HomeCinemaHit Movies : 25 కోట్లతో తీసిన సినిమా.. 340 కోట్ల వసూళ్లు.. ఇప్పుడు ఓటీటీలో...

Hit Movies : 25 కోట్లతో తీసిన సినిమా.. 340 కోట్ల వసూళ్లు.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్

Hit Movies : నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులపై ఎప్పటికీ గాఢమైన ముద్ర వేస్తాయి. అలాంటి ఒక సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఎలాంటి హంగామా లేకుండా విడుదలైన ఈ మూవీ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఒక సమాజం ఉనికి కోసం చేసిన పోరాటం, వలసల భయానక పరిస్థితులు, ఎదుర్కొన్న కష్టాలను హృదయాన్ని కదిలించేలా చూపించిందీ చిత్రం.

అదే ‘ది కాశ్మీర్ ఫైల్స్’. 1990లలో కాశ్మీర్ లోయ నుండి కాశ్మీరీ పండిట్ల సామూహిక వలసలను చూపిస్తూ, ఈ సినిమా ప్రేక్షకులను కదిలించింది. కేవలం ₹25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ₹340 కోట్లకుపైగా వసూలు చేసింది.

బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తెరకెక్కించగా, విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో కాసుల వర్షం కురిసింది. ఒక యువ కాశ్మీరీ హిందూ విద్యార్థి తన కుటుంబం గతాన్ని, వలస వెళ్ళడానికి దారితీసిన నిజమైన కారణాలను అన్వేషించే కథ చుట్టూ సినిమా తిరుగుతుంది.

ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం Zee5లో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో ఉంది.

ఈ చిత్రంలో పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, మృణాల్ కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. బడ్జెట్ పరంగా చిన్నదైనా, కంటెంట్ పరంగా గొప్పదైన ఈ సినిమా బాలీవుడ్‌లో మైలురాయిగా నిలిచింది.

ఇవీ చదవండి: OTT Movie : ఇదెక్కడి మూవీ అండీ బాబూ.. సైకో కిల్లర్
OTT Movie : నో యాక్షన్.. నో విలన్స్.. కానీ ఓటీటీలో సంచలనం ఈ మూవీ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు