Ayyappa : తెలంగాణ పోలీస్ శాఖ మతపరమైన దీక్షలు, ఆచారాల విషయంలో కొత్త ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ సిబ్బంది డ్యూటీలో ఉన్న సమయంలో అయ్యప్ప మాల ధరించడం, బ్లాక్ డ్రెస్ వేసుకోవడం, గడ్డం–జుట్టు పెంచుకోవడం వంటి మతపరమైన చిహ్నాలు ప్రదర్శించరాదని స్పష్టం చేసింది.
అలాంటి దీక్షలు చేపట్టాలనుకునే వారు తప్పనిసరిగా సెలవు తీసుకుని కొనసాగించాలని సూచించింది. సెలవు లేకుండా మతాచారాలు పాటిస్తే శాసన చర్యలు తప్పవని హెచ్చరించింది.
పోలీసులు విధుల్లో ఉంటే ప్రిస్క్రైబ్డ్ యూనిఫాం, షూస్ తప్పనిసరి అని శాఖ స్పష్టంచేసింది. ఇటీవల ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక ఎస్.ఐ.కి మెమో జారీ చేసిన విషయం తెలిసింది.
రాజా సింగ్ విమర్శలు
ఈ ఆదేశాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఈ రూల్స్ హిందువులమీదే మాత్రమేనా? రంజాన్ సమయంలో ముస్లింలు ఉపవాసం చేస్తారు, గడ్డం పెంచుకుంటారు… అప్పుడు ఎందుకు ఇలాంటి ఆదేశాలు లేకపోతాయి?” అంటూ ప్రశ్నించారు.
వీహెచ్‌పీతో సహా అనేక హిందూ సంఘాలు కూడా ఇది మత స్వేచ్ఛను హరించడం అని విమర్శిస్తున్నాయి.
“అన్ని మతాల వారికి ఒకే రూల్స్ అమలు చేస్తారా? లేక ప్రాక్టికల్‌గా వివక్ష చూపుతున్నారా?” అని హిందూ సంఘాలు నిలదీస్తున్నాయి.
పోలీస్ శాఖ వాదన
పోలీస్ ఫోర్స్ ఒక డిసిప్లిన్డ్ సర్వీస్ కనుక యూనిఫాం, ప్రవర్తన, మతపరమైన గుర్తింపుల ప్రదర్శనపై కఠిన నిబంధనలు ఉండటం సహజం.
ప్రభుత్వం స్పష్టంచేస్తోంది:
ఈ నిబంధనలు ఏ ఒక్క మతానికి కాదు, అన్ని మతాలకు సమానంగా వర్తిస్తాయి
హిందూ, ముస్లిం, క్రైస్తవులు సహా ఎవరైనా డ్యూటీలో మతపరమైన ఆచారాలు పాటించరాదు
దీక్షలు, గడ్డం పెంచుకోవడం, ప్రత్యేక దుస్తులు ధరించడం వంటి ఆచారాలు సెలవులో ఉన్నప్పుడే అనుమతిస్తారు
నిబంధనలు అందరికీ ఒకేలా అమలవుతున్నాయని పోలీస్ శాఖ చెబుతున్నప్పటికీ, అసలు ప్రాక్టీస్‌లో అదే స్థాయి సమానత్వం ఉందా అనే దానిపై వివాదం కొనసాగుతోంది.
ఇవీ చదవండి: Ayyappa swamy: తిరుమల ఘటన తర్వాత కేరళ అటవీ శాఖ హై అలర్ట్.. అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక యాప్
Lord Shiva: మహాశివుడి 19 అవతారాలు తెలుసా? వాటి ప్రాముఖ్యం తప్పక తెలుసుకోండి!
