HomeCrime NewsTelangana News: రన్నింగ్ కారులో పాము.. దంపతులు షాక్‌తో బయటకు!

Telangana News: రన్నింగ్ కారులో పాము.. దంపతులు షాక్‌తో బయటకు!

Telangana News: పాము అనగానే చాలామందికి గుండెల్లో దడ మొదలవుతుంది. ఆ పాము మన పక్కనే ఉంటే? మన కాళ్ల కిందనే కదలాడుతుంటే? ఊహకే గబగబా గుండె కొట్టుకోవడం సహజం. అచ్చం అలాంటి సంఘటనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది.

భూపాల్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి పెళ్లి ముగించుకొని కారులో ఇంటికి బయలుదేరాడు. అంబేద్కర్ సెంటర్ దగ్గరికి రాగానే ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. కారణం? అతని కాళ్ల కింద పాము కనిపించింది! వెంటనే భార్యకు చెప్పగా ఆమె షాక్‌కు గురైంది. ఇద్దరూ ఆలోచించకుండానే కారులోంచి దూకేశారు.

తర్వాత స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. కొద్ది సేపట్లో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా ఆ పామును పట్టుకున్నాడు. దీంతో పెను ప్రమాదం తప్పి దంపతులు ఊరట పడ్డారు.

కారులోంచి బయటకు తీసిన పామును చూసేందుకు స్థానికులు ఆసక్తిగా గుమిగూడారు. చాలామంది వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. చివరికి స్నేక్ క్యాచర్ ఆ పామును అడవిలో వదిలి భద్రపరిచాడు.

ఇవీ చదవండి: Heavy Rain Alert: తెలంగాణలో నేడు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు
Congress : దూసుకుపోతున్న‌ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు.. త‌ల‌స‌రి ఆదాయంలో తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ టాప్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు