Allu Arjun : ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయంగా మరో మెట్టు పైకి తీసుకెళ్లిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లు సాధించిన ఈ మూవీ ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.
ఇటీవల జపాన్‌లో విడుదలైన పుష్ప 2 జపనీస్ వెర్షన్‌కు థియేటర్లలో మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ స్వయంగా అక్కడే ఉండి సినిమా ప్రమోషన్లను మరింత ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు.
టోక్యోలో అభిమానులతో ముఖాముఖి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్నారు. భార్య అల్లు స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి అక్కడి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ ఫ్యామిలీ టైమ్ ఎంజాయ్ చేస్తున్నారు.
అదే సమయంలో పుష్ప 2 ప్రమోషన్లలో భాగంగా జపాన్ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ, అభిమానులతో ప్రత్యేకంగా కలుస్తున్నారు. ఈ క్రమంలో టోక్యోలో జరిగిన ఓ ఫ్యాన్ మీట్‌లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.
మహిళాభిమానిని గుర్తుపట్టి పలకరించిన బన్నీ…
ఫ్యాన్స్‌తో కరచాలనం చేస్తూ ఆప్యాయంగా మాట్లాడుతున్న అల్లు అర్జున్, అక్కడున్న ఓ మహిళాభిమానిని గుర్తుపట్టి ప్రత్యేకంగా పలకరించారు. తన అభిమాన హీరో నుంచి ఊహించని స్పందన రావడంతో ఆ మహిళ ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది.
ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న ఆమెను పక్కన ఉన్నవారు ఓదార్చడం అక్కడున్న వారిని కదిలించింది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ వినయశీలతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సెన్సో-జి ఆలయ దర్శనం… ఫ్యామిలీ ఫోటోలు వైరల్
గత వారం రోజులుగా జపాన్‌లోనే ఉన్న అల్లు ఫ్యామిలీ, తాజాగా టోక్యోలోని ప్రసిద్ధ బౌద్ధ ఆలయం సెన్సో-జి టెంపుల్ ను దర్శించుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను అల్లు స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
సింపుల్ లుక్‌లో ఫ్యామిలీతో కలిసి కనిపించిన అల్లు అర్జున్ ఫొటోలు నెటిజన్ల నుంచి భారీ లైక్స్, కామెంట్స్ అందుకుంటున్నాయి.
జపాన్‌లోనూ పుష్ప రాజ్ హవా…
జనవరి 16న జపాన్‌లో విడుదలైన పుష్ప 2 జపనీస్ వెర్షన్‌కు మంచి కలెక్షన్స్ వస్తున్నట్టు సమాచారం. భారత సినిమాలపై జపాన్ ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తికి ఈ మూవీ మరో ఉదాహరణగా నిలుస్తోంది.
కాగా 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప 2: ది రూల్, ఇండియన్ బాక్సాఫీస్‌ను ఊహించని స్థాయిలో షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ‘దంగల్’ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా, సుకుమార్ దర్శకత్వం వహించారు.
ఇవీ చదవండి: Allu arjun watch : అల్లు అర్జున్ ధరించిన వాచ్ ధర చూసి షాక్… లగ్జరీ లుక్‌తో కాసియో వింటేజ్ ఆల్‌రౌండ్ అట్రాక్షన్!
Allu Arjun : నా డియరెస్ట్ ఫ్రెండ్ కు ఆల్ ది బెస్ట్: అల్లు అర్జున్
