IIM Ahmedabad : భారతీయ విద్యను ప్రపంచానికి తీసుకెళ్లే దిశగా ఒక కీలక ముందడుగు పడింది. ఐఐఎం అహ్మదాబాద్ దుబాయ్‌లో తన కొత్త ఇంటర్నేషనల్ క్యాంపస్‌ను ప్రారంభించింది. గురువారం (సెప్టెంబర్ 11) దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ క్యాంపస్‌ను ఆవిష్కరించగా, ఈ వేడుకకు భారత విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. IIM Ahmedabad
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇది భారతీయ విద్యా వ్యవస్థకు గ్లోబల్ రీకగ్నిషన్ దిశగా ఒక గొప్ప అడుగని, దేశంలోని అత్యుత్తమ ప్రతిభను ప్రపంచానికి అందజేస్తుందని అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ సెప్టెంబర్ 10-11 తేదీల్లో యూఏఈ పర్యటనలో భాగంగా దుబాయ్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలి విదేశీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ తో పాటు ఐఐఎం అహ్మదాబాద్ దుబాయ్ క్యాంపస్‌ను ప్రారంభించారు. విద్యా రంగంలో ఇరు దేశాల మధ్య సహకార అవకాశాలను విస్తరించడం, ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వడం, యువత ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కొత్త అవకాశాలను అన్వేషించడం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్, “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊహించిన విధంగా భారతీయ విద్య ప్రపంచీకరణలో దుబాయ్ క్యాంపస్ ఒక పెద్ద ముందడుగు. భారతీయ స్పూర్తి, ప్రపంచ దృక్పథం అనే భావనకు దుబాయ్ ఒక ఉత్తమ వేదికగా నిలుస్తోంది” అని పేర్కొన్నారు.
అదేవిధంగా, విద్యా సహకారం, జ్ఞాన మార్పిడి, ఆవిష్కరణలపై UAE నేతలు, మంత్రులు, విద్యావేత్తలతో మంత్రి కీలక చర్చలు జరిపారు. అబుదాబి విద్య, జ్ఞాన విభాగం చైర్‌పర్సన్ సారా ముసల్లంను కూడా ఆయన కలిసారు. అదనంగా IIT ఢిల్లీ–అబుదాబి క్యాంపస్ ను సందర్శించారు.
ఇవీ చదవండి: Pawan Kalyan: ఉత్తర అమెరికాను ఊపేస్తున్న OG ఫీవర్.. రికార్డు కలెక్షన్లు
Helicopter Crash: అమెరికాలో మరో హెలికాప్టర్ క్రాష్.. ప్రయాణికులు బుగ్గి!
