HomeCinemaShivani Nagaram: ‘లిటిల్ హార్ట్స్’తో కుర్రాళ్ల మనసు దోచుకున్న హీరోయిన్

Shivani Nagaram: ‘లిటిల్ హార్ట్స్’తో కుర్రాళ్ల మనసు దోచుకున్న హీరోయిన్

Shivani Nagaram: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘లిటిల్ హార్ట్స్’ మూవీ క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ అద్భుతమైన విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో మౌళి హీరోగా నటించగా, క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న కథానాయిక శివాని నాగారం. మరి ఈ అమ్మడు ఎవరంటే? Shivani Nagaram

ఎంట్రీ & బ్యాక్‌గ్రౌండ్
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. తొలిరోజే బ్రేక్ ఈవెన్ అయ్యి, హిట్ టాక్‌తో దూసుకెళ్లింది. ఇందులో కాత్యాయనీ పాత్రలో నటించిన శివాని నాగారం పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

శివాని కేవలం నటి మాత్రమే కాదు, సింగర్ మరియు కూచిపూడి డ్యాన్సర్ కూడా. 1988లో హైదరాబాద్‌లో జన్మించిన ఆమె చిన్నప్పటి నుంచే కూచిపూడి నేర్చుకుంది. విల్లా మేరీ కాలేజీలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

కెరీర్ జర్నీ
‘అంతర్గత’ అనే షార్ట్ ఫిల్మ్‌తో నటనలోకి అడుగుపెట్టింది.
2020లో ‘మిస్టర్ గర్ల్‌ఫ్రెండ్’ వెబ్ సిరీస్ చేసింది.
ఇన్‌స్టాలో చూసి ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ మూవీలో కూడా ఛాన్స్ దక్కింది.
మొదటి సినిమా కంటే ముందు ‘జాతిరత్నాలు’లో న్యూస్ ప్రెజెంటర్‌గా చిన్న రోల్ చేసింది.

వ్యక్తిగత ఆసక్తులు
ఫ్రీ టైమ్‌లో పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్ నేర్పించడం ఆమెకు ఇష్టమైన పని. తన తమ్ముడితో కలిసి పాటలు పాడుతూ, ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

ప్రస్తుత ప్రాజెక్ట్స్
లిటిల్ హార్ట్స్’తో యూత్‌ని ఇంప్రెస్ చేసిన శివాని, ఇప్పుడు సుహాస్ హీరోగా నటిస్తున్న ‘హే భగవాన్’ సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతోంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇవీ చదవండి: Tollywood : అక్క హీరోయిన్.. చెల్లి కెరీర్ పీక్‌లో సినిమాలకు గుడ్ బై!
Janhvi Kapoor : జాన్వీ లేటెస్ట్ ఫొటో షూట్ వైరల్.. అందాల దేవత!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు