HomeSportsIPL 2026: రూ.43 కోట్ల పర్స్‌తో సీఎస్కే ర్యాంపేజ్.. వేలంలో ‘డాడీస్’ షో మొదలే!

IPL 2026: రూ.43 కోట్ల పర్స్‌తో సీఎస్కే ర్యాంపేజ్.. వేలంలో ‘డాడీస్’ షో మొదలే!

IPL 2026: మరికొన్ని గంటల్లో అబుదాబీ వేదికగా IPL 2026 మినీ వేలం జరగనుంది. అన్ని ఫ్రాంచైజీలు తమ వ్యూహాలను ఫైనల్ చేసుకున్న ఈ కీలక సమయంలో, **భారీ పర్స్‌తో బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK)**పై అందరి దృష్టి పడింది. సుమారు రూ.43 కోట్ల బడ్జెట్‌తో వేలంలోకి వస్తున్న సీఎస్కే.. ఈసారి “కొనేస్తారు.. అందరినీ కొనేస్తారు” అన్నట్టుగా దూకుడు ప్రదర్శించే అవకాశముందని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

9 స్లాట్లు.. పక్కా ప్లానింగ్
ప్రస్తుతం సీఎస్కే స్క్వాడ్‌లో 9 ఖాళీ స్లాట్లు ఉన్నాయి. ఇందులో 4 విదేశీ స్లాట్లు ఉండగా, వాటిని క్వాలిటీ ప్లేయర్లతో భర్తీ చేయాలనే స్పష్టమైన ప్రణాళికతో చెన్నై వేలంలోకి అడుగుపెడుతోంది.
చెన్నై భర్తీ చేయాల్సిన కీలక పాత్రలు ఇవే:
6వ నెంబర్ ఫినిషర్
ఇండియన్ స్పిన్నర్
విదేశీ డెత్ ఓవర్ పేసర్
ఇండియన్ మిడిల్ & డెత్ పేసర్

విదేశీ ఓపెనింగ్ బ్యాటర్
ఇండియన్ స్పిన్ ఆల్‌రౌండర్
ఇండియన్ పేస్ ఆల్‌రౌండర్
బ్యాకప్ ఇండియన్ ఫినిషర్
విదేశీ స్పిన్ ఆల్‌రౌండర్

మొదటి సెట్‌లోనే బిగ్ టార్గెట్స్
వేలం ప్రారంభమైన వెంటనే వచ్చే మొదటి సెట్‌లో కామెరూన్ గ్రీన్, డేవిడ్ మిల్లర్పై సీఎస్కే దృష్టి పెట్టే అవకాశం ఉంది.
కామెరూన్ గ్రీన్ లాంటి ఆల్‌రౌండర్ 6వ నంబర్‌లో జట్టుకు కీలకంగా మారవచ్చు. బ్యాటింగ్‌తో పాటు పేస్ బౌలింగ్ చేయగలగడం చెన్నైకి పెద్ద అడ్వాంటేజ్.
అయితే గ్రీన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

రెండో, మూడో సెట్లలో ఆప్షన్ల వర్షం
రెండో సెట్‌లో
వెంకటేష్ అయ్యర్, వనిందు హసరంగ, దీపక్ హుడా, వియాన్ ముల్డర్, రచిన్ రవీంద్ర, లియామ్ లివింగ్‌స్టోన్ లాంటి ఆల్‌రౌండర్లు సీఎస్కే రాడార్‌లో ఉండొచ్చు.

మూడో సెట్‌లో
విదేశీ ఓపెనర్ బ్యాకప్ కోసం
ఫిన్ అలెన్, జానీ బెయిర్‌స్టో, బెన్ డకెట్, రహ్మనుల్లా గుర్బాజ్, జామీ స్మిత్ లాంటి బ్యాటర్లు చెన్నైకి బెస్ట్ ఆప్షన్లుగా కనిపిస్తున్నారు.

పేస్ & డెత్ ఓవర్లపై ప్రత్యేక ఫోకస్
నాలుగో సెట్‌లో మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లకు సరైన ఎంపికగా మతీశ పతిరానాపై సీఎస్కే కన్నేయొచ్చు.
ఆరో సెట్‌లో పవర్‌ఫుల్ ఫినిషర్‌గా అభిన్ మనోహర్ను టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది.
తొమ్మిదో సెట్‌లో ఇండియన్ పేసర్ల కోసం ఆకాశ్ మధ్వాల్పై ప్రయత్నం జరిగే అవకాశం.
మధ్వాల్ దొరకకపోతే చేతన్ సకారియా బ్యాకప్ ఆప్షన్‌గా ఉండొచ్చు.

స్పిన్ & ఆల్‌రౌండర్ బ్యాకప్ ప్లాన్
పదో సెట్‌లో స్పిన్ ఆల్‌రౌండర్లుగా కుమార్ కార్తికేయ
పన్నెండో సెట్‌లో మిల్లర్ లేదా గ్రీన్ దొరకకపోతే జాసన్ హోల్డర్
పదహేనో సెట్‌లో పతిరానా దొరకకపోతే డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా ముస్తాఫిజుర్ రెహమాన్పై చెన్నై దృష్టి పెట్టే అవకాశం ఉంది.

సీఎస్కే రాడార్‌లో ఉన్న ప్రధాన ఆటగాళ్లు
మొత్తంగా ఈ మినీ వేలంలో సీఎస్కే లక్ష్యంగా చేసుకునే ఆటగాళ్లలో:
కామెరూన్ గ్రీన్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, జామీ స్మిత్, మతీశ పతిరానా, రవి బిష్ణోయ్, రాహుల్ చాహర్, అకీల్ హోసేన్, అభిన్ మనోహర్, కుమార్ కార్తికేయ, జాసన్ హోల్డర్, ముస్తాఫిజుర్ రెహమాన్, చేతన్ సకారియా, సోను యాదవ్, సన్నీ సంధు, తనుష్ కోటియన్ పేర్లు వినిపిస్తున్నాయి.

భారీ పర్స్, క్లియర్ స్ట్రాటజీ, అనుభవజ్ఞులైన మేనేజ్‌మెంట్‌తో IPL 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ షో మాములుగా ఉండదనే చెప్పాలి. ‘డాడీస్’ ఈసారి ఎవ్వరిని కొనేస్తారో చూడాలి!

ఇవీ చదవండి: Chennai Super Kings : ఇంటిబాట పట్టిన సీఎస్కే.. వరుస వైఫల్యాలకు కారణాలివీ!
Surya: సీఎస్కే స్టార్‌ బ్యాటర్‌పై సూర్యకుమార్ హాట్ కామెంట్స్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు