫిబ్రవరి 9 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి.
ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఈసెట్ ద్వారా
పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు
బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులు
లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో సంవత్సరంలో బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.
గత ఏడాదికంటే ముందుగానే దరఖాస్తు ప్రక్రియ
ఈ ఏడాది ఈసెట్ దరఖాస్తు ప్రక్రియ గత ఏడాదితో పోలిస్తే దాదాపు 20 రోజుల ముందుగానే ప్రారంభం కానుండటం గమనార్హం. దరఖాస్తుల సంఖ్యను బట్టి పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచే అంశంపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

పరీక్ష కేంద్రాల పెంపుపై అధికారుల దృష్టి
లాసెట్‌కు ప్రతి ఏడాది దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ఈసారి వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
విద్యార్థులు తమ విద్యార్హత, ఆసక్తికి అనుగుణంగా సరైన కోర్సును ఎంచుకుని గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇవీ చదవండి: Collectors Conference : మార్చి 2026 నాటికి సోలార్ 2.93 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లు
AP Employees: టీడీపీ మేనిఫెస్టోతో డైలమాలో ఏపీ ఉద్యోగులు! మైండ్ సెట్‌ మారిందా?

ట్యాగ్స్: , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading