HomeUncategorizedAndhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి రైతులకు ఇంత అన్యాయమా?

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి రైతులకు ఇంత అన్యాయమా?

Andhra Pradesh : ఉల్లి రైతులకు ఇంత అన్యాయమా.. కేవలం 66 వేల ఎకరాలలో సాగు.. కర్నూలు 45 వేలు, కడప 11.5వేలు, నంద్యాల 7.8 వేలు మూడు జిల్లా లలో మాత్రమే సాగు జరిగి గత 50 సంవత్సరాలలో లేని సంక్షోభం ఉల్లి రైతుకు వస్తే
మొట్టమొదట 12 రూ కొంటామన్నారు..*6వేల క్వింటాళ్ళు మాత్రమే కొని చేతులెతేసి ఆ డబ్బులు కూడా ఈ రోజుకు చెల్లించక పోవడం అమానుషం*..

ఆ తరువాత మీరే అమ్ముకోండి 12 రూ లోపు అమ్ముకున్న తేడా ఇస్తామన్నారు..అది చేతు లెతేసారు..చివరకు హేక్టరుకు 50 వేలు 45 వేల ఎకరాలకు అన్నారు, మిగిలిన 26 వేల ఎకరాల సంగతి ఏమిటి..

మా అంచనా, రైతుల అంచనా ఎకరానికి 7 నుండి 8 వేల టన్నుల ఉత్పత్తి వచ్చినది.. ప్రభుత్వ యంత్రాంగం అంచనా 6 టన్నులు..
మీరు ప్రకటించిన 12 రూ ×6000 కిలోలు=72 వేలు.
కొంత మంది రైతులు పంట పొలం లోనే వదిలేసారు..కొంత మంది మరింత ఖర్చు పెట్టి హార్వెస్ట్ చేసి పారబోశారు..
మరి కొంత మంది 1 రూ నుండి 3 రూ కి అమ్ముకున్నారు..అంటే ఎంత నష్ట పోయారో కళ్ల ముందే కనపడుతోంది..
ఉల్లి రైతుల సంక్షోభం అనేక సార్లు ప్రభుత్వ అనుకూల పత్రికలలోనే వచ్చింది..
పంట తీసేసిన తరువాత అక్టోబర్ 15 వరకూ e పంట నమోదు చేస్తూనే ఉన్నారు. ఇది వాస్తవ సాగు దారుడుకి అన్యాయం జరిగే అవకాశం కాదా..
రైతుల కు అయిన సాగు ఖర్చు లో కొనే వారు లేక పూర్తిగా నష్ట పోయిన పరిస్థితిలో మీరు ప్రకటించిన హేక్టరుకు 50 వేలు మా నష్టం లో ఏ మాత్రం కూడా ఆడుకోదు అని రైతులు తీవ్ర ఆవేదన చెందు తున్నారు.. అయినా ఇంత వరకూ చెల్లించలేదు..కొనుగోలు చేసిన ఉల్లి కే ఈ రోజుకి డబ్బు చెల్లించక, ఇక ఇది ఎప్పుడు చెల్లిస్తారు..

*వేరు శనగ సాగే సంక్షోభం*.. సాగు లక్ష్యం 14 లక్షల ఎకరాలు. సాగు జరిగినది కేవలం 5.14 లక్షల ఎకరాలలో మాత్రమే..సాగు జరిగిన పొలంలో కూడా దిగుబడి పడిపోయి.. ఆ పంటకు కూడా మద్దతు ధర రాక తీవ్ర సంక్షోభం లో రైతులు..

*ప్రత్తి 13.93 ఎకరాలు సాగు లక్ష్యం* అయితే సాగు జరిగినది 11.27 లక్షల ఎకరాలు.. వర్షాలకు పూత, పింద రాలి పోయినది..కాయలలోనే గింజలు మొలకెత్తిన పరిస్థితి..దిగుబడులు గణ నీయంగా పడిపోయి తీవ్ర సం్షోభంలో ప్రత్తి రైతు..ఇది కూడా 55% కర్నూలు జిల్లాలోనే సాగు..

*వరి* సాగు లక్ష్యం 38.32 లక్షల ఎకరాలు. సాగు జరిగినది 38.52 లక్షల ఎకరాలు..నదుల లో, ప్రాజెక్టులలో నీరు ఉండటం మూలంగా సాగు లక్ష్యాన్ని అందుకున్నది. కానీ దురదృష్టం మొన్థా తుఫాన్ ప్రాంతం లోనే బాపట్ల నుండి శ్రీకాకుళం వరకూ కె సి కెనాల్ ఆయకట్టు నంద్యాల కడప జిల్లాలలో 29 లక్షల ఎకరాలు ఉండి షుమారు 11 లక్షల ఎకరాలలో పైరు నేలకు ఒరిగి పోయి తీవ్రం గా దెబ్బ తిన్నది..

*రాష్ట్రం మొత్తం సాగులో ఈ 3 పంటలే 78%*..

4.6 లక్షల ఎకరాలలో సాగు జరిగిన మొక్క జొన్న ప్రకటించిన కనీస మద్దత్తు ధర కు కొనే వారు లేరు..
*ఏ పంట చూసినా గిట్టుబాటు ధర లేక అనంతపురం నుండి శ్రీకాకుళం వరకూ రైతులు తీవ్ర సంక్షోభం లో ఉన్నారు*..

*e పంట నమోదు లో చాలా అవకతవకలు కనిపిస్తున్నాయి*..
కొన్ని మండలాలలో సాగు జరిగిన భూమి కంటే e పంట నమోదైన భూమి ఎక్కువ ఉన్నది..ఇది ఎలా సాధ్యం..
ఆధారాలతో సహా బాపట్ల జిల్లా రిపోర్ట్ జత చేస్తున్నాను..
రాష్ట్రం లో వ్యవసాయ శాఖ కు మంత్రి ఉన్నాడా..
ఆయనెవరో వ్యవసాయ శాఖ మంత్రి నని కేవలం జగన్ మోహన రెడ్డి గారిని విమర్శించడానికి, అప్పుడప్పుడు మాత్రమే కనపడుతుంటాడు..

రైతులకు ఎంతో ఉపయోగపడిన ఉచిత పంటల బీమా ఎత్తి వేశారు..అది అమలులో ఉండి ఉంటే ఈ సంవత్సరం రైతులకు చాలా ఊరటగా ఉండేది..

తక్షణం అన్నదాతా సుఖీభవ క్రింద ఎన్నికలలో మెరిచ్చిన హామీ ప్రకారం మొత్తం విడుదల చెయ్యండి.

దెబ్బ తిన్న
పంటలన్నింటికీ ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఇస్తారో ప్రకటించి ఏన్యూమరేషన్ పూర్తి అయిన వెంటనే విడుదల చెయ్యండి..
అలా చెయ్యని పక్షం లో రైతులు రబీ సాగు చెయ్యడం చాలా కష్టం అవుతుంది..

ఇప్పటికే గ్రామాలలో ఆర్ధిక సంక్షోభం తో మైక్రో ఫైనాన్స్ బారిన పడుతున్నారు..

దీనిపై తక్షణమే ద్రుష్టి పెట్టాలి..

కన్నీరు పెడుతున్న రైతుకు ఉపయోగ పడేలా వ్యవసాయ శాఖ మంత్రి గా అవకాశం దొరకడం, వ్యవసాయ శాఖ లో ఉద్యోగం రావడం అదృష్టం..
ఈ అదృష్టాన్ని సరిగా వినియోగించుకుని..ఈ సాక్షోభ సమయం లో రైతు కన్నీరు తుడిసే ప్రయత్నం కొద్దిగా నైనా చెయ్యమని విజ్ఞప్తి చేస్తున్నాను..

– ఎంవీఎస్ నాగిరెడ్డి
YSRCP ప్రధాన కార్యదర్శి, (వ్యవసాయం..రైతు సంక్షేమం)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్

ఇవీ చదవండి: Telangana : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం: పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ₹10,000 పరిహారం
Andhra Pradesh : ధాన్యం కొనుగోళ్లకు రైతులు వాట్సాప్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
Medical colleges privatization : ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. టెండర్ నోటిఫికేషన్ జారీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు