HomeAstrologyLord Shiva: మహాశివుడి 19 అవతారాలు తెలుసా? వాటి ప్రాముఖ్యం తప్పక తెలుసుకోండి!

Lord Shiva: మహాశివుడి 19 అవతారాలు తెలుసా? వాటి ప్రాముఖ్యం తప్పక తెలుసుకోండి!

Lord Shiva: సృష్టి స్థితి లయకారుడు పరమేశ్వరుడు. ఏటా మహాశివరాత్రి సందర్భంగా శివుడికి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అంతేకాదు.. ప్రతి సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనది. శివానుగ్రహం కోసం భక్తులు పూజలు, అభిషేకాలు జరుపుతారు. శివుడంటే చెడును నాశనం చేసేవాడు, సృష్టిని నడిపించేవాడని భక్తుల నమ్మకం.

హిందూ పురాణాల ప్రకారం, విశ్వాన్ని రక్షించడానికి, విశ్వ సమతుల్యతను కాపాడటానికి శివుడు 19 అవతారాలు ఎత్తాడని ప్రతీతి. ఈ అవతారాలు ఆయన దైవత్వంలోని విభిన్న అంశాలను తెలుపుతాయి. ఇవి హిందూ పురాణాలు, తత్వశాస్త్రంలో ప్రధాన భూమిక పోషిస్తాయి. పరమశివుడి 19 అవతారాలను ఈ కథనంలో క్లుప్తంగా తెలుసుకుందాం.

1. అర్ధనారీశ్వరుడు
అర్ధనారీశ్వర శివుడు. అతని భార్య పార్వతి రూపంగా దర్శనమిచ్చింది. ఈ రూపం స్త్రీ పురుష శక్తుల సామరస్యాన్ని తెలియజేస్తుంది. అర్ధనారీశ్వరుడు విశ్వం సమతుల్యత, ఐక్యతకు ప్రతీకగా చరిత్ర చెబుతోంది.

2. కిరాతమూర్తి
కిరాతమూర్తి అవతారం త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు శివుడు వేటగాడిగా మారినది. ఇది ధర్మానికి రక్షకుడిగా శివుని పాత్రను తెలియజేస్తుంది.

3. భైరవుడు
భైరవ అవతారం అనేది శివుడి భయంకరమైన ప్రతిరూపంగా చెబుతారు. ఇది విధ్వంసం, వినాశనానికి చెందినది. భైరవుడి వాహనం కుక్క, దుష్ట శక్తుల నుంచి రక్షణ పొందేందుకు భైరవుడిని పూజిస్తారు.

4. అశ్వత్థామ
ద్రోణాచార్యుడి తనయుడైన అశ్వత్థామను శివుడి అమర అవతారంగా చెబుతారు. ఇతడు యుద్ధ నైపుణ్యాల్లో ప్రసిద్ధి చెందినాడు. శాపం ఫలితంగా భూమిపై నడయాడుతూ ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడని ప్రజలు నమ్ముతారు.

5. పిప్లాడ్
పిప్లాడ్ అవతార్ దధీచి అనే ముని కథతో ముడిపడి ఉంటుంది. అతడి శాపం కారణంగా శివుడు పిప్లాడ్‌గా తిరిగి పుట్టాడని చెబుతారు. పిప్లాడ్ జ్ఞానవంతుడిగా పేరుగాంచాడు. హిందూ పురాణాల్లో తెలివైన రుషిగా ప్రఖ్యాతి గాంచాడు.

6. నంది
నంది హిందువులకు దైవంతో సమానంగా పూజిస్తారు. దీన్ని శివుడి అవతారంగా చెబుతారు. నంది శివుడి వాహనం మాత్రమే కాదు.. అతని ప్రధాన పరిచారకుడు, ద్వార పాలకుడని చెబుతారు. నంది.. బలం, పురుషత్వం, విధేయతకు ప్రతీకగా చెబుతారు.

7. వీరభద్ర
వీరభద్రుడు శివుడి ఉగ్ర రూపంగా చెబుతారు. అతడు శివుడి జటా జూటం నుంచి జనియించాడు. వేయి తలలు, వేయి కన్నులు, వేయి పాదాలు కలిగిన వ్యక్తిగా చెబుతారు. వీరభద్రుడు విధ్వంసానికి చిహ్నం. భక్తులకు శక్తివంతమైన రక్షకుడిగా చరిత్ర చెబుతోంది.

8. హనుమాన్
హనుమంతుడు శివుడు, విష్ణువు ఇద్దరి అవతారం అని చాలా మంది విశ్వసిస్తారు. శ్రీరామునిపై అచంచల భక్తి, మహా బలం, విధేయత చూపించాడు. హనుమంతుడిని ధైర్య సాహసాలు, అంకితభావం, నిస్వార్థ సేవ కోసం భక్తులు కొలుస్తారు.

9. అయ్యప్ప
అయ్యప్పను శివుడు, విష్ణువు ఇద్దరి అవతారంగా పూజిస్తారు. ఆయన్ను శ్రేయస్సు, రక్షణ అందించే భగవంతుడిగా పేర్కొంటాం. అయ్యప్పను నీతి, నైతిక సూత్రాలకు కట్టుబడి ఉన్న దైవంగా జనులు పూజిస్తారు.

10. శరభేశ్వర
శరభేశ్వరుడు శివుడి భీకరమైన రూపంగా చెబుతారు. భగవంతుడు నరసింహుని అహంకారాన్ని జయించడానికి ఈ అవతారం ధరించాడని ప్రతీతి. చాలా తలలు, రెక్కలు కలిగిన పక్షి రూపంలో ఈయన దర్శనమిస్తాడు. శరభేశ్వరుడు శివుని అపారమైన శక్తిని, ఎలాంటి అవరోధాలైనా విజయం సాధించగల ధైర్యాన్ని ఇస్తాడని భక్తుల నమ్మకం.

11. గృహపతి
గృహపతి అనేది గృహస్థ జీవితం, గృహాల రక్షణతో ముడిపడి ఉన్న శివుడి అవతారం. కుటుంబంలో శాంతి, శ్రేయస్సు, సామరస్యం కోసం ఈయనను భక్తులు కొలుస్తారు.

12. దుర్వాసుడు
దుర్వాసుడు క్షణికావేశానికి, శక్తివంతమైన శాపాలు పెట్టగల సామర్థ్యానికి పేరుగాంచిన తెలివైన రుషి. శివుని విధ్వంసక స్వభావంతో ఆయనకు బలమైన బంధం ఏర్పడింది. అందుకే ప్రజలు ఈ రుషిని శివుడి అవతారమని విశ్వసిస్తారు.

13. యక్షేశ్వరుడు
యక్షేశ్వరుడు యక్ష వంశానికి చెందిన శివుడి అవతారం. సంపద, శ్రేయస్సు, సమృద్ధి, అనుగ్రహం లభించేందుకు ఈ దేవుడికి పూజలు చేస్తారు. ఈ అవతారం భక్తుల పట్ల శివుడి దాతృత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

14. సాధోజత్
సాధోజత్ అనేది శివుడి శాంతికి ప్రతిరూపం. సృష్టి, సంతానోత్పత్తికి ఇది సూచిక. సమృద్ధి, శ్రేయస్సు, సామరస్యం, దీవెనల కోసం ఈ అవతారాన్ని ప్రజలు పూజిస్తారు.

15. రిషభ
రిషభ అనేది శివుడితో సంబంధం ఉన్న ఒక దైవిక ఎద్దు. బలం, భూమితో అనుబంధం బలపడటానికి పూజిస్తారు. రిషభ ప్రకృతితో శివుడి అనుబంధాన్ని, పర్యావరణ పరిరక్షకుడిగా ఆయన పాత్రను తెలిజేస్తుంది.

16. యతినాథ్
యతినాథ్ అనేది సన్యాసం, ధ్యానంతో అనుబంధం కలిగిన శివావతారం. ఆధ్యాత్మిక జ్ఞానం, విముక్తి కోరుకునే వారు యతినాథుని కొలుస్తారు. యతినాథ్ ఆధ్యాత్మిక మార్గదర్శిగా, గురువుగా శివయ్య పాత్రను సూచిస్తుంది.

17. శరంగ
శరంగ అనేది మహాశివుడు ప్రయోగించిన ఒక దివ్యమైన విల్లు. ఈ శక్తివంతమైన ఆయుధాన్ని శివుడి అవతారంగా చెబుతారు. ఇది నాశనం చేయలేనిదని, శత్రువులను ఓడిస్తుందని విశ్వాసం. శరంగ యోధుడు, విశ్వానికి సంరక్షకునిగా శివుని పరాక్రమాన్ని తెలియజేస్తుంది.

18. భృంగి
భృంగి అనే మహర్షి శివుడి పట్ల తనకున్న ప్రగాఢ భక్తికి ఫేమస్. అతడు మూడు కాళ్లతో ఉంటాడు. అతను ప్రాపంచిక కోరికలను తిరస్కరించి, శివుడికి పూర్తిగా అంకితమైపోతాడని ప్రతీతి. అచంచలమైన విశ్వాసం, నిబద్ధత కోసం భృంగిని కొలుస్తారు.

19. శరభ
శరభ ఒక పౌరాణిక జీవి. సింహం, పక్షి రూపాల మిశ్రమం. సగం మానవుడు, సగం సింహం అయిన విష్ణువు అవతారం.. నరసింహుడిని వశపరచుకోవడానికి శివుడు ఈ రూపంలో ఉద్భవించాడని చరిత్ర చెబుతోంది. శరభ శివుని బలాన్ని, ఎలాంటి కఠోర పరిస్థితులనైనా అధిగమించగల మహారుద్రుని సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.

ఇవీ చదవండి: Rudraksha: రుద్రాక్ష ఎవరు ధరించాలి? ఈ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? శివానుగ్రహం కోసం ఇలా చేయండి..
Gokarna temple: గోకర్ణ క్షేత్రం గొప్పతనం ఇదీ.. మోక్షాన్ని పొందడానికి మార్గం.. తప్పక తెలుసుకోండి
Lalitha Sahasranamam: లలితా సహస్రనామ పారాయణంతో సకలపాప హరణం.. తప్పక పారాయణం చేయండి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు