HomeCinemaAllu arjun watch : అల్లు అర్జున్ ధరించిన వాచ్ ధర చూసి షాక్… లగ్జరీ...

Allu arjun watch : అల్లు అర్జున్ ధరించిన వాచ్ ధర చూసి షాక్… లగ్జరీ లుక్‌తో కాసియో వింటేజ్ ఆల్‌రౌండ్ అట్రాక్షన్!

Allu arjun watch : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడూ తన ఫ్యాషన్ సెన్స్‌తో ట్రెండ్ సెట్ చేస్తారు. పుష్ప 2 ఘన విజయంతో దూసుకుపోతున్న బన్నీ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఓ భారీ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్‌తో ఎంత బిజీగా ఉన్నా, స్టైల్ విషయంలో మాత్రం ఎప్పుడూ తనదైన మార్క్ చూపిస్తూనే ఉంటారు.

ఇక తాజాగా బన్నీ ధరించిన ఓ వాచ్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. లగ్జరీగా, స్టైలిష్‌గా కనిపించిన ఆ వాచ్ ధర తెలుసుకుని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

కేవలం రూ. 5,295 విలువైన వింటేజ్ వాచ్
అల్లు అర్జున్ ఇటీవల కేవలం ₹5,295 మాత్రమే ధరగల కాసియో వింటేజ్ సిరీస్‌లోని REF A700WG-9A వాచ్‌తో కనిపించారు. లుక్ మాత్రం లగ్జరీ బ్రాండ్ రేంజ్‌లో ఉన్నట్టే కనిపించడంతో అందరూ దాని రేటు తెలుసుకుని షాక్‌ అవుతున్నారు.

వింటేజ్ లుక్… గోల్డెన్ ఫినిషింగ్
ఈ కాసియో వాచ్ ప్రత్యేకతలు:
గోల్డెన్ స్టెయిన్‌లెస్-స్టీల్ స్ట్రాప్
దీర్ఘచతురస్రాకార రెట్రో డయల్
ట్రెండీ సిల్హౌట్‌తో పాటు తేలికైన రెసిన్ కేసు
స్టాప్‌వాచ్, డైలీ అలారం, అవర్‌లీ చైమ్
LED ఇల్యూమినేషన్
ఆటో క్యాలెండర్
వాటర్ రెసిస్టెంట్ ఫీచర్
చాలా మంది యువతీ యువకులు ఇష్టపడే వింటేజ్ స్టైల్‌లో ఈ వాచ్ ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ట్రెండ్‌కు దారి తీస్తోంది.

డిజైనర్ షర్ట్ కంటే తక్కువ ధర!
బన్నీ లాంటి స్టార్ హీరో అంత తక్కువ ఖరీదైన వాచ్‌ను ఎంచుకోవడం నెట్టింట చర్చగా మారింది. డిజైనర్ షర్ట్ కంటే తక్కువ ధర ఉన్న ఈ వాచ్‌ను అల్లు అర్జున్ ఎంచుకోవడం చూసి ఫ్యాన్స్ మరింత ఇంప్రెస్ అవుతున్నారు.

ఇవీ చదవండి: Allu Arjun : నా డియరెస్ట్ ఫ్రెండ్ కు ఆల్ ది బెస్ట్: అల్లు అర్జున్
Allu Arjun : టైమ్ చూసి కొట్టిన అల్లు అర్జున్.. రేవంత్ రెడ్డి ఎదురుగా పవర్ ఫుల్ డైలాగ్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు