HomeAndhra PradeshAP SET 2025 Exam Date: ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల –...

AP SET 2025 Exam Date: ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల – రాత పరీక్ష తేదీలు ఇవే

AP SET 2025 Exam Date: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లుగా ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష (AP SET) 2025 నోటిఫికేషన్‌ను తాజాగా Andhra University విడుదల చేసింది. ఈ ఏడాది కూడా ఏపీ సెట్ నిర్వహణ బాధ్యతలను ఆంధ్రా యూనివర్సిటీనే నిర్వహిస్తోంది.

మొత్తం 30 సబ్జెక్టుల్లో ఏపీ సెట్ 2025 పరీక్షలు నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

అర్హతలు
ఏపీ సెట్ 2025కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఈ పరీక్షకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు, అంటే వయస్సుతో సంబంధం లేకుండా అర్హులైన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష విధానం
పేపర్–1: జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (అందరికీ కామన్)
పేపర్–2: అభ్యర్థి ఎంపిక చేసిన సబ్జెక్టులో ఉంటుంది

సబ్జెక్టుల జాబితా
ఆంత్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్–అట్మాస్ఫియరిక్–ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్.

ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 9, 2026
రాత పరీక్ష తేదీలు: మార్చి 28 & 29, 2026
పరీక్ష కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాలు

అర్హత సర్టిఫికెట్
ఏపీ సెట్‌లో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు SET సర్టిఫికెట్‌కు లైఫ్‌టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు
జనరల్: రూ.1600
బీసీ / ఈడబ్ల్యూఎస్: రూ.1300
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ: రూ.900
ఏపీ సెట్ ద్వారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల అవకాశాలు పొందవచ్చు. అకడమిక్ కెరీర్ ఆశించే అభ్యర్థులకు ఇది కీలక పరీక్షగా చెప్పవచ్చు.

ఇవీ చదవండి: AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు వెల్లడి.. డీఎస్సీపై లోకేష్ ఏమన్నారంటే..
Kancha Ilaiah: ఏపీలో చదువుల విప్లవం మరో ఐదేళ్లు కొనసాగాలి.. జగన్‌ రాజకీయాలను మార్చేశారు: కంచ ఐలయ్య

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు