HomeCrime NewsHyderabad: అర్ధరాత్రి దారుణం.. కత్తి దాడిలో యువకుడి హత్య.. అన్న అక్రమ సంబంధంతో

Hyderabad: అర్ధరాత్రి దారుణం.. కత్తి దాడిలో యువకుడి హత్య.. అన్న అక్రమ సంబంధంతో

Hyderabad: హైదరాబాద్ మహానగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. టోలీచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారామౌంట్ కాలనీలో అర్ధరాత్రి జరిగిన కత్తి దాడిలో ఇర్ఫాన్ (24) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, బిలాల్ అనే వ్యక్తి ఇర్ఫాన్‌పై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడైంది. బిలాల్ భార్యకు, మృతుడు ఇర్ఫాన్ తమ్ముడు అద్నాన్కు మధ్య అక్రమ సంబంధం ఉందన్న అనుమానాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.

గొడవ ఆపేందుకు వచ్చిన అన్న.. ప్రాణాలు కోల్పోయాడు
బిలాల్, అద్నాన్ మధ్య గొడవ జరుగుతోందన్న సమాచారం అందుకున్న ఇర్ఫాన్, పరిస్థితిని శాంతింపజేయాలనే ఉద్దేశంతో సంఘటన స్థలానికి చేరుకున్నాడు. అయితే అక్కడ మాటల దాడి తీవ్ర స్థాయికి చేరడంతో బిలాల్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఇర్ఫాన్ ఛాతిలో కత్తి గుచ్చుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

గాయపడిన ఇర్ఫాన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, ఆలివ్ హాస్పిటల్ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో అద్నాన్ కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

పోలీసుల అదుపులో నిందితుడు
సమాచారం అందుకున్న టోలీచౌకి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు బిలాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పారామౌంట్ కాలనీ గేట్ నెంబర్‌–4, మర్వ డెంటల్ హాస్పిటల్ సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, గొడవకు గల అసలు కారణాలు, ఘటనలో ఉపయోగించిన ఆయుధం తదితర అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి: Vizag crime : విశాఖ పెందుర్తి: దొంగ-పోలీస్ ఆట పేరుతో అత్తను కాల్చి చంపిన కోడలు లలిత.. షాకింగ్!
Telangana Crime : మామూలోడు కాదు.. రాష్ట్రంలోనే మోస్ట్ వాంటెడ్‌ రౌడీషీటర్‌ సూరి మళ్లీ పోలీసుల వలలో!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు