HomeCrime NewsHoney trap : మెట్‌పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు.. మహిళలతో వల వేసి బ్లాక్‌మెయిల్

Honey trap : మెట్‌పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు.. మహిళలతో వల వేసి బ్లాక్‌మెయిల్

Honey trap : తెలంగాణ జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో అమాయక ప్రజలను, ముఖ్యంగా ఆర్థికంగా బలమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న హనీ ట్రాప్ ముఠాను పోలీసులు ఛేదించారు. మహిళల ద్వారా పరిచయం పెంచుకుని, అనంతరం బెదిరింపులకు దిగుతూ భారీగా డబ్బు వసూలు చేస్తున్న ఈ ముఠాకు సంబంధించిన ముగ్గురిని మెట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న రౌడీ షీటర్ కోరుట్ల రాజ్‌కుమార్ అలియాస్ రాజుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

మెట్‌పల్లి దుబ్బవాడకు చెందిన రాజ్‌కుమార్‌పై గతంలోనే పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు అతనిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాజు, భర్తకు దూరంగా ఉంటున్న బలుమూరి స్వప్న అనే మహిళతో కలిసి ఈ మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. వీరిద్దరితో పాటు బట్టు రాజశేఖర్, సుంకిటి వినోద్, పులి అరుణ్, మాగని దేవా నర్సయ్యలు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు.

హనుమాన్ నగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకున్న ఈ ముఠా, మహిళల పట్ల బలహీనత చూపే వ్యక్తుల ఫోన్ నంబర్లు సేకరించింది. అనంతరం స్వప్న ఫోన్ కాల్స్ ద్వారా పరిచయం పెంచుకుని వారిని గదికి రప్పించేది. ఆ సమయంలో మిగిలిన సభ్యులు అకస్మాత్తుగా అక్కడికి చేరుకుని వీడియోలు తీసి, వాటిని బయటపెడతామని బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలువురిని ఇదే విధంగా బ్లాక్‌మెయిల్ చేసినట్టు ఆధారాలు లభించాయి.

మూడు నెలల క్రితం మెట్‌పల్లికి చెందిన ఓ వ్యాపారిని టార్గెట్ చేసిన ఈ ముఠా, డిసెంబర్ 28న ముందుగా రూపొందించిన ప్లాన్ ప్రకారం గదికి పిలిపించింది. అనంతరం విషయం బయటకు రాకుండా ఉండాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రాణహాని బెదిరింపులకు దిగింది. బాధితుడు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అరెస్ట్ చేసిన నిందితుల మొబైల్ ఫోన్లను పరిశీలించగా, గతంలో చేసిన బ్లాక్‌మెయిల్‌కు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సీఐ వి.అనిల్ కుమార్ మాట్లాడుతూ, సోషల్ మీడియా పరిచయాలు లేదా అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్‌ను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఎవరైనా ఇలాంటి బెదిరింపులు లేదా మోసాలకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.

ఇవీ చదవండి: Telangana Crime : అక్క వరుసయ్యే మహిళతో వివాహేతర బంధం.. చివరకు భర్త చేతిలో ఏమైందంటే..
Supreme Court: వివాహేతర బంధం నిర్ధారణకు కాల్‌ రికార్డులు తీసుకోవచ్చా? సుప్రీంకోర్టు ఏమందంటే..
Mohammed Shami: షమీపై మాజీ భార్యకు ఎంతకంత పగ.. వివాహేతర సంబంధాలంటూ మళ్లీ తీవ్ర ఆరోపణలు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు