Allu Arjun : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో ఇటీవల తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన నాయనమ్మ అల్లు కనకరత్నమ్మ మరణంతో కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఇటీవలే ఆమెకు దశదినకర్మ కూడా నిర్వహించారు. ఈ సమయంలోనే బన్నీ తన సినిమా షూటింగ్స్, సోషల్ మీడియా యాక్టివిటీల్లో బిజీగా ఉంటూ అభిమానులతో కనెక్ట్ అవుతున్నాడు. (Allu Arjun)
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ పాన్‌వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో, దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తైంది.
ఇక మరోవైపు, ఐదేళ్ల తర్వాత నటి మంచు లక్ష్మీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘దక్ష’. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా బన్నీ సోషల్ మీడియాలో స్పందిస్తూ మంచు లక్ష్మీ, దక్ష చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు.
అల్లు అర్జున్ పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు:
“నా మిత్రురాలు మంచు లక్ష్మీ ప్రసన్నకు నా శుభాకాంక్షలు. మీరు, మోహన్ బాబు గారు కలిసి తెరపై కనిపించడం అద్భుతంగా ఉంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దక్ష చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్.”
దీనితో అల్లు అర్జున్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి: Allu Arjun : టైమ్ చూసి కొట్టిన అల్లు అర్జున్.. రేవంత్ రెడ్డి ఎదురుగా పవర్ ఫుల్ డైలాగ్!
Allu Arjun T shirt: నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా.. అల్లు అర్జున్ సంచలనం
