Jagan press meet: మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. వైయస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పెడుతున్న కేసులు, సరస్వతి పవర్ భూముల అలిగేషన్స్ పై వివరణ, రాష్ట్రంలో శాంతిభద్రతలు.. ఇలా అనేక అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. పూర్తి వివరాలు, ముఖ్యాంశాలు ఇవీ.. (Jagan press meet)
– ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు.. వాస్తవానికి ఇలాంటి అన్యాయమైన పరిస్థితులు బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా, ఎప్పుడూ చూసి ఉండరు.
– అంత దారుణమైన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం అతలాకుతల పరిస్థితిలో ఉంది. (Jagan press meet)
– చీకటి రోజులు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? ఎన్నికలప్పుడు మనం ఏం చెప్పాం, ఏం చేస్తున్నాం అన్నది పక్కకు వెళ్లిపోయింది.
– మనం ఎన్నికలప్పుడు చెప్పినది చేయడం లేదు కాబట్టి దాన్ని ప్రశ్నించే స్వరం ఉండకూడదని ఏకంగా అణగదొక్కే కార్యక్రమాలు, చర్యలు మాత్రమే కనిపిస్తున్నాయి.
– అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అన్నారు. సూపర్ సెవెన్ లు అన్నారు. 5 నెలలు అయిపోయింది. సూపర్ సిక్సులు లేవు, సూపర్ సెవెన్ లూ లేవు.
– ప్రతి సెక్షన్ నూ మోసం చేశారు. నీకు 15 వేలు నీకు 15 వేలు అంటూ పిల్లలను మోసం చేశారు. నీకు 18 వేలు అంటూ అక్కచెల్లెమ్మలను, నీకు 48 వేలు అంటూ 50 ఏళ్లు నిండిన పెద్దమ్మలను మోసం చేశారు. నీకు 36 వేలు అంటూ 20 ఏళ్లు నిండి ఉద్యోగం కోసం వెతుక్కుంటున్న యువతను, నీకు 20 వేలు అంటూ రైతన్నలను మోసం చేశారు.
– 5 నెలలుగా ఈ ప్రభుత్వం మోసం చేయని సెక్షన్ ఏదీ లేదు అన్నట్టుగా ఈ ప్రభుత్వం 5 నెలల్లో పాలనలో మనం చూసింది ఏమంటే ప్రతి సెక్షన్ నూ మోసం చేశారు.
– రాష్ట్రంలో ఈరోజు పరిపాలన అన్ని వ్యవస్థలనూ కూడా నీరుగార్చిన పరిస్థితులు. నాశనం చేసిన పరిస్థితుల మధ్య రాష్ట్రం ప్రయాణం చేస్తోంది.
– పిల్లలు ఫీజు రీయింబర్స్ మెంటు అందక మామూలుగా జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ కు సంబంధించిన బిల్లులు ఏప్రిల్ లో వెరిఫికేషన్ చేసి మేలో బిల్లులు ఇవ్వాలి.
– మా ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఇదే మాదిరిగా ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చేవాళ్లం. (Jagan press meet)
– మే 13న ఎన్నికలు జరిగాయి. వీళ్ల ప్రభుత్వం వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఒక క్వార్టర్, ఏప్రిల్, మే, జూన్ రెండో క్వార్టర్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మూడో క్వార్టర్ ఎగిరిపోయింది. ఇప్పుడు అక్టోబర్, నవంబర్ రేపు నెల వచ్చేది డిసెంబర్.. మూడు క్వార్టర్స్ నుంచి పిల్లలకు ఇవ్వాల్సిన విద్యాదీవెన ఇవ్వలేదు. పిల్లలు రోడ్డెక్కుతున్నారు.
– కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టకపోతే పిల్లల చదువులను మాన్పించేయాలని తల్లిదండ్రులపై ప్రెజర్ పెడుతున్నారు. పట్టించుకునే పరిస్థితులు లేవు.
– మామూలుగా ప్రతి ఏప్రిల్ లోనూ వసతి దీవెన కింద పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంటే కాకుండా వసతి దీవెన కింద కూడా మా ప్రభుత్వంలో ప్రతి పిల్లాడికీ ఒక ఇన్ స్టాల్ మెంట్ వచ్చేది.
– ఇంజనీరింగ్, డిగ్రీ చదివే వారికి ప్రతి సంవత్సరం 20 వేలు ఇచ్చే కార్యక్రమంలో వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్ లో ఒక ఇన్ స్టాల్ మెంట్ ఇచ్చేవాళ్లం. విద్యాసంవత్సరానికి ముందు, చివర్లో. అదీ పోయింది.
– విద్యా వ్యవస్థ మొత్తం రోడ్డుమీదకు ఎక్కింది. గవర్నమెంటు బడులు నాశనం అయ్యాయి. ఇంగ్లీషు మీడియం గాడి తప్పింది. టోఫెల్ క్లాసులు మూసేశారు. సీబీఎస్ఈ మూసేసే కార్యక్రమం.
– ఐబీదాకా ప్రయాణం అనుకున్నది సీబీఎస్ఈ ని కూడా మూసేశారు. సబ్జెక్ట్ టీచర్లను గాలికొదిలేశారు. నాడు నేడు పనులు ఆగిపోయాయి. గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా రోజుకో మెనూతో ఇవ్వాల్సిన ఫుడ్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది.
– అమ్మ ఒడి అయితేనేను చెప్పాల్సిన పని లేదు. గాలికి ఎగిరిపోయింది. విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వైద్యం పరిస్థితి కూడా అంతే
– ఆరోగ్యశ్రీ కింద ఇవ్వాల్సిన బకాయిలు రూ.2,400 కోట్లు దాటాయి.
– 104, 108కు ఇవ్వాల్సిన బకాయిలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 5 నెలల నుంచి రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరా ఊసే లేదు.
– ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గాలికి ఎగిరిపోయింది. గవర్నమెంట్ ఆస్పత్రిలో డబ్ల్యూహెచ్ఓ జీఎంపీ మందులు మాత్రమే ఉండే పరిస్థితి మా ప్రభుత్వ హయాంలో ఉంటే ఈరోజు గవర్నమెంట్ ఆస్పత్రుల్లో మందులు ఉన్నాయా లేదా అని పట్టించుకునే నాథుడే లేడు.
– జీరో వేకెన్సీతో డాక్టర్లు కొరత ఉండనే కూడదని మా ప్రభుత్వం తాపత్రయపడితే ఈరోజు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల నుంచి డిస్ట్రిక్ట్ ఆస్పత్రుల దాకా స్పెషలిస్ట్ డాక్టర్ల రిక్రూట్ మెంట్ ఆపేశారు.
– వ్యవసాయానికి సంబంధించి ఆర్బీకేలు ప్రతి గ్రామంలోనూ పెట్టి ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ను పెట్టి ప్రతి ఎకరానూ ఈ క్రాప్ చేసి ప్రతి రైతుకూ ఉచిత పంటల బీమా ఇచ్చే కార్యక్రమం వైయస్సార్ సీపీ హయాంలో జరిగితే, ఈ క్రాప్ లేదు, ఆర్బీకేలు నిర్వీర్యం, ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది.
– మళ్లీ ఈరోజు మధ్యవర్తులు, దళారీల ద్వారా కొనుగోలు జరుగుతోంది. (Jagan press meet)
– ప్రతి రంగంలోనూ కూడా విద్య, వైద్యం, వ్యవసాయం, డెలివరీ మెకానిజం.. గతంలో ప్రతి పథకం డోర్ డెలివరీ జరిగే పరిస్థితి నుంచి ఈరోజు డోర్ డెలివరీ ఊసే పోయింది.
– మళ్లీ జన్మభూమి కమిటీలు, టీడీపీ కార్యకర్తలు చెబితేనే ఏ పథకమైనా అందే పరిస్థితి.
– దాదాపు లక్షన్నర పెన్షన్లు అప్పుడే కటింగ్. మళ్లా కొత్త పెన్షన్లుఇచ్చే కార్యక్రమం జరగడం లేదు. ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది.
– లా అండ్ ఆర్డర్ గురించి చెప్పాల్సి వస్తే ఎప్పుడూ చూడని విషయాలు చూస్తున్నాం.
– 5 నెలల కాలంలో దాదాపుగా 91 మంది మహిళల మీద, పిల్లల మీద అత్యాచారాలు. అందులో 7 మంది చనిపోయారు.
– ఎలాంటి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయంటే సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దగ్గరుండి ఈ పనులు చేస్తున్నా కూడా ప్రభుత్వం స్పందించి వాటిని అరికట్టాల్సింది పోయి ఏకంగా సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు.
– తెనాలిలో సహానా అనే అమ్మాయిపై దాడి చేసి చంపేశారు. నేరస్తుడు టీడీపీ నాయకుడే రౌడీ షీటర్.కేంద్ర మంత్రి పెమ్మసాని అనుచరుడు, చంద్రబాబు కండువా కప్పుతూ దిగిన ఫొటోలు.
– బద్వేలు పట్టణంలో జరిగిన ఘటన అత్యంత దారుణం. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. కేకలు వేస్తూ అమ్మాయి పరుగులు తీసింది. పట్టించుకునే నాథుడు లేడు.
– శ్రీకాకుళంలో ఇద్దరు బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టారు. చేసిన వాళ్లు ఎవరంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకుల పిల్లలు.
– బర్త్ డే వేడుకలంటూ పిలిచి ఆ అమ్మాయిలకు కూల్ డ్రింక్స్ లో మత్తు పదార్థాలు కలిపి వారి జీవితాలతో చెలగాటం ఆడారు.
– హిందూపురంలో దసరా పండుగ రోజున అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్. నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు మూడు రోజులు కాలయాపన చేశారు. హిందూపురం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు బావమరిదే.
– ఇలాంటి ఘటన జరిగితే కనీసం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పరామర్శించలేదు.
– అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం కొప్పుగుండుపాలెంలో 9వ తరగతి బాలికను ప్రేమోన్మాది నరికి చంపేశాడు. తనను వేధిస్తున్నాడని అమ్మాయి గతంలో కేసు పెడితే అరెస్టు అయ్యి జైలుకు వెళ్లి మళ్లీ బయటకు వచ్చి బెదిరించాడు.
– దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే రెడ్ బుక్ పాలనలో నిమగ్నమైన పోలీసులు కనీసం పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆ కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవు. హోంమంత్రి పక్క నియోజకవర్గం అయినా పరామర్శకు వెళ్లలేదు.
– డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ భర్త, ఒక దళిత మహిళను తీసుకుని పోయి డంప్ యార్డులో రేప్ చేసే కార్యక్రమం చేస్తే అక్కడ చెత్త కాగితాలు ఏరుకునే వారు దళిత అమ్మాయిని కాపాడారు.
– ఇంతటి దారుణంగా ప్రతి చోటా జరుగుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఎర్రావారిపాలెం, యలమందలో జరిగిన ఘటన చూస్తే ప్రభుత్వం ఎలా పని చేస్తోందోతెలుస్తుంది.
– 10వ తరగతి పాపను ముసుగు వేసుకుని వచ్చి బైకులో బలవంతంగా కిడ్నాప్ చేసుకుని పోయి, మత్తు మాత్రలు తాగిపించి, కొట్టి, ఆ పాప మీద అత్యాచారం చేసే పరిస్థితిలోకి పోతే వాళ్ల నాన్న ఇంత దారుణమైన ఘటన జరిగిందని మీడియాకు వచ్చి చెబితే తప్ప పోలీసులు స్పందించలేదు.
– వాళ్ల నాన్న చెప్పిన తర్వాత ఇష్యూ పెద్దది అవుతోందని తెలిసిన తర్వాత, వైయస్సార్ సీపీ నుంచి నాయకులు వెళ్లిన తర్వాత పోలీసులు ఏం చేయాలి. పాపకు, వాళ్ల నాన్నకు క్షమాపణ చెప్పి చేసిన వాళ్ల మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి దీన్ని కవరప్ చేస్తారు.
– తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఆస్పత్రికి వచ్చి వాళ్ల నాన్నను భయపడిస్తారు. బలవంతంగా తప్పుడు స్టేట్ మెంట్లు ఇప్పిస్తారు.
– ఇదే కాకినాడ రూరల్ లో, డిప్యూటీ సీఎంకు సంబంధించిన ఎమ్మెల్యే, అనుచరుల మీద ఫీల్డ్ అసిస్టెంట్ పక్కలోకి వస్తావా అంటూ నన్ను అడిగారని స్టేట్ మెంట్ వైరల్ అయ్యింది.
– ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రశ్నిస్తూ సమాజంలో ఉన్న మనలాంటి వారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిపక్ష పార్టీల దగ్గర నుంచి మొదలు పెడితే సమాజ స్పృహ ఉన్న వారు, సోషల్ మీడియాలో ఉన్న వారు ఇటువంటి వ్యక్తుల్ని, చంద్రబాబును నిలదీస్తూ ప్రశ్నిస్తే ఏం జరుగుతోంది?
– ప్రశ్నించే స్వరం వినపడితే చాలు.. ఏకంగా ఈరోజు ఇల్లీగల్ డిటెన్షన్స్, సోషల్ మీడియాలో ఎవరైనా గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తే కేసులు.
– విజయవాడ వరదల్లో ముఖ్యమంత్రి సహా యంత్రాంగం ఫెయిల్ అయిందని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్ లు, వరద సహాయం పేరుతో కోట్లు మింగేసే చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కోటీ చిల్లర మందికి ఫుడ్ మీద 534 కోట్లు.. క్యాండిల్స్, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లు.. ఎక్కడ ఎవరికి పోయాయో అందరికీ తెలుసు. ఎవరికి కరెంటు పోయిందో తెలుసు. రూ.23 కోట్లు.. ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్లు.
– మహిళలు, చిన్నారులు, లైంగిక వేధింపులు, దాడులు, హత్యలు, హత్యాయత్నాలు జరుగుతుంటే ప్రశ్నిస్తే చాలు.. ఇల్లీగల్ డిటెన్షన్లు.
– ఎమ్మెల్యేలు, వారి మనుషులు రెచ్చిపోయి రౌడీల మాదిరి ప్రవర్తిస్తుంటే దాన్ని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్.
– ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారు. రేట్లు రెట్టింపయ్యాయి. ఎవరి జేబుల్లోకి పోతోంది అని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్.
– రేట్లు తగ్గిస్తామని మద్యం మీద, ఒక్క పైసా కూడా తగ్గించకుండా పైపెచ్చు సిండికేట్లుగా ఫాం చేసి ఎమ్మార్పీ రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతుంటే, ప్రశ్నిస్తే కేసులు.
– ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులు, మీ సిండికేట్ వ్యాపారం, కరప్షన్ కోసం సిండికేట్ కు ఎందుకు అప్పగించారని ప్రశ్నిస్తే కేసులు.
– అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు తగ్గిస్తామన్నారు, 5 నెలలు కాక మునుపే ఏకంగా రూ.6 వేల కోట్ల బాదుడు అప్పుడే మొదలు పెట్టారు. మళ్లీ రేపు నెల 11 వేల కోట్లతో అడిషనల్ బాదుడు చేస్తున్నారని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్.
– మీరొస్తే సంపద సృష్టిస్తామన్నారు కదా, ప్రజల కోసం జగన్ సృష్టించిన సంపదను ఎందుకు అమ్మేస్తున్నారు? మీ స్కాముల కోసం ప్రభుత్వ ఆస్తులను, మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు, మూడు ప్రైవేట్ పోర్టులను.. ఒకటి దాదాపు 80 శాతం పోర్టు అయిపోయింది. ఫైనాన్స్ కొరత కూడా లేదు.
– మరి ప్రభుత్వ సంపద ఇవన్నీ వస్తూనే పెరుగుతుంది కదా. ఎందుకు అమ్మేస్తున్నారని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్.
– వీళ్లు రాసిన ఎఫ్ఐఆర్ కాపీలు.. క్రైమ్ ఏంటి అంటే.. విద్యవద్దు, మద్యం ముద్దు ఆ పిల్లాడు రాసిన మాట. సోషల్ మీడియా యాక్టివిస్టు అన్న మాటలు. నిజమే కదా.
– అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన ఇవ్వడం లేదు. నాన్నకు ఫుల్లు, అమ్మకు నిల్లు.. అని అన్నాడు. ఏం తప్పు అన్నాడు? ఇల్లీగల్ డిటెన్షన్.
– శ్రీచంద్రబాబు నాయుడు గారి అభిమానులకు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందట.. ఇదీ కేసు.
– ఇది ఇంకొకటి.. ఇది ఫార్వర్డ్ చేశాడు పోస్టును. ఫార్వార్డ్ చేస్తే కూడా కేసులే. జనసేన నేతతో బలవంతంగా కాళ్లు పట్టించుకున్న టీడీపీ నాయకుడు. అన్ని టీవీల్లో వచ్చింది. ఫార్వర్డ్ చేస్తే కేసు.
– ఇది ఇంకొకటి.. ఈ కేసు ఏందంటే.. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీసీఎం లూటెడ్ 534 కోట్లు పబ్లిక్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ విజయవాడ ఫ్లడ్స్. షాకింగ్ దె లూటెడ్ 23 కోర్స్ జస్ట్ ఫర్ మ్యాచ్ బాక్సెస్. ఇది అందరూ అంటున్న మాటలే. ఇది రాసినందుకు కేసు.
– ఇది ఇంకొక ఎఫ్ఐఆర్.. ఇంకో పిల్లోని మీద. వీళ్లంతా సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంటే పాపం అందరూ యంగ్ స్టర్స్. జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నిస్తున్న స్వరాలు.
– ఇదొక షార్ట్ వీడియో పోస్ట్ చేశాడు.. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామికి తిరుమలలో ఇస్తున్నాడంట. కాస్త సింక్ అయ్యిందట.
– ఇటీజ్ క్లియర్ దట్ గాడ్ డజ్ ఇంట్ లైక్ అని. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు ఆరోపణలు దేవుడికి నచ్చలేదని అన్నాడు. అంతకన్నా ఇంకేమీ అనలేదు పాపం. దీనిపై కేసు.
– మామూలుగా ఇలాంటి కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు. ఈ వారం రోజులుగా విచ్చల విడిగా జరుగుతున్నాయి. 101 మందికిపైగా ఇదే మాదిరి జరుగుతోంది. ఏడేళ్ల లోబడి శిక్ష ఉండే కేసులకు సంబంధించి క్లియర్ కట్ డైరెక్షన్స్.
– సుప్రీంకోర్టు క్లియర్ కట్ డైరెక్షన్స్ ఉన్నాయి. నీ బుద్ధి పుట్టినట్లు అరెస్టులు ఇంటికొచ్చి చేయకూడదు. ఏడేళ్ల లోబడి ఉన్న కేసులకు ఒక ప్రొసీజర్ ఉంది. మ్యాగ్జిమమ్ 41ఏ కింద నోటీసు ఇచ్చి విచారణ చేయాలి అని.
– ఒక వేళ నిజంగా అరెస్టు చేయాల్సిన అవసరమే ఉంటే వారంట్ ఇష్యూ చేయాలి. తర్వాత మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్.
– అమేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ అండ్ ఏఎన్నార్ ఆన్ సెకండ్ జూలై 2014 ఇచ్చిన జడ్జిమెంట్.
– ఏడేళ్ల లోబడి ఉన్న అన్ని కేసులకు సంబంధించిన వివరణ ఇచ్చే జడ్జిమెంట్. (జడ్జిమెంట్ కాపీ ఇంగ్లీష్ లో చదివి వినిపించారు.)
– అంటే అన్ని కేసులూ ఏడేళ్ల లోపు ఉన్న ప్రతి కేసుకూ ఇదీ జడ్జిమెంట్. ఇదీ ప్రొసీజర్.
– కానీ ఈరోజు ఏం జరుగుతోంది? ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తున్నారు. అంటే అరెస్టు చేసే అధికారం నీకు లేదని తెలుసు. 41ఏ నోటీసు మాత్రమే ఇవ్వాలన్న సంగతి నీకు తెలుసు.
– ఒకవేళ అరెస్టు చేయాలంటే వారంట్ ఇష్యూ చేయాలి. మెజిస్ట్రేట్ దగ్గర నీ ఆర్గుమెంట్ చెప్పాలి. మెజిస్ట్రేట్ కన్విన్స్ అయిన తర్వాత గానీ అరెస్టు చేయకూడదు. ఇదీ ప్రొసీజర్.
– కానీ ఈరోజు స్వతంత్రంగా ఎవరైనా గొంతు విప్పితే చాలు. రాత్రికి రాత్రి గానీ, తెల్లవారుజామున గానీ అదుపులోకి తీసుకుంటున్నారు. అదే సమయంలో కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు.
– గంటల తరబడి కొన్ని సమయాల్లో రెండు మూడు రోజులు కూడా పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు.
– ఆ సమయంలో వారిని కొట్టడం, తిట్టడం అవమానించడం చేస్తున్నారు.
– ఒక కేసును ఒక వ్యక్తి మీద ఏక కాలంలో పలు స్టేషన్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతిపరులతో కేసులు నమోదు చేయిస్తున్నారు.
– అరెస్టు చేస్తున్నారు. రెండు మూడు స్టేషన్లు తిప్పుతున్నారు. పోలీసుల తీరుపట్ల అక్కడ స్థానిక ప్రజలు తిరగబడితే మళ్లీ మరో కేసు పెట్టి మళ్లీ అరెస్టు చేస్తున్నారు.
– ఒకవేళ వీళ్లు ఎవరైనా అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులను స్టేషన్లకు తీసుకొస్తున్నారు. ఈ అధికారం ఏ పోలీసుకూ లేదు.
– నేరుగా ముఖ్యమంత్రి, కొడుకు, ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం మాటలు చూస్తుంటే ఆయన కూడా.. డీజీపీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆయన దగ్గరుండి ఈ కార్యక్రమాలు చేయిస్తున్నాడు.
– వీళ్లకు వ్యతిరేకంగా ఉన్న స్వరాల మీద వీళ్లు ఇంతగా కేసులు పెట్టే స్థాయిలోకి, తట్టుకోలేని స్థాయిలోకి వెళ్లిపోతున్నారు. ఏమన్నా అంటే వీళ్లు తప్పుడు రాతలు రాస్తున్నారని చెబుతారు.
– మరి నేను అడుగుతున్నా. తప్పుడు రాతలు రాస్తే మీకు అంత కోపం వస్తే మరి అదే తప్పుడు రాతలు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీద రాస్తున్నారు.
– తప్పుడు రాతలు రాస్తే మీకు కోపం వస్తే.. ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీద అవే తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు..
– టీడీపీ అఫీషియల్ వెబ్ సైట్ లో … రెండేళ్ల కిందట మా అమ్మ కారు బరస్ట్ అయితే.. అది ఈ రోజు కొత్తగా జరిగినట్లు.. అఫీషియల్ వెబ్ సైట్ లో పెట్టి.. తల్లిని చంపడానికి జగన్ ప్రయత్నం చేసినాడని సిగ్గు లేకుండా రాశారు. ఇది ఫేక్ న్యూస్ కాదా.. ? విజయమ్మే వచ్చి స్టేట్ మెంట్ ఇచ్చింది కదా..
– విజయమ్మ లెటరే ఫేక్ అని టీడీపీ వెబ్ సైట్ లో మరో పోస్టింగ్.. చివరికి వీరి ఫేక్ స్టేట్ మెంట్లు ఎక్కువై విజయమ్మ టీవీలోకి వచ్చి కూడా చెప్పుకోవాల్సి వచ్చింది.
– నేను అడుగుతున్నా.. టీడీపీ ఇంత దారుణంగా ఫేక్ న్యూస్ లు పోస్టు చేస్తుంటే.. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయడం లేదు? ఇదే డీజీపీని అడుగుతున్నా.. లోకేష్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదు?
– ఎంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారంటే.. ఒక కేసు కాదు… రెండు కేసులు కాదు.. ప్రతి విషయంలోనూ.. వీరి అఫీషియల్ మీడియా,.. ఎల్లో మీడియా అలాంటిదే..వీరి సోషల్ మీడియా అలాంటిదే..
– ఈ రోజు ఆంధ్రజ్యోతిలో రాశాడు.. కడప ఎస్పీకి నా భార్య ఫోన్ చేసిందని.. అది ఫేక్ న్యూసే కదా? మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను తీసుకువచ్చి బొక్కలో వేస్తున్నారా?
– అయ్యా డీజీపీ గారు.. అయ్యా పోలీసులు.. మూడు సింహాలు మీ టోపీల మీద ఉన్నాయి.. వాటికి సెల్యూట్ కొట్టండి.. ఈ రకంగా అమ్ముడిపోయి.. ఈ మాదిరిగా ప్రజాస్వామ్యంలో ఉంటూ.. ప్రజా స్వామ్యాన్ని అవహేళన చేయడం పోలీసులుగా.. మీ వృత్తిని రెండిటినీ కించపరిచినట్లవుతుంది.
– ఇదే పోలీసులకు చెబుతున్నా… మీరు చేస్తున్న అగత్యాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. కొన్ని కొన్ని ఉదాహరణలు చెబుతున్నా… మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోమని అడుగుతున్నా.. ప్రతి పోలీసాఫీసర్ ను… ఎల్ల కాలం వీరి ప్రభుత్వం ఉండదు. మీరు చేసే పనుల వల్ల పోలీసుల పేరు, రిప్యూటేషన్ పణంగా పెడుతున్నారు.
– మీరు ఇల్లీగల్ అరెస్టు లు చేస్తా ఉన్నారు. చంద్రబాబు ఆదేశాలపై పోలీసులు చేసిన ఆకృత్యాలు ఎంత దారుణంగా ఉన్నాయో కొన్ని ఉదాహరణలు చెబుతున్నా..
– గాజువాకకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్.. బోడి వెంకటేష్ ను దువ్వాడ పోలీసులు నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో తల్లిదండ్రులకు చెప్పలేదు.. 41 ఎ నోటీసులు సైతం ఇవ్వలేదు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు ఉల్లంఘన కాదా?
– తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్, ఒక రైతు ఆళ్ల జగదీష్ రెడ్డిని.. 2018 లో పెట్టిన పోస్టింగ్ కు సంబంధించి విజయవాడ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా తీసుకువెళ్లారు. పోలీసులను వెళ్లి అడిగితే.. తాము తీసుకువెళ్లలేదని చెప్పారు. తీరా జగదీష్ రెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు తీస్తే…పోలీసులే తీసుకువెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తా ఉంది.
– చిలకలూరిపేటకు చెందిన పెద్దింటి సుధారాణి..అమ్మాయి.. ఎన్నికల తర్వాత అక్కడ అరాచకాలు భరించలేక కుటుంబంతో సహా హైదరాబాద్ కు వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని హైదరాబాద్ నుంచి పోలీసులు ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చారు. పోలీసు స్టేషన్లు అన్నీ తిప్పుతున్నారు. పిల్లలకు తల్లిని దూరం చేశారు. నిన్న చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆమెను ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు.
– తాడేపల్లిలో అయ్యప్ప మాలలో ఉన్న నాని అనే యాక్టివిస్ట్ ను.. మొదట వినుకొండ అని చెప్పి తర్వాత మార్కాపురం తీసుకువెళ్లారు.
– నందిగామ నియోజకవర్గం పెండ్యాలలో వాట్సప్ గ్రూప్ అడ్మిన్ ను అరెస్టు చేసి కొట్టారు.. ఆ గ్రూప్ లో ఉన్న వారికి నోటీసులు ఇచ్చారు. వారంతా ఒకే గ్రామానికి చెందినవారు.
– గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన వెంకట్రామిరెడ్డి హైదరాబాద్ లో ఉంటారు. తన బావగారి ఇంటికి మాచర్ల వచ్చాడు. వెంకట్రామిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో అతని బావను అదుపులోకి తీసుకున్నారు. విధి నిర్వహణలో పోలీసులకు ఆటంకం కలిగించారని తప్పుడు కేసు పెట్టారు.
– సన్నీ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ను తిరువూరు పోలీసులు ఉదయం తీసుకువెళ్లి కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. 36 గంటలపాటు భోజనం కూడా పెట్టలేదు. గ్రామంలోని పెద్దలు వెళితే విడుదల చేశామని చెప్పి.. మళ్లీ గంపలగూడెం పోలీసు స్టేషన్ లో పెట్టారు.
– మహానంది మండలంలో యు.. గొల్లవరం గ్రామానికి చెందిన తిరుమల కృష్ణను కర్నూలు పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేసి తీసుకువెళ్లారు. దివ్యాంగుడని తెలిసి కూడా నానా ఇబ్బందులు పెట్టారు.
– రాయచోటిలో కె. హనుమంతరెడ్డిని రెండు రోజుల క్రితం పోలీసులు తీసుకువెళ్లారు.. ఇంతవరకు అరెస్టు చూపలేదు. ఎక్కడున్నాడో కూడా తెలియదు.
– తెలంగాణ లో ఉన్నవారిని కూడా తీసుకువచ్చి వేధింపులకు గురి చేస్తున్నారు.
– నల్గొండకు చెందిన అశోక్ రెడ్డిని విజయవాడ సైబర్ క్రైం పోలీసులు తీసుకువచ్చారు.. కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు.
– రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ని కూడా హైదరాబాద్ నుంచి తీసుకువచ్చారు. ఇప్పుడు ఇద్దరినీ వేధిస్తున్నారు.. మొత్తం 101 మందిపై కేసులు పెట్టారు. చట్టప్రకారం ఎఫ్ ఐ ఆర్ లను ఆన్ లైన్ లో పెట్టడం లేదు. కోర్టులకు అప్ లోడ్ చేయడం లేదు. దేశంలో ఇంత అరాచక వ్యవస్థ ఎక్కైడైనా ఉంటుందా? ఉందా?
– దారణమైన పరిస్థితులు ఉంటే.. డీజీపీ చట్టం వైపు, న్యాయం వైపు నిలబడాలి. ఇదే పోలీసు అధికారులకు నిజంగా చెబుతున్నా.. ఇప్పుడున్న డీజీపీకి.. మా హయాంలో ఆర్టీసీ సీఎండీ స్థానంలో పనిచేశాడు. మంచి పదవి ఇచ్చి బాగా చూసుకున్నాం.. ఈ రోజు ఏ స్థాయికి దిగిజారిపోయాడంటే.. పదవి కోసం.. పదవీ వ్యామోహంతో..ఐదు నెలలుగా పాలన గాడి తప్పి.. రెడ్ బుక్ పాలనలో వీరంతా నిమగ్నమై.. లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తుంటే..ఇదే డీజీపీ అధికార పార్టీ కార్యకర్తలా మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వంలో పోలీసులు సరిగా పనిచేయలేదని చెబుతున్నాడు.. మరి ఆయన కూడా ఆ ప్రభుత్వంలో పనిచేశాడు కదా?
– మరి ఇప్పటి ప్రభుత్వం సవ్యంగా, బ్రహ్మాండంగా పనిచేస్తా ఉందా?
– ఈయన డీజీపీగా ఉన్న ప్రభుత్వం సవ్యంగా పనిచేస్తే.. ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతున్నాయి.? ఎందుకు వైయస్సార్ సీపీ నేతలపై దాడులు ఇంతగా జరుగుతున్నాయి..? ఎందుకు దొంగ కేసులు పెడుతున్నారు. ? ఐదు నెలలు తిరగక ముందే 91 మంది అక్క చెల్లెమ్మల మీద ఎందుకు అత్యాచారాలు జరిగాయి? ఎందుకు ఏడుగురు ఆడవాళ్లు చనిపోయారు?
– చివరికి ప్రజల తరపున గొంతు విప్పుతున్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ లను ఎందుకు అక్రమ నిర్భంధాలు చేస్తున్నారు.?
– మీ ఇష్టానుసారంగా..ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే.. ఎల్ల కాలం ఇదే ప్రభుత్వం ఉండదు.. మళ్లీ మళ్లీ చెబుతున్నా.. ప్రతిపోలీసు అధికారికి చెబుతున్నా… న్యాయాన్ని గౌరవించండి.. ధర్మాన్ని కాపాడండి.. అంతేగానీ వన్ సైడెడ్ గా.. ఇల్లీగల్ గా.. తప్పు చేస్తున్నామని తెలిసి కూడా తప్పు చేస్తే మేము చూస్తూ ఊరుకోము.. ప్రతి పోలీసు ఆపీసర్ పై ప్రైవేటు కంప్టైంట్స్ లాంచ్ చేస్తాము.. ప్రతి బాధితుడు ప్రైవేటు కంప్లైంట్ చేస్తాడు.. వారి తరుపున వైయస్సార్ సీపీ న్యాయ సహాయం కూడా చేస్తుంది.
– ఎల్లకాలం వీరి ప్రభుత్వం ఉండదు… జమిలీ,గిమిలీ అంటున్నారు… అధికారం కూడా తొందరగా పోవచ్చు. అయినా గానీ నాలుగేళ్లే ఉంది. తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ను దగ్గరుండి బయటికీ తీస్తాం..
– రిటైర్డ్ అయ్యి వెళ్లిపోతామనుకుంటున్నారేమో.. వెళ్లిపోయినా పిలిపిస్తాం. లేకపోతే.. తెలంగాణ నుంచి చంద్రబాబు డిప్యూటేషన్ మీద సుబ్బారాయుడును తిరుపతికి తెచ్చుకున్నాడు… మళ్లీ తెలంగాణ వెళ్లిపోతా అనుకుంటున్నాడేమో..మళ్లీ తెలంగాణ నుంచి పిలిపిస్తాం.. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పిలిపిస్తాం.. .. .ప్రతి పోలీసు ఆఫీసర్ కు చెబుతున్నా…తప్పులు చేసినవారిని చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. చేసినవన్నీ బయటికీ తీస్తాం.. కోర్టు ఆర్డర్లను అధిగమించి చేసినవన్నీ చూస్తూ ఊరుకోము.. రెడ్ బుక్ పెట్టుకోవడం గొప్ప కాదు.. ఈ రోజు నష్టపోయిన బాధిత కుటుంబాలన్నీ రెడ్ బుక్ పెట్టుకుంటాయి.. వాళ్లు నాదగ్గర కొచ్చి గ్రీవెన్స్ చెబుతారు. అప్పుడు నేసు చూస్తూ ఊరుకోను..
– పోలీసులంటే గౌరవం ఉండాలి. వ్యవస్థ అంటే బతకాలి. ఈ రోజు వారుండొచ్చు. రేపు మనం ఉండొచ్చు.. కానీ వ్యవస్థ మీద గౌరవం ఉండాలి. వ్యవస్థ నీరు కారిపోకూడదు.. ఈ రోజు రాజకీయ నాయకులు చెబుతున్నారని.. తెలిసీ తప్పు చేస్తే.. ప్రతి బాధితుడి ఉసురు మీకు తగులుతుంది.
– సాక్షాత్తూ డిప్యూటీ సీఎం అనే వ్యక్తి లా అండ్ ఆర్డర్ ఈ స్థాయిలో దిగజారిపోయిందని నోరు మెదిపాడు అంటే.. ఆశ్చర్యం కలిగించే ఘటన.
– మాట్లాడతాడు కానీ ఒక దళిత హోం మినిస్టర్ మీదకు మాత్రమే ఆపేస్తాడు. అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఎవరి సబ్జెక్ట్? ముఖ్యమంత్రి సబ్జెక్ట్ కాదా? ప్రశ్నించాల్సింది ఎవరిని? చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేదు. పాపం ఈమె అయితే దళితురాలు, అమ్మాయి, ఏమన్నా పడుతుందని అనడం. ఎక్కడ న్యాయం?
– పిఠాపురం సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కౌన్సిలర్ భర్త ఒక దళిత మహిళను ఆటోలో తీసుకెళ్లి డంప్ యార్డులో అత్యాచారం చేస్తే నువ్వు డిప్యూటీ సీఎంగా ఉండి ఏం చేశావు?
– చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేదు. వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం అంతకన్నా లేదు. తోలు తీస్తా అని సినిమా డైలాగులు మాత్రం కొడతాడు.
– పోలీసులు వ్యవహరిస్తున్న తీరును న్యాయం, ధర్మం అనే పిల్లర్స్ మధ్య పోలీసులు వ్యవహరించాలి.
– దురదృష్టవశాత్తు కొంత మంది పోలీసులు బాగా పని చేస్తుంటే చంద్రబాబు నాయుడు చెబుతున్న అన్యాయాలకు, అక్రమాలకు తలొగ్గకపోతే వాళ్లు బాగా చేయడం లేదని బ్రాండింగ్ చేస్తారు.
– ఇల్లీగల్ డిటెన్సన్లు పెట్టే కార్యక్రమం చేస్తే మాత్రం పోలీసులు బాగా పని చేస్తున్నారని కితాబిచ్చుకుంటారు. నిజంగా న్యాయం, ధర్మం వైపు ఉండాలి.
– డిప్యూటీ సీఎంగా ఆయన సరస్వతి భూముల వద్దకు వెళ్లి మాట్లాడాడు కదా అని చర్చకు వచ్చింది.
– పవన్ కల్యాణ్ అనే వ్యక్తి నవంబర్ 5న అక్కడికి వెళ్లాడు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరు అది. సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం కోసం భూములు అక్కడ అక్వైర్ చేయడం జరిగింది. కంపెనీ పేరు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్. (Jagan press meet)
– ఈయన ఆదేశాల మేరకు, ఈయన ఆధ్వర్యంలో పని చేస్తున్న అక్టోబర్ 26వ తేదీన లోకల్ ఎమ్మార్వో అదే సరస్వతి వెబ్ సైటుకు వెళ్లి భూములన్నీ పరిశీలించి ఆవిడ అన్న మాటలు ఒకసారి విందామా. (ఎమ్మార్వో బైట్ వినిపించారు)
– ఎమ్మార్వో వెయ్యి చిల్లర ఎకరాలకు సంబంధించిన కథ చెప్పింది. మొత్తం పట్టా భూమి అని ఆవిడే చెప్పింది.
– ఎక్కడా వంకలు, వాగులు లేవని చెప్పింది. గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అంటే 4 ఎకరాలు అని ఆవిడే చెప్పింది. అంటే వెయ్యి చిల్లర ఎకరాల్లో కేవలం 4 ఎకరాలు అది కూడా తీసుకోలేదని కూడా ఆవిడే చెబుతోంది. (Jagan press meet)
– అందులో రెండెకరాలు చిల్లర హిల్లాక్స్ అంటే కొండలు. ఒక ఎకరా చిల్లర డాటెడ్ ల్యాండ్స్. దీనికి పవన్ కల్యాణ్ అనే వ్యక్తి అక్కడికి పోవడం, ఏమోమో జరుగుతోందని మాట్లాడటం. ఆశ్చర్యం కలిగిస్తోంది.
– పక్కనే భవ్య సిమెంట్స్ వాళ్లు ఎకరా రూ.50 వేలకు కొన్నారు. రూ.50-90 వేల లోపు కొన్నారు. వాళ్లకు పక్కనే మనది. ఓ సంవత్సరం తర్వాత ఎకరం ఎంతకు కొన్నామో తెలుసా? రూ.3 లక్షలకు తక్కువ కొనలేదు.
– గ్రామ సభ పెట్టి, రైతులు సంతోషంగా ఉండటం కోసం ఎంతరేటు కావాలో వాళ్లనే అడగండి అన్నాం. రూ.2.70 లక్షలు ఇస్తే బాగుంటుందని అక్కడి నుంచి వచ్చింది. మా వాళ్లు నా దగ్గరకు వచ్చి చెబితే నేను అన్నాను. రూ.3 లక్షలు ఇచ్చి ఇంకా సంతోష పెట్టండి అని చెప్పాను.
– ఈ మనిషి అంటాడు మళ్లీ.. నీళ్లు అంట. అదే ఎమ్మార్వోది వచ్చింది. ఓ సారి ప్లే చేద్దాం. (వీడియో ప్లే చేశారు.) (Jagan press meet)
– నేను ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నప్పుడు నిజంగా నేను చెడ్డోడిని అయితే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నవి చాలా ఉన్నాయి. రూపాయి డబ్బు పెట్టాల్సిన పని లేదు.
– ఆ పక్కన తాడిపత్రిలో దివాకర్ రెడ్డి మీద ఎన్నెన్నో ఆరోపణలు వచ్చాయి. గవర్నమెంట్ ల్యాండు వాళ్ల డ్రైవర్ పేరుతో, పీఏ పేరుతో అలాట్ మెంట్ చేయించుకున్నాడు అని. ఎందుకంటే ఉద్దరగా వచ్చే ల్యాండ్ అని చెప్పి.
– నేను ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఉద్దరగా ఫ్రీగా తీసుకొనే కార్యక్రమం చేయొచ్చు. ఒక్క ఎకరా గవర్నమెంట్ ల్యాండ్ లేదు. అంతా ప్రైవేట్ ల్యాండ్.
– రైతుల్ని సంతోష పెడుతూ ఏం రేటుకావాలో వాళ్లనే అడిగి అడిగిన రేటు కంటే ఎక్కువే ఇచ్చి కొన్నాం. అదీ జగన్ మోహన్ రెడ్డి అంటే.
– ఇదే పవన్ కల్యాణ్ అనే వ్యక్తి నీళ్లు అంటాడు. అవునయ్యా సిమెంటు ఫ్యాక్టరీ పెడితే నీళ్లు ఇవ్వరా? ప్రభుత్వం డ్యూటీ కాదా? అది. కాలనీ కడతారు. పని చేసే వాళ్లు అక్కడే కాపురం పెడతారు. తాగేదానికి నీళ్లు ఇవ్వరా?
– సిమెంట్ ఫ్యాక్టరీ నీళ్లు తాగదు. ఇంకా స్టీల్ ఫ్యాక్టరీలు నీళ్లు తాగుతాయి. కాలనీలో ఉన్న వాళ్లకు, ఇతర అవసరాలకు మాత్రమే నీళ్లు వాడతారు. ప్రభుత్వ డ్యూటీ అది. వాళ్లకు కరెంటు ఇవ్వడం, నీళ్లు ఇవ్వడం.
– నీళ్లు ఇచ్చిన దానికి కూడా పెద్ద తప్పు చేసినట్లుగా చెబుతాడు. (Jagan press meet)
– ఇంకోటి అంటాడు.. మైనింగ్ లీజు 50 ఏళ్లకు తీసుకున్నాడంటాడు. నువ్వు ఎట్టా మంత్రివి అయ్యావో నాకు తెలియదు. నీకు తెలివి ఉందా లేదా అంతకన్నా తెలియదు.
– నువ్వు పొల్యూషన్ అండ్ ఎన్వైన్ మెంట్ కు నువ్వు మంత్రివి. ఎంఎండీఆర్ యాక్ట్ 2015లో అమెన్డ్ మెంట్.. ఏం చెబుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినది.
– యాక్ట్ ఏం చెబుతుంది? డీమ్డ్ 50 ఇయర్స్ అది అందరికీ. ఎవడికైనా. (చట్టం వివరాలు చదివి వినిపించారు.)
– ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, బుర్ర పని చేస్తోందా? పని చేయడం లేదా? నాకైతే అర్థం కావడం లేదు.
– 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మైనింగ్ లీజును క్యాన్సిల్ చేస్తే కోర్టుకు పోయాను. 2015లో నాకు కోర్టు స్టే ఇచ్చింది.
– 2019లో కోర్టు నాకు జడ్జిమెంట్ అనుకూలంగా ఇచ్చింది. చంద్రబాబు చేసినది తప్పు.. ఇవన్నీ రీస్టోర్ చేయాలని.
– అసలు పరిశ్రమలు రావాలని ఎవడైనా తాపత్రయపడాలి. కానీ వీళ్లేం చేస్తున్నారు. పరిశ్రమలు రాకూడదని వీళ్లు అడుగులు వేస్తున్నారు. అక్కడేమో కడపలో సజ్జన్ జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకొచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేశాడు. (Jagan press meet)
– ఆయనను ప్రోత్సహించాలని జత్వానీనో గిత్వానీనో ఆడనుంచి తీసుకొచ్చారు. ఆమెతో దొంగ కేసులు పెట్టించారు. ఆమె హ్యాబిట్యువల్ అఫెండర్. ఈయన్ను బెదరగొట్టించి రాకుండా చేస్తున్నారు.
– మరోవైపున ఆర్సిలర్ మిట్టల్ అనకాపల్లికి వచ్చిందని తప్పుడు వార్తలు. అక్కడేమో ఒడిశా మంత్రి చంద్రబాబును, లోకేష్ ను తిడుతూ ఆయన అక్కడి నుంచి స్టేట్ మెంట్. మా ఒడిశాలోనే ఉంది. పనులు మొదలు పెట్టారు. 24 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ ప్లాంటు కడుతున్నారు. లక్షా 4 వేల కోట్ల పెట్టుబడులతో కడుతున్నారని స్టేట్మెంట్లు.
– ఎవడైనా ఎన్ని లక్షల కోట్లు పెట్టగలుగుతాడు? ఒడిశాలో గ్రీన్ ఫీల్డ్ ప్లాంటు కడుతున్నాడు. ఇప్పుడే స్టార్ట్ అవుతోంది. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు. ఆడ కడతారా? అక్కడి నుంచి ఆపేసి ఇక్కడికొస్తాడా? ఇక్కడ రూ.1.61 లక్షల కోట్లట మళ్లా. చెప్పడానికి, వక్రీకరణకు అర్థం ఉండాలి.
– మైక్రోసాఫ్ట్ వచ్చింది, బిల్ గేట్స్ కు నేనే కంప్యూటర్ నేర్పించేసినా, మైక్రోసాఫ్ట్ వచ్చింది, బుల్లెట్ ట్రైన్ వచ్చేసింది, ఒలింపిక్స్ నేనే నిర్వహిస్తున్నా… ఇవేం మాటలు.
– ఒకపక్క జిందాల్ వాళ్లు ఫౌండేషన్ స్టోన్ వేశాడు కడపలో. నువ్వు ప్రోత్సహిస్తే చాలు కంప్లీట్ చేస్తాడు. వాళ్లను బెదరగొడుతున్నావ్. (Jagan press meet)
– సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ ఎందుకు కట్టలేకపోయాను. కారణం మీరే కదా. మీ వల్లే కదా ఈడీ అటాచ్ మెంట్లు. నా కేసులు పిటిషనర్లు ఎవరు? తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ వాళ్లు కాదా? అది ముందుకు పోకుండా ఉండేందుకు కారణం వీళ్లు కాదా?
– పైగా దాని మీద లేనిపోని వక్రీకరణలు, అబద్ధాలు. ఎవడైనా ప్రమోట్ చేయాలి, ఇండస్ట్రీ రావాలి, నాలుగు ఉద్యోగాలు వస్తాయి . ప్రాంతం బాగుపడుతుంది.
– ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వస్తుందని ఆలోచన చేయాల్సింది పోయి తన వాడైతే ప్రమోషన్, తనకు అంతో ఇంతో వస్తుందంటే ప్రమోషన్. తన వాడు కాకపోతే ఆపేసేయాలి. రాకుండా చేయాలి. అక్కడి నుంచి ఏదీ రాదు అనుకుంటే అసలు రాకూడదు.
– అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మీరే చెప్పండి. మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే స్పీకర్ ను అడిగాం. అసెంబ్లీలో ఉండేవి రెండే రెండు కూటములు. ఒకటి అధికార కూటమి. రెండోది మేము ప్రతిపక్షం. మేము కాకుండా ఎవరైనా ప్రతిపక్షం ఉన్నారా అసెంబ్లీలో.
– మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలా? లేదా? మిగతాదంతా అధికార పార్టీనే.
– గుర్తించినప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలైనా ఉండనీ నాయకుడు ఉంటాడు కదా. ఆ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు అనే కదా అనాల్సింది. ఆ ప్రతిపక్ష పార్టీకి 40 శాతం ఓటు షేర్ వచ్చింది వాస్తవం కదా.
– ఆ పార్టీని గుర్తించను అంటే దాని అర్థం ఏమిటి? ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే నువ్వు మైకు ఇస్తావు. లీడర్ ఆఫ్ ది హౌస్ కు మైకు మీద ఏ రకమైన కమాండ్ ఉంటుందో.. అదే మాదిరిగానే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కు మైకు ఇవ్వాలి. అదే స్థాయిలో. ఆ మాదిరిగా ఇవ్వగలిగితేనే ప్రజల సమస్యలు సుదీర్ఘంగా చెప్పగలుగుతారు. (Jagan press meet)
– ప్రభుత్వం నుంచి స్పందన రాబట్టగలుగుతారు. కానీ వీళ్లేం చేస్తున్నారు? మైకు ఇవ్వకూడదు. ప్రజల సమస్యలు ప్రస్తావనకు రాకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీ ఉందని యాక్సెప్ట్ చేయదల్చుకోలేదు.
– యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష నాయకుడికి మైకు ఇవ్వాలి. నిన్ను ఎండగడతాడు. ప్రశ్నిస్తాడు. సమయం ఇవ్వాల్సి వస్తుంది. అందుకు నువ్వు ఏం చేస్తున్నావు. ప్రతిపక్ష పార్టీని, నాయకుడిని అక్నాలెడ్జ్ చేయడం లేదు.
– దాని వల్ల మైకు అనేది నీకు ఇవ్వరు. 175 మందిలో నీకు మైకు 2 నిమిషాలు ఇస్తాం. చెప్పాల్సింది చెప్పు అనే మైండ్ సెట్ ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి పోయి లాభం ఏముంది?
– అసెంబ్లీ జరిగేటప్పుడే ప్రతిరోజూ ప్రతిపక్షంలో ఉంటే ఏ మాదిరిగా, ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అంతే సమయంలో అదే హక్కును ఉపయోగించుకుంటూ మీడియా సమక్షంలో ప్రతిరోజూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. (Jagan press meet)
– ప్రతిరోజూ మీకు ముందే సమయం చెబుతాం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే టీవీ చానళ్లకు రిక్వెస్ట్ చేస్తాం. మాకు సమయం ఇవ్వండి, అసెంబ్లీ సమావేశాల కింద భావించి ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్నలు ఇవీ అని గట్టిగా మీరు ప్రొజెక్ట్ చేయండి.
– అటువైపు నుంచి ప్రభుత్వం స్పందింస్తుందేమో, చెబుతుందేమో ప్రజలకు సమాధానం, దాని వల్ల ప్రజలకు మేలు కలుగుతుందేమోనని ఆశిద్దాం.
– ప్రతిరోజూ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా ప్రశ్నలు వేస్తాం. ప్రతి మూడోరోజు అసెంబ్లీలో నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించే పాత్ర ఉంటే ఎలా ఉంటుందో ప్రతి రోజూ మీడియా ద్వారా ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ.. ఇవీ ప్రజలకు సంబంధించిన సమస్యలు.. నీ చేతనైతే సమాధానం చెప్పు అని చంద్రబాబు నాయుడును మీడియా ద్వారా మీ అందరి సమక్షంలో మీరే నా స్పీకర్లుగా ప్రజల తరఫున క్వశన్లు అడుగుతాం. (Jagan press meet)
– సభ్యులుగా నిరసన తెలిపేదానికి ఎవరినైనా అనుమతిస్తున్నారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా? ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏం చేద్దామని మా పార్టీ సీనియర్ నాయకులు కొంత మందితో మీటింగ్ అయితే, మా అందరి అభిప్రాయం అదే.
– ప్రజాస్వామ్యం బతికుందా? ఎలక్షన్లు జరుపుతారా? 3 లక్షల మంది ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే పరిస్థితి ఉంటుందా? ఓటు వేయనిస్తారా? ఓటేసే పరిస్థితి ఉంటుందా? మా కార్యకర్తలను చేయనిస్తారా?
– వాళ్ల మీద దొంగ కేసులు పెట్టి వేధిస్తారు కదా. అని బాయ్ కాట్ చేద్దామని నిర్ణయించుకున్నాం.
– కార్యకర్తలు అనే వాళ్లను ఎందుకు ఇబ్బందులపాలు చేయాలి. ప్రజాస్వామ్యం బతకనప్పుడు కొద్ది రోజులు టైం ఇచ్చే కార్యక్రమాలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత అన్నది ఇబ్బడిముబ్బడిగా పుట్టి ప్రభుత్వాన్ని తెరమరుగు పరిచే పరిస్థితులు వస్తాయి.
– పోలీసుల ద్వారా ప్రభుత్వం ఇబ్బంది పెడితే అందరికీ కూడా ప్రయివేటు కంప్లయింట్లు వేయించడానికి, మీ తరఫున పోరాటం చేయడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది అని ఇదే మీడియా సమక్షంలో మీ అందరికీ భరోసా ఇస్తూ చెబుతున్నా.
– ఇవి టెలిఫోన్ నంబర్లు, ఇవి నోట్ చేసుకోండి. ఎవరికి ఏ సమస్య వచ్చినా సోషల్ మీడియా పరంగా, ఇల్లీగల్ డిటెన్షన్ పరంగా ఈ నంబర్లు మా అడిషనల్ అడ్వొకేట్ జనరల్స్ సుధాకర్ అన్న అందుబాటులో ఉండి మీ తరఫున కేసులు పోరాటం చేస్తాడు కోర్టుల్లో.
– పూర్తిగా ప్రయివేటు కంప్లయింట్లు వేసే కార్యక్రమంలో మీ తరఫున వ్యాజ్యాలు వేసి తోడుగా ఉంటాడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది. ఈ టెలిఫోన్ నంబర్లు అందరూ నోట్ చేసుకోండి.
– ఈ పోలీసుల వల్ల, ప్రభుత్వం వల్ల గానీ ఎటువంటి అన్యాయం జరిగినా ఈ నంబర్లకు దయచేసి ఫోన్ చేయండి. పూర్తిగా వైయస్సార్ సీపీ తోడుగా ఉంటుంది.
– వైయస్సార్ సీపీ వీ స్టాండ్ ఫర్ ట్రూత్. వీ ఆర్ విత్ వైయస్సార్ సీపీ సోషల్ మీడియా. ఈ హ్యాష్ ట్యాగ్ లో ఈ నంబర్లు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ అందుబాటులో ఉంటాయి.
ఇవీ చదవండి: Jagan and Sharmila: కుటుంబ తగాదాలు రాజకీయం చేయొద్దు
YS Jagan Clarity: ఫ్యామిలీ ఆస్తుల గొడవపై స్పష్టత ఇచ్చిన జగన్!
Jagan in Gurla: ఘర్ ఘర్ కీ కహానీలే.. ఆస్తుల వివాదంపై జగన్ హాట్ కామెంట్స్!
YS Jagan bail: జగన్ బెయిల్ రద్దు ప్రమాదం!
