HomeCinemaSonali : చిరంజీవి–మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్లకూ వన్నె తగ్గని గ్లామర్… క్యాన్సర్‌ను జయించి...

Sonali : చిరంజీవి–మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్లకూ వన్నె తగ్గని గ్లామర్… క్యాన్సర్‌ను జయించి నిలిచిన మగువ

Sonali : తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన హీరోయిన్లలో సోనాలి బింద్రే ఒకరు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ రోజు (జనవరి 1) సోనాలి బింద్రే 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

తెలుగులో మురారి, ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, శంకర దాదా ఎంబీబీఎస్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సోనాలి… తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అప్పట్లో ఆమె అందం, సహజమైన నటన యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగుతో పాటు హిందీలోనూ పలువురు స్టార్ హీరోలతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరమైన సోనాలి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. 2018లో ఆమెకు స్టేజ్-4 మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లిన ఆమె అక్కడ కఠినమైన వైద్య చికిత్స తీసుకున్నారు. ఎంతో మానసిక ధైర్యంతో పోరాడిన సోనాలి, 2021 నాటికి పూర్తిగా కోలుకుని కొత్త జీవితం ప్రారంభించారు.

క్యాన్సర్ నుంచి బయటపడ్డ తర్వాత తన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు సోనాలి బింద్రే. ఇటీవల ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్‌తో కలిసి భోజనం చేసిన సందర్భంగా తన డైట్, లైఫ్‌స్టైల్ సీక్రెట్స్‌ను పంచుకున్నారు. తాను రాత్రి భోజనం ఎప్పుడూ సాయంత్రం 6.30 లేదా 7 గంటల లోపే పూర్తి చేస్తానని చెప్పారు. రాత్రివేళ ఆలస్యంగా మేల్కొనడం, పార్టీల పేరుతో బయట తిరగడం తనకు అస్సలు ఇష్టం ఉండదని స్పష్టం చేశారు.

తాను మహారాష్ట్ర కుటుంబానికి చెందినవారినని, తన భర్త గోల్డీ బెహల్ పంజాబీ కుటుంబంలో పెరిగారని చెప్పారు. పెళ్లైన తొలినాళ్లలో ఆహార అలవాట్ల విషయంలో కొంత ఇబ్బంది ఎదురైందని కూడా సరదాగా గుర్తుచేసుకున్నారు.

ఆహార విషయానికి వస్తే… ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్‌కు దూరంగా ఉంటానని, కూరగాయలు, మొలకలు, ఫైబర్, ఖనిజాలు, కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్నే ప్రాధాన్యం ఇస్తానని సోనాలి తెలిపారు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, యోగా ద్వారా మానసిక ప్రశాంతతను నిలబెట్టుకోవడం తన జీవనశైలిలో భాగమని చెప్పారు.

చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉన్నప్పటికీ, సోనాలి బింద్రే ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. క్యాన్సర్‌ను జయించి, 51 ఏళ్ల వయసులోనూ అదే చిరునవ్వు, అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న సోనాలి… ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఇవీ చదవండి: Tollywood: టాప్ 10లో టాలీవుడ్ హవా.. ఆరుగురు మన హీరోలే! నంబర్‌ 1 ఎవరో తెలుసా?
Tollywood : ఒకప్పుడు గ్లామర్‌తో ఊపేసింది.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఈ భామ ఎవరో తెలుసా?
Tollywood : ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్.. కట్ చేస్తే అవకాశాలే కట్! కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ కథ ఇదే

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు