HomeAndhra PradeshCUET UG 2026 Exam Date: సీయూఈటీ యూజీ–2026 ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే.. అప్లికేషన్లపై కీలక...

CUET UG 2026 Exam Date: సీయూఈటీ యూజీ–2026 ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే.. అప్లికేషన్లపై కీలక సూచనలు

CUET UG 2026 Exam Date: దేశంలోని 47 సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్‌గ్రాడ్యుయేట్‌ (UG) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే CUET UG 2026 నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అభ్యర్థులకు కొన్ని ముఖ్య సూచనలు చేసింది. ముఖ్యంగా ఈసారి దరఖాస్తు సమయంలో అవసరమైన డాక్యుమెంట్లను ముందుగానే అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది.

ప్రతి సంవత్సరం మాదిరిగానే 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంఏ/ఎంఎస్సీ/ఎంబీఏ తదితర UG ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం CUET UG నిర్వహించనుంది. ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో జరగనున్నట్లు NTA తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా 13 భాషల్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.

పరీక్ష తేదీలు
CUET UG 2026 ఆన్‌లైన్ పరీక్షలు మే 13 నుంచి జూన్ 3 వరకు వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

సిలబస్ & దరఖాస్తుల వివరాలు
సీయూఈటీ 2026 సిలబస్‌ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్ దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్‌తో పాటు విడుదల కానున్నాయి.

డాక్యుమెంట్లపై కీలక సూచనలు
దరఖాస్తు సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అభ్యర్థులు ముందుగానే ఈ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు:

ఆధార్ కార్డ్: పేరు, పుట్టిన తేదీ, చిరునామా 10వ తరగతి సర్టిఫికెట్ ప్రకారం సరిపోలేలా ఉండాలి; ఫోటో కూడా అప్‌డేట్ అయి ఉండాలి.

కేటగిరీ సర్టిఫికెట్లు: EWS / SC / ST / OBC-NCL సర్టిఫికెట్లు చెల్లుబాటు అయ్యేలా అప్డేట్ చేయాలి.

దివ్యాంగ అభ్యర్థులు: UDID కార్డ్ చెల్లుబాటు అయ్యేలా రిన్యువల్ చేసి అప్‌డేట్‌గా ఉంచాలి.

ఈ సూచనలు పాటిస్తే దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తవని అధికారులు స్పష్టం చేశారు.

అప్‌డేట్స్ కోసం వెబ్‌సైట్‌లు
అభ్యర్థులు తాజా సమాచారానికి ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లను పరిశీలించాలని NTA సూచించింది:
https://nta.ac.in
https://cuet.nta.nic.in/

ఇవీ చదవండి: RRB Group D 2025: గ్రూప్ డీ పరీక్ష తేదీలు మారాయి.. ఆర్‌ఆర్‌బీ విడుదల చేసిన కొత్త షెడ్యూల్ ఇదే
RBI Bank Jobs 2025: నెలకు రూ.6 లక్షల వరకు జీతం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎక్స్‌పర్ట్స్ ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు